విజయవాడ : భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచనల మేరకు నేటి నుంచి 15 నుంచి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభం అయింది. ఈ సందర్బంగా ఆకాష్ కోచింగ్ సెంటర్ లో జరిగిన వ్యాక్సినేషన్ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా పరిషత్
మాజీ చైర్మన్ పాతూరి నాగభూషణం .మాట్లాడుతూ దేశంలోని ప్రజలందరికీ టీకా వేయాలన్నదే మోదీ లక్ష్యమన్నారు. టీకాల కోసం ఇప్పటివరకూ మోదీ ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయల ఖర్చు పెట్టిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమం లో రమేష్ ,దుర్గారావు ,ప్రసాద్ కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు.