– సివిల్ సప్లై స్కామ్ నీకు ఉరితాడు కాబోతుంది
– సిగ్గు,శరం లేని వాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి
– మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య , మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ , మాజీ ఎమ్మెల్యేల నన్నపునేని నరేందర్ తో కలిసి నిర్వహించిన ప్రెస్ మీట్ లో పెద్ది సుదర్శన్ రెడ్డి
హన్మకొండ: దాదాపు సగం క్యాబినెట్ నిన్న దేవాదుల ఇంటెక్ వెల్ వద్ద రివ్యూ చేశారు.90% పనులు పూర్తి చేసిన కెసిఆర్ని ఉత్తమ్ కుమార్ రెడ్డి డెకాయిట్ అన్నాడు. ఒక్క సారి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆత్మ విమర్శ చేసుకోవాలి. వందల కోట్లు దొబ్బిన ఉత్తమ్ కుమార్ రెడ్డి పెద్ద డెకాయిట్…సివిల్ సప్లై స్కామ్ నీకు ఉరితాడు కాబోతుంది..జైలుకు వెళ్లే రోజులు దగ్గర పడ్డాయి.
ఉత్తమ్ కి రేవంత్ కి మధ్య సయోధ్య లేదు. ఇది వరంగల్ బిడ్డా. నువ్వు ఏది పడితే అది ఇక్కడ మాట్లాడకు…సిగ్గు,శరం లేని వాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సివిల్ సప్లై లో1100 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఏ విదంగా నష్ట పోతుందో నేనే ఆధారాలతో కూడిన వివరాలు ఇచ్చాను. రాష్ట్రంలోని సివిల్ సప్లై కుంభకోణం పై హై కోర్ట్ లో పిల్ వేసిన. తీర్పు రాబోతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక్క చెరువు నేటికి మత్తడి పడలేదు. ఈ జిల్లా ఎమ్మెల్యే లకు సోయి లేదు. అవగాహన లేదు.