Suryaa.co.in

National

రాష్ట్రపతితో వద్దిరాజు భేటీ

ఢిల్లీ: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర,కే.ఆర్.సురేష్ రెడ్డి,దీవకొండ దామోదర్ రావు తదితర ఎంపీలతో కలిసి రాష్ట్రపతి భవన్ లో శుక్రవారం ఉదయం అల్పాహారం తీసుకున్నారు.పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంగా ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సభ్యులను ఆహ్వానించి అల్పాహార విందు నిచ్చారు.ఈ సందర్భంగా ఎంపీ రవిచంద్ర రాజ్యసభలో తన సహచర సభ్యులు సురేష్ రెడ్డి, దామోదర్ రావులతో పాటు రాష్ట్రపతి ముర్మును కలిశారు, అల్పాహారం,తేనీరు తీసుకున్నారు.

LEAVE A RESPONSE