-చంద్రబాబు పార్టీ ఇక జనం నుంచి జూంలోకే
– బెస్ట్ పెర్మార్మింగ్ స్టేట్ గా ఏపి, వరుసగా రెండోసారి ఘనత
-ప్రభుత్వాసుపత్రుల్లో క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ సేవలు
-మహిళా సాధికారత సాధనలో నెంబర్ 1 స్థానంలో ఏపి
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి
ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని, మళ్ళీ తాను ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని ప్రగల్బాలు పలుకుతున్న చంద్రబాబు పంచాయతీ ఎన్నికలలో అభ్యర్దులు కూడా దొరక్క నానా అగచాట్లు పడ్డ వాస్తవం అప్పుడే మరచిపోవడం విడ్డూరంగా ఉందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు.
గెలుపెవరిదో దేవుడెరుగు ముందస్తు ఎన్నికలే వస్తే ప్రతిపక్ష హోదా కూడా గల్లంతవుతుందని గ్రహించలేకపోవడం శోచనీయమని అన్నారు. పగటికలలు కనడం మాని వాస్తవంలో జీవించడం నేర్చుకోవాలని సూచించారు.
సీఎం జగన్ సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం 2021 సంవత్సరానికి గానూ స్కోచ్ గ్రూప్ వెల్లడించిన గవర్నెన్స్ రిపోర్ట్ కార్డ్ లో మొదటి ర్యాంకు సాధించిందని, ఈ ఘనత సాధించడం వరుసగా ఇది రెండోసారి కావడం ముఖ్యమంత్రి పనితీరుకు అద్దంపడుతోందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు.
గురువారం ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. వ్యవసాయం, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పవర్ & ఎనర్జీ, సామాజిక న్యాయం, నీటి సదుపాయం కల్పన వంటి అంశాలు ప్రామాణికంగా ఎంపిక చేయడం జరిగిందని అన్నారు.
రాష్ట్రంలోని క్యాన్సర్ బాధితులకు అత్యుత్తమ వైద్య సేవలందించేలా ప్రభుత్వాస్పత్రులను సన్నద్దం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంబించిందని. ప్రస్తుతం ఉన్న బోధనాస్పత్రుల్లోని క్యాన్సర్ విభాగాలతోపాటు కొత్తగా ఏర్పాటుచేసే క్యాన్సర్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల అభివృద్ధిపై ప్రణాళికలు రూపొందిస్తోందని అన్నారు.
మహిళల సాధికారతలో ఏపి దేశంలోనే నెంబర్ 1 గా నిలిచిందని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సామాజిక, రాజకీయ, ఆర్దిక అంశాల్లో ఆడపడుచులకు అండగా నిలుస్తోందని అన్నారు. గడిచిన 34 నెలల్లో మహిళలకు రూ1.18 లక్షల కోట్లమేర ప్రయోజనం కల్పించిందని అన్నారు. నామినేటెడ్ పనుల్లో, నామినేటెడ్ పదువుల్లో మహిళలకు 50 శాతానికిపైగా కేటాయించిందని అన్నారు.
ఎన్ని కుతంత్రాలు చేసినా జగన్ కూల్ గా కనిపించడం చంద్రబాబుని మానసిక అయోమయంలోకి నెట్టిందని. తన దొంగ దెబ్బలకు సీఎం కుంగిపోకుండా ఎప్పటిలాగే ఉల్లాసంగా కనిపించడం తట్టుకోలేక పోతున్నారని అన్నారు. ఉక్రెయిన్లో చిక్కిన విద్యార్థులకు అభినందనలు చెప్పడం దీని లక్షణమేనని అన్నారు.
ఉక్రెయిన్ విద్యార్థులకు జూమ్ లో చంద్రబాబు దారి చూపారట! గూగుల్ మ్యాప్స్ లో బాంబ్స్ లెక్కించారట! చైనా, ఇండియన్ అర్మీస్ కన్నా సిబిఎన్ ఆర్మీ పెద్దదట! టీడీపీ వెకిలి ప్రచారం చూసి జనం నవ్వుకుంటున్నారని. ఇక చంద్రబాబు పార్టీ ఉండేది జనంలో కాదు, జూమ్ లోనేనని ఎద్దేవా చేశారు.
అండమాన్ దీవుల్లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు (2 వార్డులు) గెలిచినందుకు టీడీపీ విజయోత్సవం జరుపుకుంటోందని. ఆంధ్రాలో ఇక ‘పార్టీలేదని నిర్ధారించుకున్న అచ్చెన్న త్వరలో అండమాన్ టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు రెడీ అవుతున్నారని అన్నారు.