September 30, 2026

“ఉత్త”రాకుమార ప్రగల్భాలు 

  • ప్రతిదిన్ మైనారిటీలకు కొమ్ముకాస్తున్న మీడియా
  • కలలు అందరూ కనాలి.. వాటిని సాకారం అయ్యేలా చేసుకోవాలి
  • కానీ కలల పేరిట పీడ కలలను కనమని ఎవరు చెప్పారు? ఒక్క మన రేవంత్ మహాశయుడు తప్ప
  • అంతర్జాతీయ సైమన్ గో బ్యాక్ ని జాతీయ సర్ తో ముడిపెట్టడం రేవంత్ కే చెల్లు
  • ప్రధాని మోడీ మహాదేవ్ అనకపోయినా, జై శ్రీ రామ్ అన్నా రేవంత్ కు ఊడింది ఏమిటట?
  • ఆయనకు రాహుల్ భయ్యా ఆరాధ్య దైవం అనడంలో తప్పు లేదు.. ఎందుకంటే వ్యక్తి ఆరాధన వారి వారి సొంతం
  • అలాగని పబ్లిక్ గా రాహుల్ ని దేశపు జ్యోతి అని అర్ధం వచ్చేలా చెప్పడం పూర్తిగా అభ్యంతకరం
  • కుళ్లిపోయిన భావజాలం తిని బతికేస్తున్న బొద్దింకలు వీరెవరు… ఎన్నికల కమిషన్ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ?

(డా.బాత్రిసు – 9848675329 – మహానాడు చెన్నై పొలిటికల్ బ్యూరో )

తృణమూల్ కాంగ్రెస్ నేత మమతా బెనర్జీ, అస్సాం-బంగ్లా ముస్లింలు అందిస్తున్న ఆర్ధిక సహకారంతో అస్సాం -బంగ్లాదేశ్- బెంగాల్-బారజారా-సిలిగురి మొత్తం నాలుగు ఎడిషన్లతో వెలువడుతున్న ప్రతిదిన్ దిన పత్రిక నిర్వహించిన ఒక కాంక్లేవ్ లో, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేసిన అభిప్రాయాలూ-వ్యాఖ్యలు మహాభారతంలో ఉత్తర కుమారుడి ప్రగల్భాల ను మరోసారి గుర్తుచేశాయి.

ఈ కాంక్లేవ్ ను దేశంలో ఏ ఇతర ప్రాంతం దినపత్రికలు నిర్వహించి నా , వాటిలో రేవంత్ ప్రధాన వక్తగా పాల్గొన్నా ప్రతిదిన్ కాంక్లేవ్ లో మాట్లాడినట్లు మాట్లాడగలరా ? అనేది శుద్ధ సందేహాస్పదం. కొండకచో అనుమానాస్పదం కూడా. ఒక గూటి పక్షులు నానుడి చందాన, ఆయనకు రాహుల్ భయ్యా ఆరాధ్య దైవం అనడంలో తప్పు లేదు. ఎందుకంటే వ్యక్తి ఆరాధన వారి వారి సొంతం. లేక వ్యక్తిగతం. అలాగని పబ్లిక్ గా రాహుల్ ని దేశపు జ్యోతి అని అర్ధం వచ్చేలా చెప్పడం పూర్తిగా అభ్యంతకరం.

అంతర్జాతీయపు సైమన్ గో బ్యాక్ ని జాతీయపు సర్ తో ముడిపెట్టడం రేవంత్ కే చెల్లు. కల లు అందరూ కనాలి. వాటిని సాకారం అయ్యేలా చేసుకోవాలి. కాదనం. కానీ కలల పేరిట పీడ కలలను కనమని ఎవరు చెప్పారు? ఒక్క మన రేవంత్ మహాశయుడు తప్ప.! జాతీయతను గౌరవించలేని వ్యక్తులు ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులు గా ఉంటే అది మొత్తం దేశానికే హాని. కొండకచో అలాంటి వ్యక్తులు దేశానికి పట్టిన చీడ పురుగులు లాంటి వారు.

బ్రహ్మం గారి కాల జ్ఞానం లో అల్పబుద్ధులు రాజ్యాలు ఏలుతారు అనే వాక్యం నిజం కాబోతోందా? వారికీ సుద్దులు ఇంకా నేర్వని సుద్దాల అశోక తేజ లాంటి వారు తమ కుహనా కవిత్వపు ధోరణులతో బహుపరాక్ ..బహు పరాక్ అంటారా? ప్రధాని మోడీ మహాదేవ్ అనకపోయినా, జై శ్రీ రామ్ అన్నా రేవంత్ కు ఊడింది ఏమిటట? ఆరాధన అనేది వ్యక్తిగతమని ముందే చెప్పాను నేను.

ఇక రేవంత్ ఇచ్చిన జ్ఞానేశ్ ఉత్తర కొరియా ట్రిప్ సలహా ఎలా ఉందంటే.. చిదంబరం పాకిస్థాన్ వెళ్లి, వాళ్ళ ఆర్ధిక రంగాన్ని చక్క దిద్దినట్లు . ఇక సింహ భాగం తాను జైలులోనే గడిపాను అని చెప్పడం కొంచెం హాస్యాస్పదం. ఈ లెక్కన చాలా మంది చాలా సార్లు జైలుకు వెళుతుంటారు, వస్తుంటారు కదా మాష్టారూ.

ఇక ప్రతిదిన్ దిన పత్రిక గురించి చెప్పాల్సి వస్తే.. అది కేవలం కొన్ని ప్రాంతాలకు అందునా మైనారిటీలకు కొమ్ముకాస్తున్న మీడియా. సరైన వేదిక దొరికిందని రేవంత్ తన వాగ్ధాటిని మొత్తం మైకులో ఉంచారు. కాంగ్రెస్-టిఎంసి హయాంలో రెండు మూడు అవార్డులు తప్పించి, వేరే జాతీయ గుర్తింపునకు నోచుకోని దినపత్రికగా ప్రతిదిన్ కొనసాగుతోంది.

ఎలక్షన్ కమిషన్ విషయాలు కేంద్ర పరిధిలోవి. మధ్యలో పదవిలో లేని చిదంబరాలు, పైరవీలతో పదవిలో కొనసాగుతున్న ఉన్న రేవంతు లు, అసలు కుళ్లిపోయిన భావజాలం తిని బతికేస్తున్న బొద్దింకలు వీరెవరు… ఎన్నికల కమిషన్ విషయాల్లో జోక్యం చేసుకోవడానికి ?

ఇవన్నీ చూస్తుంటే-వింటుంటే నూటొక్క జిల్లాల అందగాడు నూతన్ ప్రసాద్ నుడిమి నట్టుగా దేశం చాలా క్లిష్ట పరిస్థితుల్లోనే ముందుళ్లుతోంది మరి. పంచతంత్ర కర్త విష్ణు శర్మ అలనాడే చెప్పినట్టు ” పోగాలము దాపురించిన నాడు మూర్కులు వినరు, కనరు, ఊర్కొనరు. స్వర్గీయ నెహ్రూ చైనా చేతిలో పరాజయం పాలైన సందర్భంలో రేవంత్ లాగానే.. నేను ఓడిపోలేదు. నా ప్రభ ఇంకా తరిగి పోలేదు అంటూ ఇలాంటి బీరాలు పలికిన సంవత్సరమే కాలం చేశాడు. ఇక రేవంత్ కి రానున్న ఎన్నికల్లో సరిగ్గా నెహ్రుకి ఎదురైన ఓటమే స్వాగతం పలకనుంది. కనుక ఆయనకు ఇన్ ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్ !

Total Visitors: 2,830,261