– మంత్రి సత్యకుమార్ యాదవ్
విజయవాడ: వాజ్ పేయి మోదీ సూపరిపాలన యాత్ర కి ముఖ్య అతిథిగా విచ్చేసిన మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ కి ప్రత్యేక ధన్యవాదాలు. 10గంటల నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు ఓపికగా ధర్మవరం ప్రజలు కూర్చున్నారని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఆవిష్కరల సృష్టికర్త ప్రజల జీవన ప్రమాణాలు పెంచటమే కాకుండా ఆర్థిక ప్రగతిని ముందుంచి అద్భుత పరిపాలన ని వాజ్ పేయి అందించారు. వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం.
25వ తేదీ అమరావతిలో సీఎం చంద్రబాబు బహిరంగ సభలో పాల్గొంటారు. బాపట్ల బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పాల్గొంటారు. ఆనాడు అనేకరకాలైన సంస్కరనలు తీసుకొచ్చి భవిష్యత్తు తరాలకి ఉజ్వలంగా ఉండేవిధంగా ఒక విప్లవాత్మకంగా మార్పులు తీసుకొచ్చారు. బెంగాల్ మమతా కూడా ఆనాడు వాజ్ పై ప్రభుత్వం లో మంత్రి గా పనిచేశారు. 23పార్టీ ల పొలిటికల్ కనెక్టివిటీ ని చేసి అజాత శత్రువుగా వాజ్ పేయి నిలిచారు.
దేశానికి చేసిన సేవలు గుర్తించాలి. భవిష్యత్ తరాలు బాగుంటాయి రాష్ట్ర ఆర్థిక ప్రగతి సాధిస్తాయో పునఃగమనం కోసం ఉత్సవాలు చేస్తున్నాం.
గ్రామాల్లో నివసించే రైతులు, విద్యార్థుల కోసం గ్రామసడక్ యోజనకి శ్రీకారం చుట్టారు. రహదారుల నిర్మాణానికి ఆజ్యుడు వాజ్ వాజ్ పేయి. ఎన్ఆర్ఇజిఎ కింద వ్యవసాయ కూలీల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చారు. హైవే కనెక్టివిటీ తీసుకొచ్చి స్వర్ణ చతుర్బుజి పథకాన్ని ప్రారంభించి 5వేల కిలోమీటర్లు నిర్మించారు.