ఒక కోటీశ్వరుడు నడుచు కుంటూ వస్తూఉండగా ఒక ఇంటి ముందుకు రాగానే తన కాలి చెప్పులు తెగిపోయాయి ! ఆ ఇంటిలోని యజమానిని పిలిచి నా చెప్పులు తెగిపోయాయి ఇక్కడ వదిలి వెళ్తానండి, పారేయొచ్చు కానీ కొత్తవి ! అందుకే మనసు రావట్లేదు రేపు పనివారిని పంపించి తీసుకువెళతాను అని అడిగాడు !
అందుకు ఆ ఇంటి యజమాని అయ్యా మీరు ఎంతో పెద్ద కోటీశ్వరులు మీ చెప్పులు మా ఇంటి ఆవరణలో ఉంటెే మాకే గౌరవం. మీరు వెళ్ళిరండి అప్పటి వరుకు నేను చూసుకొంటా అని చెప్పాడు. తర్వాత ధనవంతుడు తన పనిలో పడి ఆ విషయాన్నీ మరిచిపోయాడు. ఒకరోజు హఠాత్తుగా ఆ ధనవంతుడు చనిపోయాడు. ఆయన శవం ఊరేగింపు జరుగుతున్నది. భారీ వర్షం మొదలయింది. ఎవరూ అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితి.
యాధృచ్చికంగా ఆయన ఆరోజు చెప్పులు వదిలిన ఇంటి ముందు సరిగ్గా శవాన్ని తీసుకొచ్చి ఆపి ఆ ఇంటి యజమానిని పిలిచారు. వర్షం ఎక్కువగా ఉందండి. వర్షం ఆగే వరకు శవాన్ని మీ ఇంటి ముంగిట కాసేపు ఉంచుకుంటాం అని అడిగారు. అందుకు ఆ ఇంటి యజమాని కోపం కట్టలుతెంచుకున్నాయి. మొదట శవాన్ని తీయండి. ఎవరి ఇంటి శవాన్ని ఎవరింటి ముందు ఉంచేది మీరు అని కసురుకున్నాడు. చేసేది లేక వాళ్ళు అక్కడ నుంచి ఆ వర్షంలోనే నిష్క్రమించారు.
చూశారా మిత్రమా , విధి ఎంత విచిత్రమైనదిో కదా? అంతే అండి. ప్రాణం ఉన్నంత వరకు చెప్పుల కున్న విలువకూడా, ప్రాణం పోయాక మనిషికి ఉండదు కదా? నీ వెనుక ఎంత డబ్బు ఉన్నా అంతే.. డబ్బుకు విలువ ఎక్కువ అనుకుంటారు కానీ, నిజానికి ప్రాణంకే విలువ ఎక్కువ. ప్రాణం పోయాక కోట్లు ఉన్నా వృధానే. తెగిన చెప్పుకున్న విలువ మనిషికి లేదా ? కాబట్టి మనిషికే విలువిద్దాం. మానవత్వం నిలబెడదాం.
– సేకరణ