– ఏపీ సీఐడీ పోలీసులుగా చెబుతున్న నలుగురు వ్యక్తులపై తెలంగాణ చైల్డ్ రైట్స్ కమిషన్ కు పిర్యాదు చేసిన తెదేపా పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
అక్టోబర్ 1 న హైదరాబాద్‌లో ఏపీ సీఐడీ పోలీసుల వికృత చేష్టలను మీ దృష్టికి తీసుకువస్తున్నాను. ఉదయం 11 గంటలకు చింతకాయల విజయ్ ఇంట్లోకి సివిల్ డ్రెస్ లో ఉన్న నలుగురు వ్యక్తులు చొరబడ్డారు. ఫ్లాట్‌లోకి బలవంతంగా ప్రవేశించి విజయ్ డ్రైవర్‌ను కొట్టారు. షెల్ఫ్‌లు, కబ్బోర్డులు తెరిచి వస్తువులను చెల్లాచెదురు చేశారు.సివిల్ డ్రస్ లో ఉన్న ఆ నలుగురు వ్యక్తులు ఏపీ సీఐడీ పోలీసులని సమాచారం.
విజయ్ 5 ఏళ్ల కుమార్తెను మీ నాన ఎక్కడని ప్రశ్నించారు. చిన్నారిని పదే పదే ప్రశ్నించి, భయభ్రాంతులకు గురిచేసి తీవ్ర మానసిక వేధింపులకు గురిచేశారు.ఐదేళ్లు, రెండేళ్లు వయస్సున్న
పిల్లల ఫోటోలను సీఐడీ పోలీసులు తీసుకెళ్లారు. పోలీసులు ప్రశ్నించడంతో చిన్నారుల మానసిక వేదనకు గురయ్యారు.పిల్లలతో అనుచితంగా ప్రవర్తించిన ఏపీ సీఐడీ పోలీసులుగా చెబుతున్న నలుగురిపై చట్ట ప్రకారం తగు చర్యలు తీసుకోండి. తగిన సెక్షన్ల కింద కేసు నమోదు చేసేలా తెలంగాణ పోలీసులను ఆదేశించాలని విజ్ఞప్తి.