Suryaa.co.in

Andhra Pradesh

వైసీపీ పరిపాలనలో హీనస్థితికి చేరిన పల్లెలు

– అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

మోపిదేవి: వైసీపీ పరిపాలనలో హీనస్థితికి చేరిన పల్లెలకు కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పండుగ కళ వచ్చిందని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు. గురువారం మోపిదేవి మండలంలో పల్లె పండుగ – పంచాయతీ వారోత్సవాలు పురస్కరించుకొని మోపిదేవి మండలంలో రూ.ఐదు కోట్ల 63 లక్షల 20 వేలతో 8,899 మీటర్ల పొడవైన 86 సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ శ్రీకారం చుట్టారు.

మోపిదేవి గ్రామంలో రూ.కోటి 19లక్షలతో పన్నెండు సీసీ రోడ్లు, పెద్దప్రోలు గ్రామంలో రూ.35.10లక్షలతో పన్నెండు సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా పెద్దప్రోలు సభలో ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో స్థానిక సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా వెనక్కి తీసుకుందని, కరెంట్ బిల్లులు కూడా చెల్లించకుండా పంచాయతీలను అప్పల పాలు చేసిందని తెలిపారు.

LEAVE A RESPONSE