– ఏబీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న అటల్ బిహారీ వాజ్‌పేయి స్మారకోపన్యాసంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్: వాజ్ పేయి జయంత్యుత్సవాలను ఏడాదిపాటు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్వహించింది. వాజ్ పేయి జీవితంలో.. నేటి యువతరం, రేపటి తరం నేర్చుకోవాల్సింది. ఆయన స్ఫూర్తిగా ముందుకెళ్లాల్సింది ఎంతో ఉంది.
నేను విద్యార్థిగా ఉన్నప్పుడు.. చిన్న బ్యాగ్ తీసుకుని పార్టీ కార్యాలయం చేయాను. ఏ జాతీయ నాయకుడు వచ్చినా వారిని రైల్వేస్టేషన్లో రిసీవ్ చేసుకోవడం, వారికి వీడ్కోలు తెలపడం, వారికి సహాయక్ గా ఉ న్నాను.
వాజ్ పేయి ప్రధాని అయ్యేంతవరకు.. వారు వచ్చినప్పటినుంచి తిరిగి విమానం ఎక్కేంతవరకు నేను చూసుకునే అవకాశం దొరికేది. ఉదయాన్నే పేపర్లు ఇవ్వడం, వారి భోజన వ్యవస్థ చూసుకోవడం వంటివెన్నో చూశాం.
కానీ వారు ఏనాడూ ఎవరినీ విసుక్కోలేదు.
చిన్న చిన్న సభలనుంచి మొదలుపెట్టి.. ఏపీ, తెలంగాణలో వాజ్ పేయి తిరగని జిల్లాలేదు. పెద్ద పట్టణం లేదు. వరంగల్, గుంటూరు, రాజమండ్రి వంటి నగరాలకైతే చాలా సార్లు వచ్చారు. వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ సందర్భంగా వారితో తరచూ కలిసే వాడిని.
ఉగ్రవాద వ్యతిరేక సదస్సును ఢిల్లీలో నిర్వహించాలనుకున్నప్పుడు విజ్ఞాన్ భవన్ వేదికగా.. పార్టీ జెండాతో జరిగే జరిగిన ఏకైక సదస్సుకు ప్రత్యేకంగా జీవో ఇచ్చారు. ఆ తర్వాత ఏనాడూ పార్టీ కార్యక్రమాలు అక్కడ జరగలేదు.
వారి మాటలు వినడానికి ఎక్కడెక్కడినుంచే వచ్చేవారు.
నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చిన గొప్ప నాయకుడు వారు. పార్లమెంటులో విశ్వాస తీర్మానం.. సందర్భంగా ఒక్క ఓటు తక్కువగా ఉన్న సందర్భంలోనూ విలువలను వదులుకోక.. ప్రధాని పదవిని వదులుకున్న మహామనిషి వాజ్ పేయి. వాజ్ పేయి ఒక వ్యక్తి కాదు. వారు ఒక చరిత్ర.
ఎమర్జెన్సీ సమయంలో మీసా కేసులో జైల్లో ఉన్నప్పుడు. జనతాపార్టీలో విలీనం చేసేందుకు ఏమాత్రం ఆలోచించలేదు. వారి దృష్టిలో నేషన్ ఫస్ట్, పార్టీ నెక్ట్స్, పర్సన్ లాస్ట్. ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరగాలన్న లక్ష్యంతో జనతాపార్టీలో జనసంఘ్ నువిలీనం చేశారు.అది దేశం పట్ల, ప్రజాస్వామ్యం పట్ల వారికున్న అంకితభావానికి నిదర్శనం.
వారు మాట్లాడుతుంటే.. అన్ని పార్టీుల నాయకులు శ్రద్ధగా వినేవారు. అందుకే వాజ్ పేయి గారి జీవితం భవిష్యత్ తరాలకు ఓ డిక్షనరీలాంటిది. రానున్న రోజుల్లో.. వాజ్ పేయి కవితలను పుస్తకాల రూపంలో అందించడం మొదలుకుని.. కవి సమ్మేళనాలు నిర్వహించడం ద్వారా యువతలో ఆసక్తిని రేకెత్తించాలని.. ఏబీవీ ఫౌండేషన్ వారిని కోరుతున్నాను.
విదేశాంగ నేతగా ఉన్న సమయంలో ఐక్యరాజ్యసమితి సమావేశంలో మొదటిసారి హిందీలో మాట్లాడిన వ్యక్తి వాజ్ పేయి భరతమాత ముద్దుబిడ్డ వారు. పీవీ ప్రధానిగా ఉన్నప్పుడు.. భారతదేశ ప్రతినిధి బృందానికి నేతృత్వం వహించారు. నేటి పరిస్థితుల్లో విపక్ష నాయకులు.. విదేశీ వేదికలపై మన దేశానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
అమెరికాలో ఉన్న రోడ్లు మన దేశంలో సాధ్యమా అని అనుమానాలు వచ్చాయి. 77వేల కోట్లతో చేపట్టిన స్వర్ణ చతుర్భుజి కి ప్లాన్ చేస్తే చాలా మంది విమర్శించారు. కానీ దాన్ని సాధికారికంగా ముందుకెళ్లి సాకారం చేసుకున్నాం. వాజ్ పేయి స్ఫూర్తితో.. నరేంద్రమోదీ నేతృత్వంలో ఇవాళ మనం ముందుకెళ్తున్నాం.
దేశ భద్రత, దేశ సమగ్రత విషయంలో రాజీ పడలేదు. శత్రుదేశమైన పాకిస్తాన్ కు బస్సులో వెళ్లారు. స్నేహపూర్వకంగా ఉండాలని ప్రయత్నించారు. అదే సమయంలో వారు వెన్నుపోటు పొడిచేసేందుకు ప్రయత్నిస్తే.. అన్ని రాజకీయ పార్టీలను ఏకం చేసి సైనికుల సహాయంతో కార్గిల్ యుద్ధంతో పాక్ కు బుద్ధి చెప్పారు.
2025 డిసెంబర్ వరకు ఏడాదిపాటు అటల్ జీ జన్మజయంత్యుత్సవాలు జరుపుకుంటున్నాం. ఏబీవీ ఫౌండేషన్ ద్వారా ఏడాదిపాటు ఉత్సాహంగా కార్యక్రమాలు నిర్వహించి.. స్మారకోపన్యాసాలు ఏర్పాటుచేయాలి.