విపత్తు ఏదైనా.. ఆపద ఎక్కడైనా.. నిముషాల్లో స్పందించేలా ఏపీ అగ్నిమాపక శాఖ రీ-లోడెడ్! అమరావతి పరేడ్ గ్రౌండ్ వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అత్యాధునిక అగ్నిమాపక వాహనాలను జెండా ఊపి ప్రారంభించారు.
ప్రజల ప్రాణ రక్షణ కోసం ప్రభుత్వం భారీ ప్రణాళికను అమలు చేస్తోంది. అందులో భాగంగా తొలి విడతగా రూ. 33.25 కోట్ల విలువైన అత్యాధునిక సామగ్రి ఇప్పుడు సిద్ధం!
కొత్తగా రంగంలోకి దిగిన ఆయుధాలు:
ఫైర్ ఇంజన్లు: రూ. 18 కోట్లతో 25 అధునాతన శకటాలు.
మెరుపు వేగం: రూ. 10 కోట్లతో 40 క్విక్ రెస్పాన్స్ వాహనాలు (హై ప్రెషర్ పంప్స్)
జల రక్షణ: రూ. 2.49 కోట్లతో 50 ఇన్ ఫ్లేటబుల్ రబ్బర్ బోట్లు.
ప్రాణవాయువు: రూ. 2.08 కోట్లతో 30 బీఏ సెట్ కంప్రెసర్లు.
నాడు దేశానికే మోడల్.. నేడు మళ్ళీ పూర్వ వైభవం దిశగా!
“ఒకప్పుడు పొరుగు రాష్ట్రాలకు సహాయం చేసిన చరిత్ర మనది. ఇప్పుడు అదే స్థాయికి ఎదగాలి” అని అధికారుల్లో సీఎం చంద్రబాబు స్ఫూర్తి నింపారు. పెరిగిన ఎత్తైన భవనాలు (Sky Scrapers), నగరాల విస్తరణకు అనుగుణంగా టెక్నాలజీని వాడుకుంటూ మన రక్షణ వ్యవస్థ నంబర్ వన్ కావాలని పిలుపునిచ్చారు.
సవాళ్లు ఎన్ని ఉన్నా.. అధునాతన పరికరాలు + అంకితభావం కలిగిన సిబ్బంది = సురక్షిత ఆంధ్రప్రదేశ్!