Home » మంత్రి డోలాకు వర్ల అభినందన

మంత్రి డోలాకు వర్ల అభినందన

-దళితుల క్షేమం మరువద్దు: వర్ల
– బాబు నమ్మకం నిలబెడతా: మంత్రి డోలా

అమరావతి: కొండపి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మర్యాదపూర్వకంగా ఆయన ఛాంబర్ లో కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

సీఎం చంద్రబాబు దళితులకు పెద్ద పీట వేశారని.. దళితులకు వెన్నుదన్నుగా నిలిచిన గొప్ప వ్యక్తి చంద్రబాబు అని అందుకే దళిత బిడ్డల పురోభివృద్ధికి ఎంతగానో దోహదపడే సాంఘిక సంక్షేమ శాఖను దళిత ఎమ్మెల్యే బాలవీరాంజేయస్వామికి ఇవ్వడం గర్వకారణంగా ఉందని వర్ల రామయ్య అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఇచ్చిన గురుతర బాధ్యతను గౌరవ ప్రదంగా భావించి దళిత బిడ్డల సంక్షేమానికి, ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలని మంత్రికి సూచించారు. దళితులకు విద్యతో పాటు సమాజంలో గౌరవప్రదమైన జీవన మనుగడకు కృషి చేయాలని కోరారు.ద

ళిత మంత్రిగా రాష్ట్ర సంక్షేమంతో పాటు దళితుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేలా కృషి చేసి సమాజంలో ఎనలేని గౌరవాన్ని కైవసం చేసుకోవాలన్నారు.. మంత్రిగా డోలా రాజకీయ జీవితం పదిమందికి ఆదర్శంగా ఉండేలా పనిచేయాలన్నారు.

ఈ సందర్భంగా మంత్రి గౌరవప్రదంగా వర్లరామయ్యను ఆలింగనం చేసుకుని… చంద్రబాబు తనకు ఇచ్చిన మంత్రి పదవి యావత్ దళిత సమాజానికి ఇచ్చిన గౌరవమని.. ఆ గౌరవానికి కించిత్తు మాట రాకుండా, దళిత బిడ్డల సంక్షేమంతో పాటు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకోసం అహర్నిశలు కృషిచేస్తానని, టీడీపీకి తనపై నమ్మకం ఉంచి మంత్రిపదవి ఇచ్చిన చంద్రబాబు కు మంచిపేరు తెచ్చేలా పనిచేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

Leave a Reply