Suryaa.co.in

Andhra Pradesh

మంత్రి సవితను కలిసిన ‘వన్యకుల క్షత్రియ’ చైర్మన్ రాజన్

అమరావతి : రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవితను నూతనంగా నియమితులైన ఏపీ వన్యకుల క్షత్రియ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సీఆర్ రాజన్ మర్యాద పూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి సవితను సీఆర్ రాజన్ మంగళవారం కలిశారు.

తనపై ఎంతో నమ్మకంతో ఏపీ వన్యకుల క్షత్రియ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా అవకాశమిచ్చినందుకు సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ తో పాటు మంత్రి సవితకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయబోనని, ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలను ప్రజల్లో తీసుకెళతానని మంత్రికి వివరించారు. వన్యకుల క్షత్రియుల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని వెల్లడించారు.

ఏపీ వన్యకుల క్షత్రియ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎంపికైన సీఆర్ రాజన్ కు మంత్రి సవిత అభినందనలు తెలిపారు. కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వమందించే పథకాలను అర్హులకు అందేలా కృషి చేయాలని రాజన్ కు మంత్రి సవిత సవిత సూచించారు. అనంతరం మంత్రి సవితను రాజన్ దుశ్శాలువాతో సత్కరించారు. ఈ సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE