– అటల్ మోడీ సుపరిపాలన యాత్ర ముగింపు సభలో మంత్రి సత్యకుమార్ యాదవ్
అమరావతి: వాజ్ పేయి 101 వ జయంతి సందర్భంగా ఆయన స్మృతికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నా…. సామాన్య స్థాయి నుంచి అసామాన్య స్థాయికి ఎదిగిన మహానుభావుడు. ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా.. నవ్వుతూనే ఎదుర్కొని నిలబడిన వ్యక్తి వాజ్ పేయి అని ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. 70యేళ్ల రాజకీయ జీవితంలో ఒక్క అవినీతి మరక లేని ఏకైక వ్యక్తి. పోర్టు, ఎయిర్ పోర్టు, జాతీయ రహదారులు, ఐటీ, టెలికం కనెక్టివీటీలతో పాటు, పోలిటికల్ కనెక్టివీటీలు తెచ్చిన నేత వాజ్ పేయి.
రైతులకు కిసాన్ కార్డులు, గ్రామాలలో రోడ్లు, సర్వశిక్ష అభియాన్ ద్వారా అందరికీ విద్యను అందించారు. కవి ద్వారా ప్రజా సమస్యలను వివరిస్తూ.. తమ వాక్ చాతుర్యంతో పరిష్కారం చూపేవారు. అటువంటి మహానేత వాజ్ పేయ్ విగ్రహాలను ఏర్పాటు చేసుకుని.. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకంటున్నాం. సౌమ్యుడిగా పేరు గడించిన వాజ్ పేయి… దేశ భద్రత విషయంలో మాత్రం చాలా గట్టిగా నిలబడ్డారు. చరిత్రను తిరగరాస్తానని చెప్పి మరీ చేసిన ధీరుడు వాజ్ పేయి. ఆయన స్పూర్తితోనే మోడీ నేడు దేశాన్ని ముందుకు తీసుకు వెళుతున్నారు.
చంద్రబాబు కూడా అదే దారిలో నడుస్తూ.. రాష్ట్రాన్ని అభివృద్ది దిశగా పరుగులు పెట్టిస్తున్నారు. జాతీయ రహాదారులు, ఎక్స్ ప్రెస్ వేలు, మెట్రో ప్రాజెక్టులు నిర్మాణం జరుగుతున్నాయంటే నాడు వాజ్ పేయ్ చూపిన దారిలోనే నేడు మోడీ కొనసాగిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయకత్వతంలో విశాఖ, విజయవాడలో మెట్రో ప్రాజెక్టులు ప్రారంభం కాబోతున్నాయి. మోడీ స్టార్టప్ ఇండియా వంటి అనేక వినూత్న కార్యక్రమాలుతెచ్చి.. 11వస్థానం నుంచి 4వస్థానానికి దేశాన్ని తీసుకు వచ్చారు. 2047 నాటికి దేశం ఆర్ధికాభివృద్దిలో ప్రపంచంలో మనం ఒకటో స్థానంలో ఉండే లక్ష్యంగా పాలన సాగుతుంది.
నాడు వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో యన్డీఎ అధ్యక్షుడిగా చంద్రబాబు ఉన్నారు. ఇద్దరూ కలిసి ఉమ్మడి ఏపీని అభివృద్ది చేస్తే.. నేడు మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకు వెళుతున్నారు. గత ఐదేళ్లలో అరాచకం, విధ్వంసకర పాలన సాగింది. మళ్లీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేలా చంద్రబాబు సంక్షేమం, అభివృద్ది సమాంతరంగా చేస్తున్నారు. ఆర్థిక విధ్వంసంతర్వాత కూడా సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ చేసిన నేత చంద్రబాబు. స్త్రీ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయణం ద్వారా మహిళలు ఆస్పత్రులకు , బంధువుల ఇళ్లకు వెళ్లి వస్తున్నారు. ఉదయం నుంచీ సాయంత్రం వరకు బస్సులలో అమ్మను, అత్తను, ఆడపడుచులను పరామర్శించి వస్తున్నారు.
నేడు ఆడబిడ్డలకు ఆర్థిక స్వాంతనం ఇచ్చేందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారు.
అటల్ జీ చూపిన స్పూర్తితో స్వర్ణాంధ్రప్రదేశ్ గా మన రాష్ట్రాన్ని చంద్రబాబు తీర్చిదిద్దుతారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడూ ఆశీర్వదించాలని కోరుతున్నాం