(కెఎల్ఎన్రావు)
ప్రపంచ రాజకీయం (Geo-politics) వేడెక్కుతోంది. ఇండియా పై అమెరికా ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ తరచూ టారిఫ్‌లు పెంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కానీ ఈ ఆర్థిక ఆంక్షల వెనుక ఉన్న అసలు కారణాలు చూస్తే, ఇవి కేవలం ట్రేడ్ విషయంలోని డిస్ప్యూట్లు కాదని స్పష్టమవుతుంది. వాస్తవానికి ఇవి భవిష్యత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలపై అధికారానికి సాగుతున్న యుద్ధం లో భాగం మాత్రమే.
1. రష్యా ఆయిల్ – డాలర్ కు ఎదురుదెబ్బ
ఇండియా ఇటీవల కాలంలో రష్యా నుండి భారీగా ముడి చమురు (crude oil) దిగుమతి చేసుకుంటోంది. కానీ ముఖ్యమైన విషయం ఏమిటంటే – ఈ ట్రాన్సాక్షన్లు అమెరికన్ డాలర్ ద్వారా కాకుండా, ఇండియన్ రూపాయ్ లో జరుగుతున్నాయి.
ఇది డాలర్ యొక్క గ్లోబల్ హెడ్జిమనీ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అమెరికా అనేక దశాబ్దాలుగా ప్రపంచ దేశాలను డాలర్‌తో ట్రేడ్ చేయమని నిర్బంధిస్తోంది. ఇది అమెరికా ఆర్థిక శక్తిని నిలబెట్టే ప్రధాన ఆధారంగా మారింది. కానీ ఇప్పుడు ఇండియా, చైనా, రష్యా లాంటి దేశాలు డెడాలరైజేషన్ (De-dollarization) వైపు అడుగులు వేస్తుండటంతో అమెరికా ఆందోళన చెందుతోంది.
2. బ్రిక్స్ – కొత్త వరల్డ్ ఆర్డర్
ఇండియా బ్రిక్స్ (BRICS) సమూహంలో కీలక పాత్ర పోషిస్తోంది. బ్రిక్స్ దేశాలు (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) కలిపి కొత్త ఫైనాన్షియల్ సిస్టమ్ రూపొందించాలనే ప్రయత్నాల్లో ఉన్నాయి. రష్యాతో రూపాయ్-రూబుల్ ట్రేడ్, చైనాతో యుయాన్ ట్రేడ్ వంటి మార్గాలు బ్రిక్స్ కరెన్సీ ప్రారంభానికి బీజం వేస్తున్నాయి.
ఈ మార్పులు డాలర్ ఆధిపత్యాన్ని తిరగరాయే స్థాయిలో ఉన్నాయి. అందుకే అమెరికా ఈ కదలికలను కళ్లారా గమనిస్తూ, ఆర్థిక, వ్యూహాత్మకంగా నిరోధించడానికి ప్రయత్నిస్తోంది.
3. India Club – మేరైన్ ఇన్సూరెన్స్ లో సంచలనం
ఇంకొక సైలెంట్ రివల్యూషన్ – ప్రపంచ మేరైన్ ఇన్సూరెన్స్ రంగాన్ని decades పాటు యూఎస్, యూకే వశపరచుకున్నాయి. ప్రధానంగా P&I Clubs (Protection and Indemnity) – ఈ సంస్థలు ప్రపంచంలోని షిప్పింగ్ కంపెనీలకు మరిన్ ఇన్సూరెన్స్ ఇస్తాయి. కానీ వీటిని లండన్ కేంద్రంగా ఉన్న కొన్ని కంపెనీలు కంట్రోల్ చేస్తూ, ఇతర దేశాలపై ఆధిపత్యాన్ని చెలాయించాయి.
ఇప్పుడు భారత్ India Club అనే పేరుతో తన సొంత మేరైన్ ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించింది. ఇది కేవలం ఇండియన్ షిప్పింగ్ కంపెనీలకే కాదు, ఇతర దేశాలకు కూడా ఇన్సూరెన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. పైగా ఇండియన్ నేవీ సెక్యూరిటీ గ్యారంటీ కూడా ఇస్తామని ప్రకటించడం — ఒక రకాల మేరైన్ డిఫెన్స్ అగ్రిమెంట్ లా మారుతోంది.
4. అమెరికా అసహనం – ఇండియా మీద ఆంక్షల యత్నం
ఈ మూడు ప్రధాన కారణాల (De-dollarization, BRICS strengthening, Insurance Monopoly break) వల్ల అమెరికా అసహనానికి లోనవుతోంది. ఇండియా ఎప్పటికీ పాశ్చాత్య విధానాలను అనుసరించాలి అనుకునే అమెరికాకు, ఇప్పుడు ఇండియా సొంత మార్గాల్లో నడవటం సహించలేకపోతోంది.
దీంతో ఆయిల్, స్టీల్, ఫార్మా, టెక్నాలజీ రంగాలలో టారిఫ్ పెంపు ద్వారా భారత్‌ను ఆర్ధికంగా ఒత్తిడికి గురిచేయాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు.
5. జియోపాలిటిక్స్ – ఒక నూతన ప్రపంచం వైపు
ప్రపంచం ఇప్పుడు ఒక బహుళ ధ్రువాల (multi-polar) దిశగా కదులుతోంది. అమెరికా ఆధిపత్యం క్రమంగా తగ్గుతుంటే, బ్రిక్స్ లాంటి సమూహాలు ఎదుగుతున్నాయి. భారత్ ఈ మార్పులో ఒక కీలక ప్లేయర్ గా మారుతోంది.
అమెరికా డాలర్ కు ప్రత్యామ్నాయం రావడం, షిప్పింగ్ లైన్లలో స్వావలంబన పెరగడం, గ్లోబల్ నార్త్ – గ్లోబల్ సౌత్ మధ్య విభజన పెరగడం ఇవన్నీ భవిష్యత్ ఆర్థిక యుద్ధాల సంకేతాలు మాత్రమే.
ఆత్మనిర్భర్ భారత్ – ప్రపంచానికి మార్గదర్శి
ఇండియా ఇప్పుడు కేవలం ఒక వినియోగ దేశంగా కాకుండా, పొలిటికల్ మరియు ఎకనామిక్ శక్తిగా ఎదుగుతోంది. ఈ మార్పు కొన్ని పాత సామ్రాజ్యవాద దేశాలకు నచ్చడం లేదు. కానీ ప్రజల మద్దతుతో, వ్యూహాత్మక ప్లానింగ్ తో ఇండియా ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది.
ప్రపంచంలో తన ఉనికి ముఖ్యంగా .. డాలర్- ఆయుధాల తోనే మనుగడ వుందని అమెరికా అధ్యక్షుడు ఆడుతున్న మాయా జూదం లో వుందని, ఈ విషయంలో మరోసారి రుజువు అయ్యింది.
వివరణ: నడింపల్లి సీతారామరాజు
-సీనియర్ పాత్రికేయులు
(వాషింగ్టన్ డిసి)