– బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్ష్మణ్
హైదరాబాద్: పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ జయంతి వేడుకలు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్ష్మణ్ , బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి , రాష్ట్ర పదాధికారులు. సీనియర్ నాయకులతో కలిసి జయంతి వేడుకల్లో పాల్గొని పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ చిత్ర పటానికి నివాళులు అర్పించడం జరిగింది.
ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు డా.కె.లక్ష్మణ్ మాట్లాడుతూ….పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి అంత్యోదయ ద్వారా సామాజిక న్యాయానికి ఒక కొత్త దిశను సూచించారు. చిట్ట చివరి వ్యక్తి అభ్యున్నతిని లక్ష్యంగా పెట్టుకున్న ఆయన సిద్ధాంతం, సమగ్ర అభివృద్ధికి మార్గదర్శిగా భారత్ ప్రయాణాన్ని ముందుకు నడిపిస్తోంది. భారతీయ విలువలపై ఆధారపడి, పండిట్ దీనదయాళ్ గారు ఇచ్చిన మార్గదర్శకం, ఈనాటికీ సమకాలీన సమస్యలకు పరిష్కార మార్గాలను సూచిస్తుంది.
దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ సేవా పక్వాడ్ పేరుతో సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు మహనీయులు జన్మించినటువంటి పుణ్య దినాలను పురస్కరించుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
పండిట్ దీన్ దయాళ్ ప్రవచించిన అంత్యోదయ సిద్ధాంతం ప్రకారం, సమాజంలోని పేదరికంలో మగ్గేటువంటి వర్గాల్లో అత్యంత పేద వ్యక్తులకే మొదట ప్రాధాన్యం కల్పించడమే లక్ష్యంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం వెనకబడిన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది.
ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ద్వారా, బ్యాంకుల్లో ఖాతాలు లేని పేదలకు ఖాతాలు తెరవడం జరిగింది, ఫలితంగా సుమారు 60 కోట్ల మంది ప్రజలకు బ్యాంకు సేవలు అందుతున్నాయి. చిరు వ్యాపారులకు రుణ సదుపాయాలు కల్పించడం ద్వారా వారి ఆర్థిక స్వావలంబనకు మద్దతు అందించడం జరుగుతోంది.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన ద్వారా ఇల్లు లేని నిరుపేదలకు సుమారు నాలుగు కోట్ల మందికి ఇండ్లు నిర్మించారు.స్వాతంత్ర్యం వచ్చిన 70 సంవత్సరాలలో కూడా కనీసం మరుగు దుడ్లు లేకుండా ఉన్నటువంటి పేదలకు కేంద్ర ప్రభుత్వ సహకారంతో మరుగుదొడ్లు నిర్మించి, వారి ఆత్మగౌరవాన్ని కాపాడింది.
ఇతర దేశాల మీద ఆధారపడితే సమస్యలు వస్తాయి. ప్రస్తుతం, పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, నేపాల్, ఫిలిపీన్స్, పాకిస్తాన్ రాజకీయ, ఆర్థిక అస్థిరతలకు గురవుతున్నాయి, ప్రజలు కష్టాల్లో పడుతున్నారు. అందుకే, ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ ధ్యేయంతో, మేక్ ఇన్ ఇండియా ప్రణాళికను ప్రోత్సహిస్తూ, స్వదేశీ వస్తువులే వాడాలని, స్వదేశీ వస్తువులను విక్రయించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
విభిన్న రకాల పన్నుల ద్వారా ప్రజలను పీడిస్తున్న వ్యవస్థను సమూలంగా మార్చి, రెండు స్లాబ్ ల విధానం ద్వారా పేదలు, వ్యాపారులకు వెసలుబాటు కల్పించారు. 90% పైగా నిత్యావసర వస్తువులు, సరుకులు కొనుగోలు చేసేవారైన పేద ప్రజలకు 5% లేదా ప్రాణాంతక వ్యాధులు సంభవిస్తే ఆరోగ్య బీమా మరియు జీరో-టాక్స్ విధానం ద్వారా సహకారం అందించారు. ఈ విధంగా, గొప్ప సంస్కరణవాది గా నరేంద్ర మోదీ చేపట్టిన కార్యక్రమానికి వ్యాపారులు కూడా మద్దతు ఇవ్వాలి. వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కూడా స్వదేశీ విధానంతో ముందుకు పోవాలి.
అమెరికా లాంటి అగ్రదేశాలు ఆంక్షలు పెట్టి, టారిఫ్లు మరియు పెనాల్టీల పేరుమీద భారతీయులను ఇబ్బంది పెట్టిన సందర్భంలో, ఈ సంస్కరణ మన మేధాసంపత్తి, యువత, మానవ వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకునే విధంగా అనేక స్టార్టప్లకు మద్దతు అందిస్తుంది.
పేద, మధ్యతరగతి ప్రజలకు రూ. 12 లక్షల వరకు ఎటువంటి పన్ను చెల్లించకుండానే పన్ను మినహాయింపు పొందగలుగుతున్నారు. ఇవన్నీ భారతదేశం సమగ్ర అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలు. వీటన్నింటిని ప్రజల భాగస్వామ్యం ముఖ్యం. స్వదేశీ వస్తువులు వాడి, స్వదేశీ ఉత్పత్తులను విస్తృతంగా ప్రచారం చేయాలి.