• సుప్రీంకోర్టు ఆదేశాలను చంద్రబాబు, పార్టీ స్వాగతిస్తుంది
• సుప్రీంకోర్టు సిట్ వేయడం వైసీపీ నెత్తిన ‘భస్మాసుర హస్తమే’
• చంద్రబాబు వేసిన సిట్ ను తన ఆదేశాలతో సుప్రీంకోర్టు మరింత బలోపేతం చేసింది
• ఆ ఆదేశాలతో ఈ దొంగల టీం అంతా జైలుకే…
• వీరు అబద్దాలను అచ్చుగుద్దినట్టు మాట్లాడగలరు
• మీడియా సమావేశంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
మంగళగిరి: జగన్ రెడ్డి, వైసీపీ నేతలు పెద్ద అషాఢభూతులని.. వీరు అబద్దాలను అచ్చుగుద్దినట్టు మాట్లడగలరని.. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య మండిపడ్డారు. ఇక్కడి తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు తీర్పును సీఎం చంద్రబాబు, పార్టీ స్వాగతిస్తుందన్నారు. చంద్రబాబు వేసిన సిట్ ను సుప్రీం తీర్పు మరింత బలోపేతం చేసిందన్నారు. సుప్రీం తీర్పు వైసీపీకి ఆపార్టీ నేతలకు ‘భస్మాసుర హస్తమే’ అన్నారు. సీట్ అధికారులు జగన్ ఆయన టీమ్ విదేశాలకు పారిపోకుండా వెంటనే వారి పాస్ పోర్టులను స్వాధీనం చేసుకోవాలన్నారు.
టీటీడీ ఈవో విలేకరుల సమావేశంలో స్పష్టంగా యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పినా.. జగన్ రెడ్డి ఏమో యానిమల్ ఫ్యాట్ లేదని అబద్దాలు చెబుతున్నారు. జగన్ రెడ్డి అన్న కొడుక్కి.. కరుణాకర్ రెడ్డి కూతురికి పెళ్లి అయితే.. జగన్ కు భూమన మామ కాక మరేమి అవుతారు. జగన్ రెడ్డికి బంధుత్వాలు కూడా తెలియదు. పదిమందితో పదే పదే అబద్దాలు చెప్పిస్తే అది నిజం అవుతుందా? మళ్లీ దేవుడంటే చంద్రబాబుకు భయంలేదని జగన్ రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్లడానికి భయపడిన జగన్ రెడ్డి.. చంద్రబాబు గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ప్రతి బ్రహ్మోత్సవాల్లో చంద్రబాబు పాల్గొని సతీసమేతంగా స్వామివారికి నూతన వస్త్రాలు సమర్పిస్తారు. జగన్ రెడ్డి ఏనాడైనా బ్రహ్మోత్సవాలకు సతీసమేతంగా వెళ్లారా? జగన్ రెడ్డి పెద్ద అబద్దాల పుట్ట. దేవుళ్లను చంద్రబాబు రాజకీయాలకు వాడుకుంటున్నారని మాట్లాడటం కంటే నీచం ఇంకొకటి లేదు.
అసలు దేవుళ్లను రాజకీయాల్లోకి లాగిందే జగన్ రెడ్డి. పింక్ డైమండ్ దోచుకున్నారని ఆరోపణలు చేసింది.. ఆర్టీసీ బస్సు టికెట్ల మీద ఏసుక్రీస్తు బొమ్మ వేయించింది కూడా జగన్ రెడ్డే! టీటీడీ బోర్డును కలంకితం చేసింది వైసీపీ నేతలే! క్రైస్తవ మతాన్ని ఆచరించే వ్యక్తిని టీటీడీ బోర్డు చైర్మన్ గా చేసింది జగన్ రెడ్డి నువ్వు కాదా? శ్రీవాణి ట్రస్ట్ పేరుతో కోట్లను దోచుకుంది మీవారు కాదా? శ్రీ రాముడి విగ్రహం తల నరికితే. జగన్ రెడ్డి పట్టించుకోలేదు. చంద్రబాబు వెళ్లాలనుకుంటే అడ్డుకున్నారు. నాలుగు గోడల మధ్య క్రైస్తవుడిగా… బయటకి వస్తే హైందవుడిగా జగన్ రెడ్డి నటిస్తున్నారు. బొట్టు పెడితే హైందవుడు కాలేడు.. ఆ మతాలను ఆచరిస్తేనే హైందవుడైనా.. క్రైస్తవుడైనా అయ్యేది… జగన్ రెడ్డి అటుఇటుకాని వ్యక్తా ఏమైనా ?
సుప్రీంకోర్టు ఎక్కడా చంద్రబాబును తప్పు పట్టలేదు. దొంగల దోపిడీ అక్రమాలను బయట పెట్టాలనే చెప్పింది. ఏఆర్ ఫుడ్స్ కు ఆరు టన్నుల నెయ్యి మాత్రమే స్టోర్ చేసే అవకాశం ఉంది. మిగిలిన 16 టన్నులు నెయ్యిని ఎక్కడ నుండి తీసుకు వచ్చారు? బిల్లులు, ట్రాన్స్ పోర్ట్ అంతా మోసమే.. చెన్నైలో బయలుదేరి తిరుపతి రావడానికి తొమ్మిది రోజులు పడుతుందా?. చెన్నైనుండి కోల్‌కతా వెళ్లడానికి కూడా మూడు రోజులే పడుతుంది. మీ అవినీతిని బయటకు తీసుకు వచ్చి మీరు దొంగలు అని చెప్పడానికే చంద్రబాబు సిట్ వేశారు. చంద్రబాబు వేసిన సిట్ కు ఇద్దరు సీబీఐ అధికారులు, ఇద్దరు స్టేట్ అధికారులు, ఒక ఫుడ్ సేఫ్టీ అధికారిని యాడ్ చేసి సిట్ ను సుప్రీం ఇంకా బలోపేతం చేసింది. ఈ దెబ్బతో దొంగల బండారం బయట పడుతుంది. అందుకే వైసీపీ నేతలు ఉలిక్కి పడుతున్నారు.
సుప్రీంకోర్టు వేసిన సిట్ తో వైసీపీ నేతలు సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, రోజాలాంటి నేతలందరూ కొట్టేసిన వాటాలు, వారి అక్రమాలన్నీ బయటకు వస్తాయి. భస్మాసుర హస్తాన్ని వైసీపీ నేతలే తెచ్చి నెత్తిన పెట్టుకున్నారు. సుప్రీం తీర్పుతో జగన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డి, రోజారెడ్డిలు శ్రీకృష్ణ జన్మస్థానంకే ఇక. ఆషాఢభూతులు జైలు జీవితం గడపబోతున్నారు. అక్కడే పులిజూదం ఆడబోతున్నారు. రఘురామను హింసించిన రిటైర్డ్ అడిషనల్ ఎస్పీ కోసం లక్షల్లో ఫీజులు చెల్లించి అభిషేక్ మను, సిద్ధార్థ దావేలాంటి వ్యక్తులతో వాదిస్తున్నారంటే దీని వెనుక జగన్ రెడ్డి హస్తం ఉన్నట్లు కాదా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు.