Suryaa.co.in

Andhra Pradesh

కొంతమంది పోలీసులు రెచ్చిపోతున్నారు

– కదిరిలో పోలీస్ ఇన్స్పెక్టర్ మధు మహిళలపై దాడిపి పాల్పడ్డాడు
– పులివెందుల నాగమ్మకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే నాపై అట్రాసిటీ కేసు
– మధు మీసాలు మెలేస్తూ…తొడలు కొడుతూ మహిళలను అసభ్యకరంగా దూషించాడు
– కదిరిలో మహిళలపై పోలీసుల దాడి ఖండిస్తూ జాతీయ మహిళా కమిషన్ కు పిర్యాదు చేసిన తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత

రాష్ట్రంలో కొంతమంది పోలీసులు రెచ్చిపోతున్నారు. మహిళలని కూడా చూడకుండా బూతులు తిడుడూ, వారిపై దాడికి పాల్పడుతున్నారు. గతంలో అమరావతి మహిళలపై సైతం విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. పులివెందుల నాగమ్మకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తే నాపై అట్రాసిటీ కేసు పెట్టారు. తాజాగా కదిరిలో పోలీస్ ఇన్స్పెక్టర్ మధు మహిళలపై దాడిపి పాల్పడ్డాడు.ఈ నెల 25 న కదిరిలో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వీధులు వెడల్పు చేస్తున్న పేరుతో రెవెన్యూ అధికారులు అక్కడున్న షాపులను ధ్వంసం చేశారు.ఆ నేపద్యంలో షాపు యజమానులు మరి కొంతమంది నిరసన తెలయజేయగా ఇన్స్పెక్టర్ మధు వారిపై అసభ్యకరంగా బూతులు తిడుతూ సభ్యసమాజం తలదించుకునేలా ప్రవర్తించాడు. దళిత వర్గానికి చెందిన సుధారాణి అనే మాజీ కౌన్సిలర్ ను అసభ్యకరంగా దూషించాడు.

వైసీపీకి చెందిన కొంతమంది గూండాలు రాళ్లు విసరడంతో అనేక మందికి గాయాలయ్యాయి. ఇన్స్పెక్టర్ చర్యలకు వ్యతిరేకంగా అదేరోజు సాయంత్రం కొంతమంది మహిళలు ఆయన ఇంటి ముందు శాంతియుతంగా నిరసన తెలిపార.ఆ సమయంలో మధు, ఆయన సిబ్బంది మహిళలపై లాఠీఛార్జీ చేసి దాడికి పాల్పడ్డారు. మధు మీసాలు మెలేస్తూ…తొడలు కొడుతూ మహిళలను అసభ్యకరంగా దూషించాడు.ఆడవారు వారు వంటింటికే పరిమితమవ్వాలి..రోడ్లపైకి రాకూడదంటూ తిట్టాడు.పోలీసుల దాడిలో అనేకమంది మహిళలు గాయపడి ఆసుపత్రి పాలయ్యారు.ఆ సంధర్బంలో అక్కడ మహిళా పోలీసులు ఎవరూ లేరు. గంగారత్నమ్మ, ప్రవీణ్ బాబి అనే మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.కమీషన్ వారు ఈ ఘటనపై విచారణ చేసి ఇన్స్పెక్టర్ మధుపై తగు చర్యలు తీసుకోగలరు. వీలైనంత తొందరగా చర్యలు తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో మహిళలకు రక్షణ కల్పించగలరని ప్రార్ధన.

LEAVE A RESPONSE