Suryaa.co.in

Andhra Pradesh

రోడ్డెక్కితే యూజర్‌ ఛార్జీలు వసూలంట!

– సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్‌ ఎగ్గొట్టడమే లక్ష్యం
– చంద్రబాబు దిగిపోతూ రూ.42వేల కోట్లు ఎగ్గొట్టారు
– అవన్నీ మా ప్రభుత్వం చిరునవ్వుతో చెల్లించింది
– సంపద సృష్టి అంటే అమ్మకాలు.. ఛార్జీల బాదుడేనా?
– ఆరు నెలలు కాకుండానే రూ.18వేల కోట్ల భారం
– విద్యుత్‌ ఛార్జీల రూపంలో బాదుడే బాదుడు
– ఏనాడైనా ఆయన తల్లిదండ్రులను చూశారా?
– రాజకీయంగా ఎదిగాక ఇంటికి తీసుకొచ్చారా?
– చక్కగా భోజనం పెట్టి, బాగా చూసుకున్నారా?
– వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం, వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

తాడేపల్లి: రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల నిర్వహణ. సభలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు.. ముఖ్యంగా సీఎం చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు, విమర్శలపై వైయస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వరసగా రెండోసారి పార్టీ కేంద్ర కార్యాలయంలో సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు.

వైయస్‌ జగన్‌ ఏం మాట్లాడారంటే..: బడ్జెట్‌ డాక్యుమెంట్‌ ప్రకారం.. రాష్ట్రానికి సంబంధించిన అప్పులు 2018–19 నాటికి రూ.2.57 లక్షల కోట్లు. గవర్నమెంట్‌ గ్యారెంటీ ఇచ్చిన అప్పులు మరో రూ.55 వేల కోట్లు అని తానే తేల్చాడు. రెండూ కలిపితే చంద్రబాబు దిగిపోయే నాటికి ఉన్న అప్పులు రూ.3.13 లక్షల కోట్లు. అదే 2024–25లో వైయస్సార్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అప్పులు రూ.4.91 లక్షల కోట్లకు ఎగబాకాయని, వాటికి ప్రభుత్వ గ్యారెంటీ అప్పులు మరో రూ.1.54 లక్షల కోట్లు కలిపితే, మొత్తం అప్పు రూ.6.46 లక్షల కోట్లని తానే తేల్చాడు.

ఇదంతా బడ్జెట్‌ డాక్యుమెంట్‌లో ఉంది. 2023–24 కాగ్‌ రిపోర్ట్‌లో కూడా ఆ మొత్తాన్నే రుణంగా చూపారు. సాక్ష్యాధారాలతో సహా ఇక్కడ చూపుతున్నాం. అందుకే చంద్రబాబుని మరోసారి అడుగుతున్నా. అయ్యా అబద్ధాలు చెప్పడం ధర్మమేనా? ఎక్కడ రూ.11 లక్షల కోట్లు, రూ.12.5 లక్షల కోట్లు, స్పిల్‌ ఓవర్‌ అకౌంట్ల మీద కూడా ఇదే రకమైన దుష్ప్రచారం. ప్రతి సంవత్సరం స్పిల్‌ ఓవర్‌ అకౌంట్స్‌ ఉంటాయి. ప్రతి బడ్జెట్‌ నుంచి ఇంకో బడ్జెట్‌కు సర్వ సాధారణంగా స్పిల్‌ ఓవర్‌ బిల్స్‌ ఉంటాయి.

చంద్రబాబు 2019లో దిగిపోతూ స్పిల్‌ ఓవర్‌గా వదిలిపెట్టి పోయిన బకాయిలు ఏకంగా రూ.42,183 కోట్లు. ఆరోగ్యశ్రీవి రూ.680 కోట్లు, ధాన్యం సేకరణ, విత్తన బకాయిలు రూ.960 కోట్లు, కన్జూమర్స్‌ అఫైర్స్, ఫుడ్‌ అండ్‌ సివిల్‌ సప్లయ్స్‌వి రూ.5,786 కోట్లు, ట్రాన్స్‌పోర్టువి రూ.180 కోట్లు, ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌వి రూ.265 కోట్లు, హ్యాండ్‌లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌వి రూ.19 కోట్లు, అగ్రి కల్చర్‌వి రూ.2,378 కోట్లు, ఏపీ సీడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌వి రూ.249 కోట్లు, హార్టికల్చర్‌వి రూ.1084 కోట్లు, ఎనిమల్‌ హస్బెండరీవి రూ.59 కోట్లు, ఫిషరీస్‌వి రూ.88 కోట్లు, ఇండస్ట్రీస్‌ కామర్స్‌ షుగర్‌ డిపార్ట్‌మెంట్‌వి రూ.200 కోట్లు, డెయిరీ డెవలప్‌మెంట్‌కు సంబంధించి రూ.72 కోట్ల బకాయిలు చంద్రబాబు మాకు గిఫ్ట్‌గా ఇచ్చారు.

స్కూల్‌ ఎడ్యుకేషన్‌ మిడ్‌డే మీల్స్‌వి రూ.148 కోట్లు, రోడ్స్‌ అండ్‌ బిల్డింగ్స్‌వి రూ.1100 కోట్లు, ఏపీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌ ఫీజు రీయింబర్స్‌ మెంట్‌ బకాయిలు రూ.2800 కోట్లు, ఏపీఎంఎస్‌ఐడీసీవి రూ.142 కోట్లు, ఈహెచ్‌ఎస్‌కు సంబంధించి రూ.154 కోట్లు, సోషల్‌ వెల్ఫేర్‌ శాఖవి రూ.848 కోట్లు, కమిషనర్‌ పంచాయతీ రాజ్‌వి రూ.2036 కోట్లు, ఇంజనీరింగ్‌వి రూ.1200 కోట్లు, కమిషనర్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌–ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ రూ.2340 కోట్లు, గ్రామీణ నీటి సరఫరా విభాగంలో రూ.2,757 కోట్లు, ట్రైబల్‌ వెల్ఫేర్‌లో రూ.76 కోట్లు, ఎనర్జీ విభాగంలో రూ.9,823 కోట్లు, ఇంకా వాటర్‌ రీసోర్స్‌ డెవలప్‌మెంట్‌ అన్నీ కలుపుకుంటే ఏకంగా రూ.42,183 కోట్ల బకాయిలు చంద్రబాబు మాకు గిఫ్ట్‌గా ఇచ్చారు.

నిజానికి అన్ని వేల కోట్లు ఎవరూ గిఫ్ట్‌గా ఇవ్వరు. అయినా మేం చిరునవ్వుతో కట్టాం. మేం కంప్లయింట్‌ చేయలేదు. సర్వ సాధారణంగా జరిగే విషయాన్ని కూడా బూతద్దంలో పెట్టి చూపించి ఏదో జరుగుతోందని భ్రాంతి కలిగించడంలో చంద్రబాబు దిట్ట.

2014–19 మధ్య చంద్రబాబు హయాంలో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి మించి రూ.28,457 కోట్ల అప్పు చేశారు. ఆ వివరాలు కాగ్‌ రిపోర్ట్‌తో పాటు, యూనియన్‌ ఫైనాన్స్‌ కమిషన్‌ రిపోర్టు, మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌ గవర్నమెంట్‌ ఆఫ్‌ ఇండియా రిపోర్ట్స్‌లో కూడా ఉన్నాయి.

చంద్రబాబు నిర్వాకం వల్ల, మా ప్రభుత్వ హయాంలో ఆ మేరకు రుణాల్లో కోత పడింది. అదే మా హయాంలో ఎక్సెస్‌ బారోయింగ్‌ కేవలం రూ.1,647 కోట్లు మాత్రమే. ఎవరు ఆర్థిక విధ్వంసకారుడో చెప్పడానికి ఈ డేటా అంతా కనిపిస్తోంది. ఎవరు క్రమశిక్షణతో నడిచారు, రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించారు అని చెప్పడానికి ఈ డేటా చాలు.

ఇక వివిధ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ ప్రమేయం, గ్యారెంటీ లేకుండా నేరుగా చేసే నాన్‌ గ్యారెంటీడ్‌ అప్పులు చూస్తే.. చంద్రబాబు అధికారంలోకి వచ్చే నాటికి ఆ అప్పులు రూ.8,600 కోట్లు ఉంటే, ఆయన దిగిపోయే నాటికి ఏకంగా రూ.77 వేల కోట్లకు పెరిగాయి.

అదే మా ప్రభుత్వం వచ్చాక నాన్‌ గ్యారెంటీడ్‌ అప్పులను రూ.2 వేల కోట్లు తగ్గించి రూ.75వేల కోట్లకు పరిమితం చేశాం.

అంటే చంద్రబాబు హయాంలో ఆ అప్పుల సీఏజీఆర్‌ 54.98 శాతం కాగా, మా హయాంలో అది (మైనస్‌) –0.48 శాతం. ఇది గమనించమని కోరుతున్నా. అలాగే చంద్రబాబు హయాంలో రాష్ట్ర ప్రభుత్వ అప్పుల సీఏజీఆర్‌ 22.63 «శాతం కాగా, మా హయాంలో అది 13.57 శాతం మాత్రమే.

అందుకే ఆలోచన చేయమని రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నా. ఎవరు ఆర్థిక విధ్వంసకారులన్నది గమనించమని విజ్ఞప్తి చేస్తున్నాను.

మాన్యుఫ్యాక్చరింగ్‌ జీవీఏ (స్థూల ఉత్పత్తి విలువ) చూస్తే చంద్రబాబు సీఎం అయ్యే నాటికి 2014లో రూ.1.07 లక్షల కోట్లు ఉంటే, ఆయన పాలన ముగిసే 2019 నాటికి అది రూ.1,88,601 కోట్లకు చేరింది. అదే మా ప్రభుత్వం దిగిపోయే 2014 నాటికి చూస్తే స్థూల ఉత్పత్తి విలువ రూ.3,41,485 కోట్లకు చేరింది. అంటే చంద్రబాబు హయాంలో ఆ సీఏజీఆర్‌ 11.92 శాతం కాగా, మా హయాంలో 12.61 శాతం. అదే సమయంలో దేశ సగటు వృద్ది కేవలం 8.17 శాతం మాత్రమే.

అలాగే పారిశ్రామిక రంగం జీవీఏలో చంద్రబాబు దిగిపోయే నాటికి దేశంలో మన రాష్ట్రం 11వ స్థానంలో ఉంటే, మా ప్రభుత్వ హయాంలో 8వ స్థానానికి ఎదిగాం. ఎంఎస్‌ఎంఈ సెక్టర్‌లో చంద్రబాబు హయాంలో 8.67 లక్షల మందికి మాత్రమే ఉద్యోగావకాశాలు లభిస్తే, మా ప్రభుత్వ హయాంలో ఏకంగా 32,79,770 ఉద్యోగాలు లభించాయి. అలాగే భారీ, అతి భారీ పరిశ్రమల్లో కూడా వైయస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఎక్కువ వృద్ధి రేటు నమోదైంది.

తలసరి ఆదాయం గురించి కూడా చంద్రబాబు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పారు. ఇష్టమొచ్చిన నెంబర్లు చెబుతున్నారు. తలసరి ఆదాయం 9శాతం నుంచి 2శాతానికి తగ్గిందని మరో అబద్ధం ప్రచారం చేశారు.

పెద్ద హామీలను వారి మోసాల్లో భాగంగా ఎలాగూ చేయరు అనుకుంటే.. చిన్న చిన్న వాటిలో కూడా మోసాలే. గ్యాస్‌ కు సంబంధించి ఫైనాన్స్‌ మంత్రి ఒకటి, సివిల్‌ సప్లయ్‌ మంత్రి మరొకటి మాట్లాడతాడు. ఎల్పీజీ కనెక్షన్లు రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయని చూస్తే వాళ్లు పెట్టిన రిపోర్టుల ప్రకారమే ఏపీలో యాక్టివ్‌ సిలిండర్లు 1.55 కోట్లు. ఇది నేనిచ్చిన డేటా కాదు. ఐవోసీఎల్, బీపీసీఎల్, హెచ్‌ పీసీఎల్‌ వారు ఇచ్చినది. మరి 1.55 కోట్ల మందికి ఒక్కోటి రూ.895 చొప్పున 3 గ్యాస్‌ సిలిండర్లకు ఎంత అవుతుంది? రూ.4200 కోట్లు. ఇది ఎవరికైనా అర్థమయ్యే లెక్కలే కదా? మరి బడ్జెట్‌ లో ఎంత పెట్టారు రూ.895 కోట్లు పెట్టారు. అంటే ఒక సిలిండర్‌ కూడా ఇవ్వరు.

1.55 కోట్ల మందికి ఒక్క సిలిండర్‌ ఇవ్వాలన్నా కనీసం 1400 కోట్లు కావాలి. నువ్వు పెట్టింది రూ.895 కోట్లు. ఒక సిలిండర్‌ ఇవ్వడానికి కూడా నీకు మనసు లేదు. నామ్‌ కే వాస్తే మోసం చేయడానికి అడుగులు. కనీసం 40 లక్షల సిలిండర్లు ఎన్‌రోల్‌ అయ్యాయని అసెంబ్లీలో నిస్సిగ్గుగా చెప్పుకుంటున్నారు.

ఫైనాన్స్‌ మినిస్టర్‌ 3 సిలిండర్లు ఇస్తానంటాడు, సివిల్‌ సప్లయ్స్‌ మంత్రి ఒక సిలిండరే అంటాడు. వీళ్లిద్దరి మధ్య పొంతన లేదు. పోనీ ఒకటి అయినా అందరికీ ఇస్తున్నారా అంటే అదీ లేదు.

చంద్రబాబు గవర్నమెంట్‌ వచ్చి ఆరు నెలలైంది. ఇంత వరకు ఒక్క ఉద్యోగం అయినా ఇచ్చారా? ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకపోగా వీళ్లు ఈ ఆరు నెలల్లో చేసింది ఏమిటంటే ఉన్న ఉద్యోగాలను పీకుతున్నారు. 2.66 లక్షల వాలంటీర్లు పీకేశారు. 15 వేల మంది ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల్ని పీకేశారు.

ఈరోజు ఆరోగ్యశ్రీ పరిస్థితి ఏమిటి? 104, 108 ఎంప్లాయీస్‌ ధర్నాలు చేస్తున్నారు. మీ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైతే 4 నెలల నుంచి జీతాలు అందడం లేదని ధర్నాలు చేస్తున్నారు. ఈరోజు 104, 108 పరిస్థితి అది. ఆరోగ్యశ్రీలో ఈరోజు నెట్వర్క్‌ ఆస్పత్రులకు సంబంధించిన బిల్స్‌ మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏప్రిల్‌ 1 నుంచి ఈరోజు దాకా బిల్లులు పెండింగ్‌. ఈరోజు పేషంట్ల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది.

చంద్రబాబు ఈ అసెంబ్లీ సమావేశాల్లో మనం చూస్తున్న కామన్‌ డైలాగ్‌ సంపద సృష్టిస్తా అన్నది. ఈయన చెప్పే కొద్దీ ప్రజల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆరు నెలలు కాలేదు ఈయన అధికారంలోకి వచ్చి. కరెంటు బిల్లులు బాదుడే బాదుడు. ఏకంగా 18 వేల కోట్ల బాదుడు. రూ.6,072 కోట్లకు సంబంధించిన బాదుడు నవంబర్‌ బిల్లులోనే స్టార్ట్‌ అయ్యింది. మరో రూ.11 వేల కోట్లకు సంబంధించిన బాదుడు ఆ తర్వాత నెలలో అంట.

చంద్రబాబు సంపద సృష్టిలో భాగంగా ఈయన ఏమంటాడు. కేంద్రంలో నిర్మలా సీతారామన్‌తో మాట్లాడాడట. జీఎస్టీలో 1 శాతం సర్‌ఛార్జ్‌ వేయాలంట. అది ఈయనకు ఇవ్వాలట. సంపద సృష్టిలో భాగంగా, కొత్త మెడికల్‌ కాలేజీలను స్కాములు చేసి అమ్ముతున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం కడుతున్న 3 పోర్టులు, దాదాపు 50 శాతం పనులు పూర్తయ్యాయి. ఒక పోర్టులో 65 శాతంపైన, మరో పోర్టులో 30 శాతంపైన ఇంకో పోర్టులో 25 శాతం పైన అయిపోయింది. ఫైనాన్షియల్‌ టై అప్‌ అయిపోయింది. మారిటైమ్‌ కార్పొరేషన్‌ కింద సపరేట్‌ గాపెట్టారు, బ్యాంకులు లోన్లు ఇస్తున్నారు. ఎటువంటి సమస్యలూ లేవు.

ఇటువంటి పోర్టులు గానీ, మెడికల్‌ కాలేజీలు గానీ రాష్ట్ర ప్రభుత్వం కడుతున్న ఈ డబ్బులు రేప్పొద్దున లక్షల కోట్లు అవుతాయి. నాగార్జునసాగర్‌ కట్టడానికి అప్పట్లో రూ.600 కోట్లో రూ.900 కోట్లో అయి ఉంటుంది. ఈరోజు కట్టాలంటే ఎన్ని వేల కోట్లు కావాలి? ఈరోజు కట్టే ఈ పోర్టులు, మెడికల్‌ కాలేజీల విలువ కూడా అంతే. ఇలాంటివి కడితేనే ప్రభుత్వాలకు అదనపు ఆదాయాలు కలుగుతాయి. దీన్ని సంపద సృష్టి అంటారు.

సంపద సృష్టిలో భాగంగా నిన్న అసెంబ్లీలో ఏమంటాడు. కేంద్రం ఏ రకంగా నేషనల్‌ హైవేల మీద టోల్‌ వసూలు చేస్తోందో, గ్రామీణ రహదారుల మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా టోల్‌ వసూలు చేయాలి. మీరు ప్రయాణం చేసినందుకు యూజర్‌ ఛార్జీలు మేం కలెక్ట్‌ చేస్తాం. దాన్నే సంపద సృష్టి అంటాడు. పన్నులు వేసి బాదుడే బాదుడు చేసే దాన్ని సంపద సృష్టి అనడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఈరోజు చంద్రబాబు మాట్లాడుతున్న మాటలేమిటి? మా హయాంలో రోడ్లు బాగు చేసినా, గుంతలున్నాయన్నాడు. రకరకాల విష ప్రచారాలు చేశారు. ఆయన, ఆయన దత్తపుత్రుడు ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడారు. ఇంత ఖర్చు చేసినా దుష్ప్రచారమే మేం ఎదుర్కొన్న పరిస్థితుల్లో చంద్రబాబు ఏం చేస్తున్నాడు ఈరోజు. ప్రజల మీద రోడ్డు ట్యాక్స్‌ వేయిస్తాడట, ఆ ట్యాక్స్‌ తో వచ్చిన డబ్బుతో రోడ్లు వేయిస్తాడట.

నిజంగా ఆయన బాదుడే బాదుడు అనే కార్యక్రమంలో బాదుతుంటే నిస్సిగ్గుగా ఆయన జస్టిఫై చేసుకుంటుంటే రోడ్లన్నీ తాను రిపేర్లు చేయిస్తానని ఎన్నికలప్పుడు గొప్ప గొప్ప మాటలు మాట్లాడాడు.

ఈరోజు మనం రోడ్ల మీద ప్రయాణం చేయడానికి ట్యాక్సులు కట్టాలట. రోడ్లు బాగు చేయిస్తాడట. లేకపోతే రోడ్ల పరిస్థితి అంతే అని కూడా అంటున్నాడు. ప్రతి విషయంలోనూ అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి అయ్యాడు. రోడ్లు, సూపర్‌ సిక్స్, కరెంటు.. ఏ విషయంలో ఆయన అబద్ధాలు చెప్పలేదు?

రాష్ట్రంలో ఇవాళ కనిపిస్తున్నది మద్యం లిక్కర్‌ లో ఒక స్కాము, ఇసుకలో రెండో స్కాము, ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్బులు ఇది ఇంకో స్కాము, ఇవి కాక మీ ఇష్టం ఏ నియోజకవర్గం అయినా తీసుకోండి ఏ పరిశ్రమ ఉన్నా, ఏ నిర్మాణ కార్యక్రమం జరుగుతున్నా ఎమ్మెల్యేలకు కప్పం కట్టకపోతే యాక్టివిటీ ముందుకు పోయేదే లేదు. అదానీ వాళ్లు ప్లాంటు కడుతుంటే.. కూటమి ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతా అరాచకం జరుగుతోంది. స్కాముల ప్రభుత్వం, నాకింత, నీకింత అని దోచుకోవడం, పంచుకోవడం.

మద్యం నాణ్యత లేదు. అధిక ధరలు:
అధికారంలోకి వస్తే నాణ్యమైన లిక్కర్‌ ఇస్తానన్నాడు. లిక్కర్‌ రేటు తగ్గిస్తానన్నాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఇంతకు ముందూ అవే డిస్టిలరీలు, మా హయాంలో, ఆయన హయాంలో కూడా అవే డిస్టిలరీలు. సుమో క్లాసిక్‌ విస్కీ, బెంగళూర్‌ విస్కీ, రాయల్‌ లాన్సర్‌ విస్కీ, ట్రాపికానా వీసా బ్రాందీ, షాట్‌ విస్కీ, బ్రాందీ 99, కేరళ మాల్టెడ్‌ ఫైన్‌ విస్కీ.. ఇవన్నీ తీసుకొచ్చాడు. ఇవన్నీ 99 రూపాయలేనని చెబుతాడు. అంటే ఉన్న క్వాలిటీని ఫర్దర్‌ గా తగ్గించి ఈ విస్కీ సప్లయ్‌ చేస్తున్నాడు.

ఇదే కేరళ మాల్టెడ్‌ విస్కీ రూ.85కే దొరుకుతోంది. ఇక్కడ 99. ఉన్న పాత చీప్‌ లిక్కర్‌ ను క్వాలిటీని ఫర్దర్‌ గా తగ్గించి 99 రూపాయలకు కొత్తగా బ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల ఆరోగ్యం చెలగాటం ఆడుతూ, మరోవైపున ఇదే బ్రాండ్లు బయట రేట్లు తక్కువగా ఉంటే మన దగ్గర 99కి అమ్ముతున్నారు.

వైయస్సార్‌ సీపీ కన్నా ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు. మిగతా బ్రాండ్లు ఇంతకు ముందు రూ.120 ఉండేవి, అదే రేటు ఎమ్మార్పీ కొనసాగుతోంది. కానీ ఎక్కడా ఎమ్మార్పీకి అమ్మడం లేదు. ఎమ్మార్పీ ప్లస్‌ మాఫియా కమిషన్‌. ప్రతి చోటా కూడా బెల్ట్‌ షాపులు ప్రమోట్‌ చేస్తున్నాడు. ఒక్కో బెల్ట్‌ షాపుకు ఒక్కో గ్రామంలో ఎవడికి ఇవ్వాలని లోకల్‌ కాంపిటీషన్, ఎవడు రూ.2 లక్షలు ఇస్తే వాడికి ఇస్తున్నాడు. ఈరోజు మాఫియా రాజ్యం జరుగుతోంది.

ఎమ్మార్పీ రేటుకు అమ్ముకునేందుకు లిక్కర్‌ షాపుల కోసం అంత కాంపిటీషన్‌ ఎందుకు, ఎమ్మెల్యేలు ఎందుకు మనుషులను కిడ్నాప్‌ చేయాలి? ఎవరినీ పాడనివ్వకుండాచేయాలి? వేరే వాళ్లు వచ్చినా షాపులుక నడుపే పరిస్థితిలోకి నెట్టేయాలి? ఎందుకంటే ఎవడూ ఎమ్మార్పీకి అమ్మకూడదు కాబ్టటి. ఎమ్మార్పీ ప్లస్‌ మాఫియా కమీషన్‌ రావాలి కాబట్టి.

ఈరోజు సాక్షాత్తూ వీళ్లే అసెంబ్లీలో ప్రశ్నకు సమాధానం ఇస్తూ 2019–24 మధ్య 5 సంవత్సరాల్లో కూడా కేవలం 46 మంది మాత్రమే హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ కు గురయ్యారని, కేవలం 34 కేసులు మాత్రమే రిజిస్టర్‌ అయ్యారని వాళ్లంతకు వాళ్లే చెప్పారంటే.. గతంలో 30 వేల మంది హ్యూమన్‌ ట్రాఫికింగ్‌ కు గురయ్యారని వీళ్లు చేసిన దుష్ప్రచారానికి ఇది ఫుల్‌ స్టాప్‌ కాదా? వాలంటీర్ల మీద వీళ్లు చేసిన దుష్ప్రచారానికి ఇది ఫుల్‌ స్టాప్‌ కాదా?

ఒకటో తారీఖు వచ్చే సరికే ప్రతి ఉద్యోగస్తుడికీ జీతం అన్నాడు. మూడు వారాలైపోతోంది ఇంకా జీతాలు ఇవ్వడం లేదు. ఆరు నెలలు కాలేదు. ఇదీ పరిస్థితి. ఉద్యోగులంతా ఐఆర్‌ కోసం ఎదురు చూస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చిన నెలలోపే 27 శాతం ఐఆర్‌ ఇచ్చాం. ఇంత వరకు ఐఆర్‌ ఇవ్వలేదని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. 2 డీఏలు పెండింగ్‌. మా హయాంలో పీఆర్సీ చైర్మన్‌ ను నియామకం చేసి సరైన సమయంలో ఉద్యోగులకు మంచి జరిగేట్టుగా అడుగులు వేస్తే ఈ చంద్రబాబు వచ్చిన తర్వాత ఆ పీఆర్సీ చైర్మన్‌ ను వెళ్లగొట్టాడు. బలవంతంగా రాజీనామా చేయించిన తర్వాత ఇంత వరకు కొత్త చైర్మన్‌ నియమించలేదు. ప్రాసెస్‌ స్టార్ట్‌ కాలేదు.

టాయిలెట్‌ మెయింటెనెన్స్‌ కు సంబంధించిన స్కూళ్లలో ఆయాలకు జీతాలు సరిగ్గా లేవు. ఆర్పీలకు నెలల తరబడి జీతాల కోసం వెయిటింగ్‌. ఆశా వర్కర్లు కూడా ధర్నాలు చేస్తున్నారు. వాళ్లకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ కల్పిస్తానన్నాడు, పదవీ విరమణ వయసు పెంచుతానన్నాడు, బీమా సౌకర్యం, జీతాలు పెంచుతామన్నాడు, మట్టి ఖర్చుల కింద 20 వేలు ఇస్తానన్నాడు. మేనిఫెస్టోలో కూడాపెట్టాడు. ఇప్పటి వరకు వారి గురించి పట్టించుకున్న పరిస్థితి లేదు. సూపర్‌ సిక్సులు లేవు, సూపర్‌ సెవెన్లూ లేవు.

ఎవరైనా వాళ్లకు జరగాల్సిన న్యాయం గురించి సోషల్‌ మీడియాలో ప్రస్తావిస్తే దారుణంగా వేధిస్తున్నారు. పోలీసులను వాడుకుంటున్నారు. అన్యాయంగా వాడుకుంటున్నారు. ఎమ్మెల్యేల చేత వాళ్ల నియోజకవర్గంలో ప్రయివేటు మాఫియా ముఠాను తయారు చేసి కొట్టిస్తున్నారు.

రిటైర్‌ అయిపోయిన కొంత మంది తనకు అనుకూలమైన అధికారులను ఒక జట్టుగా తయారు చేశాడు. ఏబీ వెంకటేశ్వరరావు అని ఒకడు, ఆర్పీ ఠాకూర్‌ అని ఇంకొకడు, యోగానంద్‌ అని ఇంకొకడు, ఒక జట్టుగా తయారు చేసి తన దగ్గర కూర్చోబెట్టుకుంటున్నాడు. వీళ్లంతా చేసేది ఏమిటి? జిల్లాల్లో చంద్రబాబు ప్రభుత్వానికి ఎవరు వ్యతిరేకంగా ఉన్నారు, ఎవరు వేదికలపై గట్టిగా నిలదీస్తున్నారు, వారి పేర్లను టీడీపీ వర్గాల నుంచి ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి వీళ్లంతా సేకరిస్తారు. ఈ జాబితా ఆధారంగా, ఎస్పీలతో వీళ్లు ఫాలో అప్‌ చేస్తారు. తప్పుడు ఫిర్యాదులు అందగానే కనీసం విచారణ కూడా లేకుండా ఆ ఫిర్యాదు చట్టప్రకారం నేరం కిందకు వస్తుందా లేదా అన్నది కూడా చూడకుండా వారిని ఇల్లీగల్‌ గా అరెస్టు చేస్తున్నారు. అరెస్టు చేసిన తర్వాత కోర్టుకు హాజరు పర్చడం లేదు. హెబియస్‌ కార్పస్‌ వేయాల్సిన అవసరం రాష్ట్రంలో ఉంది.

నా చెల్లెలు షర్మిల మీద ఇదే చంద్రబాబు నాయుడు హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌ రోడ్డు నం.36లో ఆయన బావమరిది, లోకేష్‌ మామ అయిన బాలకష్ణ తన సొంత టవర్‌… ఎన్‌ బీకే బిల్డింగ్స్‌ నుంచి వెబ్‌ సైట్లలో తప్పుడు రాతలు రాయించి ప్రచారాలు చేయలేదా? పోలీసుల దర్యాప్తులో ఇది తేలలేదా? అప్పట్లో చంద్రబాబు నైజం గురించి షర్మిలమ్మ ఏం అనిందో వినండి.. అంటూ ఆ వీడియో ప్రదర్శించారు.

ఇంకా మా ప్రభుత్వం ఉన్నప్పుడు వర్రా రవీంద్రారెడ్డి అనే పేరుతో చంద్రబాబు ఐటీడీపీ సభ్యుడు ఉదయ్‌ భూషణ్‌ అనే వ్యక్తి ఒక ఫేక్‌ అకౌంట్‌ క్రియేట్‌ చేసి అందులో మా అమ్మను, చెల్లెమ్మను తిట్టించాడు. రవీంద్రారెడ్డి పెట్టిన కేసు ఆధారంగా ఐటీడీపీ సభ్యుడైన ఉదయ్‌ భూషణ్‌ ను పోలీసులు అధారాలతో అరెస్టు కూడా చేశారు.

ఇదే చంద్రబాబును సూటిగా అడుగుతున్నా.. నీ తల్లిదండ్రులెవరో.. ఈ రాష్ట్రప్రజలకు ఎప్పుడైనా చూపించావా? వారితో ఎప్పుడైనా కలిసి ఉన్నావా? రాజకీయంగా నువ్వు ఎదిగిన తర్వాత వారిని మీ ఇంటికి తీసుకువచ్చి రెండు పూటలా అన్నం పెట్టి వారిని సంతోషంగా పంపించావా? వారిద్దరూ కాలం చేస్తే..కనీసం తలకొరివైనా పెట్టావా?

అసలు పోలవరంలో ఇప్పటి పరిస్థితికి కారణం ఎవరు? అది నేను చెబుతోంది కాదు. కేంద్ర ప్రభుత్వం, నిపుణుల కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారం ఏం చెప్పింది. పోలవరం వద్ద నది దాదాపు 2.5 కి.మీ వెడల్పు ఉంటుంది. ఆ నీరు మళ్లిస్తేనే కదా, ప్రాజెక్ట కట్టగలిగేది. అందుకోసం ఏం చేయాలి? స్పిల్‌వే పనులు పూర్తి చేయాలి. కానీ అవి పూర్తి చేయలేదు. అవి పూర్తి కాకుండానే కాఫర్‌డ్యామ్‌ పనులు మొదలుపెట్టావు. అసలు కాఫర్‌ డ్యామ్‌ అంటే ఏమిటంటే.. దాని ద్వారా నీరు ఆపుతారు. ఆ తర్వాత మెయిన్‌ డ్యామ్‌ పనులు చేయాలి. నదికి అటు, ఇటు రెండు కాఫర్‌డ్యామ్‌ల పనులు మొదలుపెట్టాడు.

చంద్రబాబు అరెస్టు అక్రమం అయితే, ఆయన సహ నిందితులను ఈడీ ఎందుకు అరెస్టు చేసింది? వాళ్ల ప్రాపర్టీలను ఎందుకు అటాచ్‌ చేసింది? చంద్రబాబు చేసిన స్కాం నుంచి ఆ డబ్బులు వారికి పోయాయనే కదా? మరి డబ్బులు ఇచ్చిన చంద్రబాబును అరెస్టు చేయాలి కదా?.. అని వైయస్‌ జగన్‌ అన్నారు.

LEAVE A RESPONSE