Suryaa.co.in

National

ఇక‌పై వాహ‌నాల హార‌న్ శబ్దం మారబోతుందా?

న‌గ‌రాల్లో ట్రాఫిక్ స‌మ‌స్య‌లు పెరిగిపోతున్నాయి. ట్రాఫిక్ స‌మ‌యంలో వాహ‌నాల నుంచి వ‌చ్చే కాలుష్యంతో పాటుగా హార‌న్ నుంచి వ‌చ్చే శ‌బ్ధ‌కాలుష్యంకూడా పెరిగిపోతున్న‌ది. ఫ‌లితంగా అనేక అనారోగ్య‌స‌మ‌స్య‌లు త‌లెత్తుతున్నాయి. ఒక్కో వాహ‌నం ఒక్కో ర‌క‌మైన హార‌న్ శ‌బ్దంతో క‌ర్ణ‌క‌ఠోరంగా మారుతున్న‌ది. వీటిని కంట్రోల్ చేసేందుకు కేంద్ర ఉప‌రిత‌ల రావాణ శాఖ ముందుకు వ‌చ్చింది. కొత్త రూల్స్ ను తీసుకురాబోతున్న‌ది. వాహ‌నాల్లో హార‌న్ శ‌బ్దాన్ని మార్చాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. హార‌న్ శ‌బ్దాలు క‌ఠినంగా ఉండ‌కుండా హాయిగా ఉండేలా చూడాల‌ని ఇప్పిటికే ప్ర‌తిపాద‌న‌లు ఈసుకొచ్చింది. త‌బ‌లా, పియానో, ప్లూట్ వంటి వాయిద్య ప‌రిక‌రాల నుంచి వ‌చ్చే సంగీతంలా హార‌న్ ఉండేలా చూసేందుకు చ‌ర్య‌లు తీసుకుంటోంది. ఇలాంటి హార‌న్ శ‌బ్దాల నుంచి వచ్చే సంగీతం వ‌ల‌న ఎలాంటి ఇబ్బందులు త‌లెత్త‌వ‌ని కేంద్ర ఉప‌రిత‌ల శాఖ ఆలోచిస్తున్న‌ట్టు స‌మాచారం.

LEAVE A RESPONSE