– గంగాధర్‌కు భూపతిరాజు శ్రీనివాసవర్మ సూచన
భీమవరం: నరసాపురం పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ ని బీజేపీ రాష్ట్ర మీడియా కో కన్వీనర్ వెలగలేటి గంగాధర్ రాష్ట్ర బ్రాహ్మణ వెల్ ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి, రాష్ట్ర బ్రాహ్మణ వెల్ ఫేర్ కార్పొరేషన్ డైరెక్టర్ పదవి వరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా శ్రీనివాస వర్మ మాట్లాడుతూ పార్టీ కోసం అనేక సంవత్సరాలుగా కృషి చేసిన వెలగలేటి గంగాధర్ కి శుభాకాంక్షలు చెప్పి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా పేద బ్రాహ్మణులను గుర్తించి వారి అభ్యున్నతికి కృషి చేయాలని సూచిస్తూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, బీజేపీ రాష్ట్ర పబ్లిసిటీ అండ్ లిటరేచర్ ప్రముఖ్ పాలపాటి రవికుమార్, బీజేపీ సీనియర్ నాయకులు ఈమని మాధవరెడ్డి, యువమోర్చా నాయకులు జంధ్యాల సాయి, రాధాకృష్ణ పాల్గొన్నారు.