* సంఘ విద్రోహక శక్తిని మంచివాడు అనడం జగన్ రెడ్డికే చెల్లు!
• మాచర్లలో అరాచకానికి పాల్పడిన ఏ2 ఎక్కడ?
* దళితుడు మణిక్యరావుపై దాడికి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి
• బోండా ఉమ, బుద్దా వెంకన్నలపై దాడికి హత్యాయత్నం కేసు పెట్టాలి
* టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
జగన్ రెడ్డి ఒక అబద్దాల పుట్ట అని.. నోరు తెరిస్తే అబద్దాలు తప్ప ఏమీ రావడం లేదని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఘోరమైన సంఘ విద్రోహ శక్తిని మంచివాడు అని చెప్పడం జగన్ రెడ్డికే చెల్లుతుందన్నారు. మాచర్లలో అరాచకాలు, హత్యలు విధ్వంసాలకు పాల్పడి ఈవీఎం బాక్సును ధ్వంసం చేసి కటకటాల్లోకి వెళ్లిన పిన్నెల్లిని అమాయకుడు అని చెప్పడం కంటే నీతి తక్కువ పని ఇంకొకటి లేదన్నారు.
వర్ల రామయ్య మాట్లాడుతూ.. రూ. 40 వేల కోట్లు కొల్లగొట్టి మనీలాండరింగ్ కేసులో 11 కు పైగా ఛార్జ్ షీట్లు ఉన్న వ్యక్తి మొన్నటి వరకు ఏపీకి ముఖ్యమంత్రిగా పనిచేయడం దురదృష్టకరం. ఒక రిమాండ్ ఖైదీని… ఎన్నో కేసుల్లో ఛార్జ్ షీట్ లు ఎదుర్కొంటున్న మరో ముద్దాయి జగన్ రెడ్డి నెల్లూరు జైల్లో మిలాఖత్ అయ్యాడు. ఇద్దరు ముద్దాయిలు కలిసి నెల్లూరు జిల్లా జైల్లో దాదాపు 22 నిమిషాలు యోగక్షేమాలు మాట్లాడుకున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఒక రిమాండ్ ఖైదీ.. ఎన్నో కేసుల్లో ముద్దాయిగా ఎదుర్కొంటున్న జగన్ రెడ్డి ముందు తాను చేసి నేరం ఈవీఎం బాక్సు ధ్వంసం చేయడం గురించి చెప్పాడు. జగన్ రెడ్డి ముందు పిన్నెల్లి నేరం ఒప్పుకున్నాడు. కోర్టులో కాకుండా బయట నేరం ఒప్పుకుంటే ఎగస్ట్రా జుడిషియల్ కన్ఫెషన్ అవుతుంది. పిన్నెల్లి అదే చేశారు.
పిన్నెల్లి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిస్తే మంచివాడు అయిపోతాడా? దొంగలు, దోపిడీదారులు కూడా అప్పుడప్పుడు గెలుస్తుంటారు. ఎన్నో కేసులు ఎదుర్కొంటున్న నేరస్తులు కూడా గెలుస్తుంటారు.. అంతమాత్రం మంచోళ్లు అవుతారా? గెలిచాడు కాబట్టి మంచివాడు అనడానికి వీల్లేదు. పిన్నెల్లి ఘోరాతి ఘోరమైన సంఘ విద్రోహక శక్తి.. ప్రజా కంఠకుడు. పిన్నెల్లిని మంచివాడు అనడం చూస్తే జగన్ రెడ్డి ఎంత అవగాహన రాహిత్యుడో తెలుస్తోంది. ఇన్వెస్టిగేషన్ చేస్తున్న అధికారులు జగన్ మోహన్ రెడ్డిని కూడా విచారణ చేయాలి… జైల్లో ఏమి మాట్లాడారో బయట పెట్టాలి. జగన్ రెడ్డి సాక్ష్యాన్ని కూడా కోర్టు లో ప్రవేశ పెట్టాలి… పిన్నెల్లి ఈవీఎం బాక్సును పగలగొట్టానని తనకు చెప్పినట్లు జగన్ రెడ్డి ఒప్పుకోవాలి. కోర్టు బెయిలు ఇస్తే నేరం చేయనట్లు కాదు జగన్ రెడ్డి. ఎన్నో కేసుల్లో ముద్దాయిగా ఉండి ఆ మాత్రం కూడా మీకు తెలియదా?
బుద్దా వెంకన్న, బోండా ఉమాలపై దాడి చేయించింది ఈ పిన్నెల్లి కాదా? అదృష్టం బాగుండి వారు బ్రతికి బయట పడ్డారు. సీఐని చంపేస్తాను నా కొడక అని మీదకు వెళ్లిన వ్యక్తి జగన్ రెడ్డికి మంచివాడంట. ఒక దళితుడు మాణిక్యరావు టీడీపీ తరఫున పోలింగ్ ఏజెంట్ గా కూర్చుంటే నా ఊరిలో బూత్ ఏజెంట్ గా కూర్చోవడానికి ఎంత ధైర్యం దళిత నా కొడకా అంటూ కొట్టారు. అతని ఇంటికి వెళ్లి భార్య బిడ్డలను కొట్టారు. అలాంటి వ్యక్తులు నీకు మంచివాళ్లా జగన్ రెడ్డి. అక్కడ ఉన్న డీఎస్పీ పిన్నెల్లి తమ్ముడి అరాచకానికి భయపడి మణిక్యరావును దొంగ దారిలో పోలీస్ స్టేషన్ కు తీసుకెళితే పోలీస్ స్టేషన్ పైకూడా దాడి చేశారు.. అలాంటి వాళ్లని నీవు మంచివాళ్లని అంటావా జగన్ ? పిన్నెల్లిని అరెస్ట్ చేస్తే… నరకాసుర వధ జరిగినట్లు మాచర్లలో పండుగ చేసుకున్నారు. ఏ కోణంలో పిన్నెల్లి జగన్ మోహన్ రెడ్డికి మంచివాడుగా కనిపించాడు ? పిన్నెల్లి చేసిన అరాచాకాలు ఎన్నో పోలీస్టేషన్ దగ్గరకు రాలేదే ?
పిన్నెల్లి చేసిన ప్రతి నేరం, అరాచకం వెనుక జగన్ రెడ్డి అభయ హస్తం ఉంది. జగన్ రెడ్డి అభయంతోనే మాచర్లలో ఒక భయానక వాతావరణం పిన్నెల్లి సృష్టించాడు. పిన్నెల్లి అరాచకాలపై విచారణ చేస్తున్న పోలీసులు మాణిక్యరావుపై దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టాలి, బుద్దా వెంకన్న, బొండాలపై దాడి చేసిన వారి మీద హత్యాయత్నం కేసు పెట్టాలి. చెన్నుపాటి గాంధీ కన్ను పోగొడితే ఫన్నీ కేసులు పెట్టారు. దీనిపై హత్యాయత్నం కేసు పెట్టాలి. వీటిని కోర్టు దృష్టికి తీసుకెళ్లాలి.. ఒక నీతి నిజాయితీ కలిగిన అధికారితో పల్నాడు ఎస్పీ దర్యాప్తు చేయించాలి. పిన్నెల్లి మంచివాడు అని చెబుతుంటే పోలీసులు ఎందుకు మౌనంగా ఉంటున్నారు ఎందుకు నోరు మెదపరు ? ఇంత అరాచకం చేసిన పిన్నెల్లిని చిన్నవాడు అంటున్న జగన్ రెడ్డిని ఏమనాలో అర్థం కావడంలేదు? ఘోరమైన సంఘ విద్రోహక శక్తిని మంచివాడు అని చెప్పడం జగన్ రెడ్డి చేసిన తప్పు. ఇంకా ఏ2 పిన్నెల్లి వెంకట్రామిరెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయలేదు ? వారిని ఇంటరాగేట్ చేసి ఎన్ని నేరాలు చేశారో తేల్చాలి. అందరి స్టేట్ మెంట్ రికార్డు చేసి నిజాలు బయట పెట్టాలి. జగన్ రెడ్డి స్టేట్ మెంట్ అబద్దపు స్టేట్ మెంట్. ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఒక విద్రోహక శక్తిని మంచివాడు అని చెప్పడం సిగ్గుచేటు.
ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఛీ కొట్టారో ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తులను మంచివాళ్లు అంటే ఇక జగన్ రెడ్డికి ఒటు వేసేవారు ఉండరు. చట్టం తన పని తాను చేసుకు పోతుంది. టీడీపీ ఆఫీసుపై దాడి చేసిన వారు ఎవరూ తప్పించుకోలేరు. ముద్దాయిలు ఇప్పుడు హైకోర్టు వద్దకు పరిగెడుతున్నారు. చంద్రబాబు చట్టాన్ని ఉపయోగించే అక్రమార్కులను అణిచివేస్తారు. అరాచకానికి సహకరించిన అధికారులను కూడా వదిలిపెట్టం. ఒకరోజు అటు ఇటో వారు మూల్యం చెల్లించుకుంటారు. అన్నీ బయటకు వస్తాయి. చట్టం చేతులు చాలా పొడవు. ఆ పొడవాటి చేతుల నుంచి ఎవరూ తప్పించుకోలేరని ఆయన అన్నారు.