– రూ.3000 కోట్లతో విశాఖ-భోగాపురం బీచ్ కారిడార్
– ఉపాధి పనుల్లో ఏపి టాప్
– గ్రామ సచివాలయలలో పాస్ పోర్టు సేవలు
-శరవేగంగా సాగుతున్న జగనన్న కాలనీ ఇల్ల నిర్మాణ పనులు
– ట్విట్టర్ వేదికగా ఎంపీ విజయసాయి రెడ్డి
విశాఖపట్నం నుంచి భీమిలి మీదుగా భోగాపురం వరకు ఆరు లేన్ల బీచ్ కారిడార్, విశాఖపట్నం పోర్ట్ టెర్మినల్ నుంచి నాలుగు లేన్ల జాతీయ రహదారి. దాదాపు రూ.3 వేల కోట్లతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టనున్న ఈ ప్రాజెక్టుతో పర్యాటక, పారిశ్రామిక అభివృద్ధికి రాచబాట కాబోతుందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ట్విట్టర్ వేదికగా పలు అంశాలు వెల్లడించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు రూ.2000 కోట్లతో ఎన్ హెచ్ ఏ ఐ ప్రణాళిక రూపొందించిందని, బీచ్ కారిడార్ భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 1000 కోట్లు వెచ్చించనుందని పేర్కొన్నారు.
ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో పేదలకు పనులు కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది కూడా ఇప్పటివరకు దేశంలో ప్రథమ స్థానంలో ఉందని. మధ్యప్రదేశ్, తెలంగాణ, బీహార్ తరువాత స్థానాల్లో నిలిచాయని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి నెల రోజుల్లోనే రాష్ట్రంలో వేతనదారులకు 2,84,03,576 పనిదినాలు కల్పించిందని తెలిపారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు కలిపి 17 కోట్ల పనిదినాలు కల్పించాయని, ఆంధ్రప్రదేశ్ 2.84 కోట్ల పనిదినాలు కల్పించి అగ్రస్థానంలో కొనసాగుతుందని, మధ్యప్రదేశ్ 2.06 కోట్ల పనిదినాలు, తెలంగాణ 1.65 కోట్ల పనిదినాలు, బీహార్ 1.48 కోట్ల పనిదినాలతో తరువాత స్థానాలలో నిలిచాయని అన్నారు.
గ్రామ సచివాలయాల సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని. పాస్ పోర్టు సేవలతో పాటు మరికొన్ని ప్రభుత్వ సేవలు కూడా గ్రామ సచివాలయాల్లోనే పొందే అవకాశం కల్పించిందని అన్నారు. జూన్ నుంచి 2,500 సచివాలయాలలో ఆధార్ సర్వీసులు ప్రారంభం కానున్నాయని. సచివాలయ సిబ్బంది ద్వారా అన్ని పాఠశాలల్లో ఆధార్ క్యాంపులు నిర్వహించడం జరుగుతుందని అన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ జగనన్న కాలనీల్లో తొలిదశ ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయని, ‘నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 31 లక్షల మందికిపైగా పేదలకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పక్కా గృహాలను నిర్మిస్తోందని పేర్కొన్నారు. తొలిదశలో 15.60 లక్షల ఇల్లు నిర్మాణం జరుగుతుందని,లబ్దిదారులకు ఉచితంగా ఇసుక, రాయితీపై స్టీల్, 140 బస్తాల సిమెంట్ పావలా వడ్డీకే బ్యాంకు రుణాలు అందించడంతో పాటు, సామగ్రి తరలింపు భారం పడకుండా లే అవుట్లలోనే గోడౌన్ల నిర్మాణం చేపట్టిందని అన్నారు.