Suryaa.co.in

Andhra Pradesh

అమ్మ ఒడి పథకం దండగని రాళ్లు వేసిన వ్యక్తి లోకేష్

ఎంపి విజయసాయిరెడ్డి

యువగళమా లేక స్కూలు పిల్లల్లో బానిస భావాలు పెంచే దరిద్రపు కార్యక్రమమా లోకేశ్ అంటూ రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.శనివారం సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక ప్రకటనను విడుదల చేశారు.. వైఎస్ఆర్ సిపి ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన అమ్మ ఒడి పథకం దండగ అని రాళ్లు విసిరిన వ్యక్తి లోకేశ్ అని మండిపడ్డారు. పిల్లల చదువుల గురించి కొంచెం అయినా బాధ్యత ఉందా అని ప్రశ్నించారు. లోకేశ్ పాదయాత్రలో బడి పల్లలు చేత పాదాభివందనం చెయించుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు. వాళ్లు తొడుక్కున్న యూనిఫాం నువ్వు ఇచ్చింది కాదని లోకేశ్ ని ఉద్దేశిస్తూ అన్నారు. పసిపిల్లలతో పాదాలకు నమస్కారాలు పెట్టించుకోవడం అమానవీయం కాదా అని లోకేశ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు..

ప్రభుత్వ బడుల్లో విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్
ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు అంతర్జాతీయంగా రాణించేందుకు అవసరమైన తర్ఫీదు స్కూళ్ల స్థాయి నుంచే అందించాలని విద్యాశాఖపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారని అన్నారు.. అందుకు అనుగుణంగా అన్ని చర్యలు చేపట్టాలని, ముఖ్యంగా విద్యార్థులకు ఫ్యూచర్ స్కిల్స్ నేర్పించాలని ఆదేశించారని అన్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో ఇంటర్నేషనల్ బాకలారియెట్(ఐబి) సిలబస్ అమలుకు సన్నద్ధం కావాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో దీన్ని నిర్వహించాలని నిర్ధేశం చేశారన్నారు.‌

LEAVE A RESPONSE