– ఎంపీ విజయసాయి రెడ్డి
విశాఖపట్నం: టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిపై ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అయ్యన్నపాత్రుడు తాగుబోతు అని… ఆయన భూమికి భారంగా మారాడని అన్నారు. తెల్లవారి లెగిస్తే, ఏం పని లేక విమర్శలు చేయడం తప్పితే, ఆ ప్రాంతానికి గాని రాష్ట్రానికి గాని ఎలాంటి ఉపయోగం లేదన్నారు. ఆయన కుమారులు నిరుద్యోగులు గానే ఉన్నారని.. వస్తే వారికి కూడా ఉపాధి కల్పిస్తామని వ్యాఖ్యానించారు.
జాతీయ రాజకీయాలపై, రాష్ట్రానికి ఎవరు ప్రయోజనం చేకూర్చే వారితోనే తాము వెళ్తామని.. అది ఎప్పుడో తీసుకున్న నిర్ణయం అలాగే ముందుకు వెళ్తామని ఎంపీ స్పష్టం చేశారు. ఆ నిర్ణయంపై ఎలాంటి మార్పు ఉండదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం నాలుగు నుంచి ఐదు లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు.
పబ్లిక్, ప్రైవేట్ రంగంలో కలిపి ఉపాధి కల్పించామని తెలిపారు. నైతిక విలువలు పడిపోతున్నాయని రోజుల్లో.. నైతిక విలువలు విద్యార్థులు పాటించాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. మన పూర్వికులు, విలువలను మనం పాటించాల్సిన అవసరం ఉందని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.