Suryaa.co.in

Andhra Pradesh

గౌరవ డాక్టరేట్ అందుకున్న కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్

– రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత ఇస్తూ రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు
– రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి

తిరుపతి, నవంబర్ 16 : వ్యవసాయ రంగంలో వివిధ పంటలలో సాంకేతికంగా నూతన వంగడాలను రూపొందించడం దేశ ఆహార భద్రతను సాదించడంలో వ్యవసాయ రంగం ముఖ్య పాత్ర పోషించిందని కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. బుధవారం స్థానిక శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఆడిటోరియ౦ నందు ఆచార్య ఎన్.జి రంగ వ్యవసాయ విశ్వ విద్యాలయ ఆద్వర్యంలో పాల్గొని ముఖ్య అతిథిగా విచ్చేసిన కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి కాకాని గోవర్దన రెడ్డి, ఆం.ప్ర జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుతో కలిసి అధ్యాపకులు, విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమo లో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ.. ఆచార్య ఎన్.జి రంగ వ్యవసాయ విశ్వ విద్యాలయం వారి ఆద్వర్యంలో గౌరవ డాక్టరేట్ అందుకోవడం నా జీవితంలో మరిచిపోని రోజుగా మిగిలిపోతుంది అని అన్నారు. డాక్టరేట్ ఇచ్చిన ఆచార్య ఎన్.జి రంగ వ్యవసాయ విశ్వ విద్యాలయ సిబ్బంధికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. వ్యవసాయ రంగ అభివృద్దికి వ్యవసాయ విశ్వ విద్యాలయం శాస్త్రవేత్తలు, సిబ్బంది ఎంతో కృషి చేశారని, దేశంలో 74 వ్యవసాయ విశ్వ విద్యాలయాల్లో ఆచార్య ఎన్.జి రంగ విశ్వ విద్యాలయం 11 వ స్థానంలో ఉందని చెప్పడానికి చాలా గర్వంగా ఉందని తెలిపారు.

వ్యవసాయ రంగంలో వివిధ పంటలలో సాంకేతికంగా నూతన వంగడాలను రూపొందించడం దేశ ఆహార భద్రతను సాదించడంలో వ్యవసాయ రంగం ముఖ్య పాత్ర పోషించిందని, దేశంలో వ్యవసాయ విశ్వ విద్యాలయాల శాస్త్రవేత్తలు కృషి ఫలితంగా మన దేశం ఆహార దాన్యాల ఉత్పత్తిలో స్వయం సంవృద్దిని సాదించడమే కాక ఆహార ధాన్యాలు వివిధ పంటల ఉత్పత్తులను ఎగుమతి చేయడం జరుగుతోందని తెలిపారు. వ్యవసాయ రంగంలో మనం సాధించిన ప్రగతి ప్రపంచ దేశాల్లో ఆహార ఉత్పతుల కొరకు మన దేశం వైపు చూసేలా చేయడం గర్వించదగ్గ విషయమని, అభివృద్ది చెందిన దేశంగా భారత్ అవతరించేలా వ్యవసాయ రంగ పాత్ర కీలకమైందని తెలిపారు.

అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ .. రాష్ట్ర వ్యవసాయ రంగ అభివృద్దిలో ఆచార్య ఎన్.జి.రంగ విశ్వ విద్యాలయం ముఖ్య పాత్ర పోషిస్తోందని తెలిపారు. బి.పి.టి- 5204(సాంబా మహసూరి), ఎం.టి.యు 7029(స్వర్ణ), ఎం.టి.యు 1001(విజేత) వంటి రకాలు దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయనీ, దేశంలోనే మొదటి సారిగా వ్యవసాయ రంగంలో డ్రోన్ ల వినియోగం వంటి నూతన విధానాలను ప్రవేశ పెట్టి అనేక విప్లవాత్మక మార్పులకు నాంది పలికిందని తెలిపారు.

వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాదాన్యమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వై.ఎస్.ఆర్ రైతు భరోసా కేంద్రాలను గ్రామ స్థాయిలో రైతులకు సేవలను అందించేలా తీసుకురావడం జరిగిందని తెలిపారు. రాష్ట్రం లో మొత్తం 10,778 రైతు భరోసా కేంద్రాలకు వ్యవసాయ విశ్వ విద్యాలయం సాంకేతిక సహకారం అందించడంతో పాటు రైతు భరోసా కేంద్రాల ద్వారా అమలవుతున్న వ్యవసాయ కార్యక్రమాలు అన్నదాతకు తోడ్పతున్నాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంట్ సభ్యులు గురుమూర్తి, రెడ్డెప్ప, మిథున్ రెడ్డి, శ్రీ వేంకటేశ్వర వ్యవసాయ కళాశాల వైస్ చాన్సిలర్ విష్ణు వర్ధన్ రెడ్డి, శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ వైస్ చాన్సిలర్ పద్మనాభ రెడ్డి, ఆచార్య ఎన్.జి రంగ విశ్వ విద్యాలయం బోర్డు మెంబర్స్ పి.వి.ఆర్ రెడ్డి,టి.వి మురళీ నాథ్ రెడ్డి, ఆచార్య ఎన్.జి రంగ విశ్వ విద్యాలయం రిజిస్ట్రార్ జి.రామారావు అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE