-ఫేక్ సర్వేలతో పచ్చ మీడియా అడ్డంగా దొరికింది
-నవరత్నాలతో ప్రజలు సంతృప్తి-నీతీ అయోగ్ ప్రశంసలు
-ట్విట్టర్ లో చంద్రబాబు,పచ్చమీడియాపై మండిపడ్డ ఎంపి విజయసాయిరెడ్డి
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రజాదరణ చూసి ప్రతిపక్ష నేత చంద్రబాబు, పచ్చ కుల మీడియా వెన్నులో వణుకు పుట్టి ఢిల్లీలో టీడీపీ జీతగాళ్లతో ఫేక్ సర్వేలు చేపించి జనం మీదకు వదులుతున్నారని రాజ్యసభ సభ్యులు,వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి తెలిపారు. ఫేక్ సర్వే వదిలి పచ్చ మీడియా అడ్డంగా దోరికిపోయిందని చెప్పారు. గురువారం ట్విట్టర్ వేదికగా టిడిపి,పచ్చ మీడియా తీరుపై మండ్డిపడ్డారు. పాతాళానికి చేరిన చంద్రబాబు గ్రాఫ్ పెంచలేకే ఫేక్ సర్వేలు మొదలెట్టారని చెప్పారు. మహారాష్ట్రలో దించేసిన సీఎంకి మూడో స్థానమిచ్చినప్పుడే ఈ సర్వే స్థాయేంటో అర్ధమైందనన్నారు.
అధికారంలో ఉన్నపుడు తుప్పు నాయుడు చంద్రబాబు పిఎం, పప్పు నాయుడు లోకేశ్ సిఎం అంటూ పచ్చ మీడియా కలరింగ్ ఇచ్చిందని గుర్తు చేశారు. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు అప్రూవల్ రేటింగ్ 80% అంటూ ఊదరగొడితే 23 సీట్లకు పడ్డాయాని వెల్లడించారు. ఇప్పుడు చంద్రబాబును జాకీలేసి లేపడానికి అప్రూవల్ రేటింగ్స్ అని మొదలెట్టారన్న ఆయన ఈసారి తెలుగుదేశం పార్టీకి సింగిల్ డిజిట్ కూడా డౌటేనని అన్నారు.
నవరత్నాలపై రాష్ట్రంలోని ప్రజలు సంతృప్తిగా ఉన్నారని నీతి ఆయోగ్ ప్రశంసించిదని అన్నారు. గ్రామ, వార్డ్ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ద్వారా గడప గడపకు పౌరసేవలు అందుతున్నాయని నీతి ఆయోగ్ వెల్లడించిదని అన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై విపక్ష నేతలకు కడుపుమంటతో రగిలిపోతున్నారని చెప్పారు. రాష్ట్రంలోని ప్రజలు నవరత్నాలపై సంతృప్తితో ఉండడంతో పచ్చ మిడియా,విపక్ష నేతలకు నవరంధ్రాలు మూతపడ్డట్టేనని అన్నారు.
ప్రజలు చంద్రబాబు శని వదిలించుకున్నారు గానీ…ఈ వరదల టైములో ఉంటే రాజమండ్రి పుష్కర ఘాట్ వద్ద తిష్టవేసి గంటగంటకు వాటర్ లెవల్ కొలిచేవాడని ఎద్దేశా చేశారు. వరదలను కంట్రోల్ చేసినట్టు ఎల్లోమీడియాలో బిల్డప్పులుండేవన్నారు. అధికారులను పని చేసుకోనివ్వకుండా మందలింపులు, ఫ్లడ్ మాన్యువల్ చదవాలని హెచ్చరిస్తూ ఉండేవాడని గుర్తు చేశారు.
చంద్రబాబు ఏం చేసినా పచ్చ కుల మీడియాకు అది చాణక్యముగానే కనిపిస్తుందని చెప్పారు. ఢిల్లీలో ఎందరి కాళ్లు పట్టుకున్నదీ, ఎంత లాబీయింగ్ చేసిందీ అందరికీ తెలుసునని అన్నారు. పొర్లుదండాలు పెట్టి ప్రాధేయపడ్డాడు కాబట్టే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ది ద్రౌపది ముర్ము మర్యాద పాటించారని చెప్పారు. కొన్నాళ్ల తర్వాత ఆమె పేరు ప్రతిపాదించింది నేనే అని కథలు మొదలెడతాడని ఎద్దేవా చేశారు.
ఎపిలో తేడా వస్తే సింగపూర్ పారిపోవడానికి చాన్నాళ్ల క్రితమే చంద్రబాబు స్కెచ్ వేసి అక్కడ ఓ హోటల్ కొనుక్కున్నాడని అన్నారు. ఒక ప్రైవేట్ జెట్ రెడీగా పెట్టుకున్నాడని వెల్లడించారు. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయిలా 2024 తర్వాత ఈ ‘గొట్టం చంద్రబాబు’కీ అదే పరిస్థితి వస్తుందన్న ఆయన ఇద్దరిదీ చివరి మజిలీ సింగపూరేనని చెప్పారు.
తెలుగుదేశం ‘జాతీయ పార్టీ’ అని అధికారిక పార్టీ వెబ్ సైట్ లో పెట్టుకోవడానికి సిగ్గులేదా చంద్రబాబూ? అని ప్రశ్నించారు.టిడిపి ‘జాతి’ పార్టీ అని మార్చుకో లేదా తెలుగు డ్రామా పార్టీ అని పెట్టుకో, ఎక్స్ ట్రాలు మానుకో…ఇప్పటికైనా ఉప ప్రాంతీయ పార్టీ అని నిజం ఒప్పుకోవాలని చంద్రబాబుకి హితపు పలికారు.