– సమస్యల పరిష్కారానికి చొరవ చూపినందుకు ధన్యవాదాలు తెలియజేసిన ప్రతినిధులు
విజయవాడ: రైసు మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి భారత పూర్వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కృషి చేశారని అఖిల భారత రైస్ మిల్లర్ల సంఘం ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు వారు సోమవారం స్వర్ణ భారత్ ట్రస్ట్ విజయవాడ చాప్టర్లో వెంకయ్య నాయుడు ని కలుసుకొని ధన్యవాదాలు తెలియజేశారు. తాము ఎదుర్కొంటున్న సమస్యలను గతంలో వెంకయ్య నాయుడు కి తెలియజేయగా వారు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లడంతో పరిష్కారమయ్యాయని సంతోషం వ్యక్తం చేశారు. సోమవారం వెంకయ్య నాయుడు ని కలిసి ఆయనను సత్కరించారు.