– సోమిరెడ్డి వ్యంగ్యాస్త్రం
మంగళగిరి: ‘‘ ఏందయ్యా విజయసాయిరెడ్డా… ఉత్త ఎంపీ అయితేనే మీరు, మీ వియ్యంకుడు సగం రాష్ట్రాన్ని దోచేశారు. ఇక కేంద్రమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఇంకేం మిగులుద్ది? అయినా, ఇంకా వైసీపీ బతికి బట్టకడుతుందని మీకు ఆశ ఉందా? మొన్న కన్నతల్లే జగన్ రెడ్డి బతుకు బయటపెట్టిన తర్వాత కూడా ఇంకా ఎక్కడుందయ్యా మీ పార్టీ ’’ అంటూ ఎమ్మెల్యే, మాజీమంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ని ఎద్దేవా చేశారు.
అధికారంలో ఉన్నది అన్న కాదు. శకుని. జగన్ మళ్లీ అధికారంలోకి వచ్చి, నేను కేంద్రమంత్రి అయితే కార్మికులకు కూడా సంస్థ లాభాల్లో వాటా ఇస్తానంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దానిపై సోమిరెడ్డి ఎక్స్ వేదికగా విజయసాయిపై వ్యంగ్యాస్త్రం సంధించారు.