• లోకేశ్ పాదయాత్ర జరిగితే, అతని పాదం వైసీపీప్రభుత్వాన్ని పాతాళంలోకి తొక్కేస్తుందన్న భయంతోనే సీఎం జగన్, సజ్జల రామకృష్ణారెడ్డి, డీఐజీ కొల్లి రఘురామిరెడ్డిని యువగళంయాత్రపైకి ప్రయోగించారు
• రఘురామిరెడ్డి గతచరిత్ర మొత్తం మావద్ద ఉంది. అతనిపై జరుగుతున్న సీఐడీ దర్యాప్తు, రవిగుప్తా అనే అధికారి అతనికి ఛార్జ్ మెమో ఇవ్వడం, పొలాలకొనుగోళ్లు, అమ్మకాల వ్యవహారంలో అతని ప్రమేయం వంటి వివరాలన్నీ మా దృష్టికి వస్తున్నాయి
• టీడీపీ ప్రభుత్వంలో ఏవో అవకతవకలు జరిగాయని, వాటిపై ఉన్నవి లేనివి చెప్పి, చంద్రబాబు లోకేశ్ లపేర్లు చెబితే ప్రమోషన్లు ఇప్పిస్తానని రఘురామిరెడ్డి సచివాలయంలోని ఉద్యోగుల్ని ప్రలోభపెడుతున్నది నిజంకాదా?
• చట్టవిరుద్ధంగా పనిచేస్తూ, జగన్మోహన్ రెడ్డి మెప్పుకోసం ప్రతిపక్షనేతల్ని, ప్రజల్ని ఇబ్బందులకు గురిచేస్తున్న డీఐజీ రఘురామిరెడ్డిపై డీవోపీటీకి ఫిర్యాదు చేస్తాం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
లోకేశ్ యువగళం యాత్రకు నానాటికీ లభిస్తున్న ప్రజాస్పందన చూసి ఓర్వలేకనే జగన్మో హన్ రెడ్డి, తనకు అత్యంత సన్నిహితుడైన డీఐజీ కొల్లి రఘురామిరెడ్డిని పాదయాత్ర విధ్వం సరచనకు ప్రయోగించాడని, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అంతా రఘురామిరెడ్డి చేతుల్లోనే ఉందని అధికాపార్టీ వారే చెబుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు వర్ల రామయ్య తెలిపారు. మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ వివరాలు క్లుప్తంగా ఆయన మాటల్లోనే…
“లోకేశ్ పాదయాత్రతో ప్రజల్లో, మరీముఖ్యంగా యువతలో చైతన్యం వచ్చింది. యువగళం యాత్రకు వస్తున్న ప్రజాస్పందన చూసి ఓర్వలేకనే ప్రభుత్వం లోకేశ్ పాదయాత్రకు అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తోంది. పాదయాత్ర చేయడం లోకేశ్ హక్కు. ఆ హక్కుని అడ్డుకునే అధికారం పోలీసులకు ఎవరిచ్చారని ప్రశ్ని స్తున్నాం. ప్రభుత్వం చెప్పినదానికల్లా పోలీసులు జీహుజూర్ అనడం సరైంది కా దు. పోలీసులు అన్నీ ఆలోచించే పనిచేస్తున్నారా..లేక సజ్జల రామకృష్ణారెడ్డి ట్రాన్స్ లో ఉండి విధులు నిర్వహిస్తున్నారా?
లోకేశ్ పాదయాత్ర విధ్వంసరచనకోసం ముఖ్యమంత్రే, డీఐజీ కొల్లి రఘురామిరెడ్డిని యువగళంపైకి ఉసిగొల్పారు
లోకేశ్ పాదయాత్ర ప్రారంభమైనప్పటినుంచీ వారంరోజులు ఎలాంటి ఆటంకాలు, అవరోధాలు లేకుండా లోకేశ్ యాత్ర సాగింది. వారంరోజులు నిరంతరాయంగా పాదయాత్రసాగాక, ఇప్పుడు ప్రభుత్వం దేనికి అడుగడుగునా అడ్డుకోవాలని చూస్తోంది. లోకేశ్ పాదయాత్రపై ప్రభుత్వం కుట్ర పన్నింది. ఈ కుట్రలో ప్రధాన సూత్రధారి డీఐజీ కొల్లి రఘురామిరెడ్డి. లోకేశ్ పాదయాత్రకు అడుగడుగునా ఆంటకాలు కలిగిస్తూ, విధ్వంసరచన చేస్తోంది ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితుడైన డీఐజీ కొల్లి రఘురామిరెడ్డే. సదరు డీఐజీ తిమ్మిని బమ్మిని చేస్తారని ఆయన గతచరిత్ర చెబుతోంది. అలాంటి వ్యక్తి లోకేశ్ పాదయాత్ర విధ్వంసరచనకు దర్శకత్వం వహిస్తున్నారు. దానిపై పర్యవేక్షణ బాధ్యతలు ఇంటిలిజెన్స్ అడిషనల్ డీజీ సీతారామాంజనేయులు నిర్వహిస్తున్నారు. లోకేశ్ పాదయాత్ర జరిగితే, అతని పాదం, వామనమూర్తి బలిచక్రవర్తిని తొక్కేసినట్టుగా, వైసీపీప్రభుత్వాన్ని పాతాళంలోకి తొక్కేస్తుందన్న భయంతోనే సజ్జల రామకృష్ణారెడ్డి, డీఐజీ కొల్లి రఘురామిరెడ్డిని యువగళంపైకి ప్రయోగించారు. జగన్మోహన్ రెడ్డిని సంతృప్తిపరచడం, తప్పుడుకేసుల రచన తప్ప రఘురామిరెడ్డికి మరోపనిలేదు. స్థానిక పోలీస్ అధికారులు వారిడ్యూటీ వారు సక్రమంగా చేస్తూ, పాదయాత్ర సజావుగా జరిగేలా చూస్తుంటే, వారిపై డీఐజీ రఘురామిరెడ్డి చర్యలు తీసుకోవడమేంటి? సక్రమంగా విధినిర్వహణ చేసిన వారికి ఛార్జ్ మెమోలు ఇస్తారా? అదేనా మీరు చేయవలసింది రఘురామిరెడ్డి గారు? పాదయాత్రలో విధులు నిర్వహిస్తున్న డీఎస్పీకి ఫోన్ చేసిన అజ్ఞాతవ్యక్తి మీరేనా రఘురామిరెడ్డి గారు?
రఘురామిరెడ్డి తప్పులన్నీ క్రోడీకరించి, ఆయనపై త్వరలో డీవోపీటీకి ఫిర్యాదు చేస్తాం..
టీడీపీ ప్రభుత్వంలో ఏవో అవకతవకలు జరిగాయని వాటిలోని నిజానిజాలు నిగ్గుతేల్చాలని ఈ ప్రభుత్వం డీఐజీ కొల్లి రఘురామిరెడ్డికి బాధ్యతలు అప్పగిస్తే, ఆయన ఎలుకతోక కూడా పట్టుకోలేకపోయింది నిజం కాదా? సచివాలయంలోని ఉద్యోగుల్ని భయపెడుతూ, ప్రలోభపెడుతూ, ఏదోరకంగా చంద్రబాబు, లోకేశ్ లపై తప్పుడు ఆరోపణలు చేయించడానికి మీరు తాపత్రయపడుతున్నది నిజంకాదా రఘురామిరెడ్డిగారు? ఎందుకింతలా దిగజారి పనిచేస్తున్నారు మీరు… మీరు ఎన్ని అవకతవకలు చేసినా, ఎన్నిఇబ్బందులు పెట్టినా, తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక మీలాంటి వారందరి బతుకులు బయటకు తీస్తామని గుర్తుంచుకోండి. చట్టబద్ధంగా రఘురామిరెడ్డిపై చర్యలు తీసుకునే తీరతాం. మీపై సీఐడీ దర్యాప్తు జరుగుతున్నది నిజం కాదా రఘురామిరెడ్డిగారు? ఐపీఎస్ అధికారిగా ఉండి ఎందుకు తప్పులుచేస్తున్నారని రవిగుప్తా అనే సీనియర్ అధికారి మీకు ఛార్జ్ మెమో ఇచ్చింది నిజమా..కాదా? మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో, పొలాలుకొని అమ్మడంలో వేలుపెట్టారన్నది నిజమేనా? అన్యాయంగా రఘురామిరెడ్డి మాపై, మాపార్టీపై దాడిచేస్తుంటే మేం చూస్తూ ఊరుకోం కదా? ఆయన అధికారపార్టీకి తొత్తుగా మారాడు. ఆయన చరిత్ర మొత్తం క్రోడీకరిస్తూ త్వరలో డీవోపీటీకి లేఖ రాస్తాం.
డీఐజీ రఘురామిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో పనిచేయకుండా, చట్టబద్ధంగా న్యాయప్రకారం పనిచేస్తే మంచిది…
లోకేశ్ పాదయాత్ర ఆపితే మీకు ఏం ఒరుగుతుందో చెప్పండి. మీరు ఆపేకొద్దీ లోకేశ్ కు ఊపు వస్తోంది. మీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువ అవుతోంది. తప్పుచేస్తే చట్టప్రకారం పనిచేయండి.. అంతేగానీ మీచేతులు కళంకం చేసుకోవద్దని పోలీసులకు సూచిస్తున్నాం. డీఐజీ రఘురామిరెడ్డి తనవైఖరి మార్చు కోవాలి. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో పనిచేయకుండా, చట్టబద్ధంగా, న్యాయప్రకారం నడుచుకోవాలని రఘురామిరెడ్డికి సూచిస్తున్నాం. రఘురామిరెడ్డి, జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడని, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అంతా రఘురామిరెడ్డి చేతుల్లోనే ఉంది.. డీజీపీ చేతిలో ఏంలేదని అధికారపార్టీ వారే చెబుతున్నారు. లోకేశ్ పాదయాత్రలో పాల్గొన్న టీడీపీనేత డూండీ రాకేశ్ ను కొట్టే అధికారం పోలీసులకు ఎవరిచ్చారు? ఏంచేశాడని ఎస్సై రాకేశ్ ని లాగి చెంపపై కొట్టాడు? లోకేశ్ కు ఇవ్వడా నికి హ్యాండ్ మైక్ తీసుకెళ్తున్నాడని బాషా అనే కుర్రాడిని రక్తం వచ్చేలా కొట్టమని పోలీసులకు ఏచట్టం చెప్పింది? ప్రతిపక్షాలపై చర్యలు తీసుకోవ డానికి దొంగకేసులు బనాయించవద్దని, లోకేశ్ పాదయాత్రపై విధ్వంసరచనలు చేయవద్దని, శాంతిభద్రతల విఘాతానికి ప్రధాన పాత్ర పోషించవద్దని కొల్లి రఘురామిరెడ్డిని హెచ్చరిస్తున్నాం. మీరు, మీరు తీసుకునేచర్యలే ఫైనల్ కాదని గుర్తుంచుకోండి రఘురామిరె డ్డిగారు. తప్పుచేసే అధికారులందరూ ఏదో ఒకనాడు తగిన మూల్యం చెల్లించుకుంటారు, పాదయాత్రలో ఓవరాక్షన్ చేసే పోలీసుల్ని వదిలేదే లేదు. డీఐజీ రఘురామిరెడ్డికి ధైర్యముంటే, ముఖ్యమంత్రి తో తనకున్న సాన్నిహిత్యాన్ని, చొరవను కిందిస్థాయిలో ఇబ్బందులుపడుతున్న పోలీసుల యోగక్షేమాలు, వారి సమస్యలపై మాట్లాడటానికి వినియోగించాలి.” అని రామయ్య సూచించారు.