Suryaa.co.in

Andhra Pradesh

టీడీపీ కేంద్ర కార్యాలయంలో వర్ల రామయ్య జన్మదిన వేడుకలు

అమ‌రావ‌తి : ప్రజా నాయకుడు బడుగు బలహీన వర్గాలకు వెన్నుదన్నుగా నిలబడే నేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య జన్మదిన వేడుకలను టీడీపీ కేంద్ర కార్యాలయంలో అంగరంగవైభవంగా నిర్వహించారు. అన్న ఎన్టీఆర్ విగ్రహం ముందు భారీ కేక్ ను కట్ చేసి పంచారు. టీడీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురి పేదలకు ఆర్థిక సహాయార్థం చెక్కులను అందించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంభూపాల్ రెడ్డి, మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎస్సీ సెల్ ఉపాధ్యక్షుడు కోడూరు అఖిల్, మంద మురళి, చిలక బసవయ్య, రామారావు, బేతపూడి సుధాకర్, ప్రకాష్, కట్టిపోగు వెంకయ్య, మల్లవరపు వెంకట్, ఆలూరు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE