Suryaa.co.in

National

ఉత్తరాఖండ్‌ చార్‌ధామ్‌ యాత్ర ముగింపు తేదీలివే

దేవభూమి ఉత్తరాఖండ్‌లో చార్‌ధామ్‌ యాత్ర కొనసాగుతోంది. తాజాగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం 4 ధామ్‌ల మూసివేత తేదీలను ప్రకటించింది. ఉత్తరాఖండ్ టూరిజం మంత్రి సత్పాల్ మహరాజ్ ఆ వివరాలు వెల్లడించారు. నవంబర్ ఒకటిన గంగోత్రి ధామ్ తలుపులు మూసేస్తామని, యమునోత్రి ధామ్, కేదార్‌నాథ్ ధామ్ తలుపులు నవంబర్ 3న మూసివేయబడతాయన్నారు. అలాగే నవంబర్ 4న తుంగనాథ్ ధామ్ తలుపులు, నవంబర్ 17న బద్రీనాథ్ ధామ్ తలుపులు మూసివేయనున్నామని అన్నారు.

LEAVE A RESPONSE