ఎంపీ విజయసాయిరెడ్డి
అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గుర్తింపు పొందిన విశాఖ నగరం ఇప్పుడు ఐటీ పరిశ్రమలకు ప్రధాన కేంద్రంగా మారుతోందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి అన్నారు. సోషల్ మీడియా వేదికగా శుక్రవారం పలు అంశాలు వెల్లడించారు. ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ విప్రో విశాఖలో కార్యకలాపాలను విస్తరిస్తోందని అన్నారు. ఈ మేరకు ప్రాజెక్ట్ లావెండర్ పేరుతో సంస్థ అధికారికంగా ప్రకటించిందని అన్నారు.
డేటా సెంటర్ గా అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేస్తోందని 1000 సీట్లతో విస్తరించాలని నిర్ణయించిందని అన్నారు.ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలమైనట్లు తెలిపారు.సంస్థ విశాఖ బ్రాంచ్ వీడీఐ, క్లౌడ్ ప్రాజెక్టుల కేంద్రంగా కొనసాగుతోందని అన్నారు. ఇటీవల ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతులు మీదుగా ప్రారంభోత్సవం చేసిన సంగతి విధితమే. దిగ్గజ సంస్థల రాకతో విశాఖకు అనేక ఐటీ కంపెనీలు క్యు కడుతున్నాయని అన్నారు.
పేదల ఖాతాల్లో రూ. 2.38 లక్షల కోట్లు
గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తరువాత నేరుగా పేదల ఖాతాల్లోకి రూ.2.38 లక్షల కోట్లు జమచేసిందని అన్నారు.పారదర్శకతే ప్రామాణికంగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా నాలుగేళ్లలో అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నగదు జమచేసిన ఘనత సీఎం జగన్ దేనని విజయసాయిరెడ్డి అన్నారు.