Suryaa.co.in

Andhra Pradesh

మతి తప్పిన మాటలు, గతి తప్పిన లక్ష్యంతో సీపీఐ నేత నారాయణ

– భాజపా ఆంధ్రప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి

విజయవాడ: కేంద్ర హోంమంత్రి అమిత్ షాని క్రిమినల్ అని సంబోధిస్తూ సీపీఐ నారాయణ చేసిన దిగజారుడు వాఖ్యలను ఏపీ బీజేపీ తీవ్రంగా ఖండిస్తున్నది .జూనియర్ ఎన్టీఆర్ అమిత్ షా కలయికను కోట్లమంది యువత వారి అభిమానులు స్వాగతించారు. ప్రజల్లో వచ్చిన స్పందన చూసి కమ్యూనిస్టులకు గుబులు పుట్టి ఈరోజు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటు.

కేసులు ఉన్న వాళ్ళందరూ క్రిమినల్స్ అయితే ప్రజా ఉద్యమాలలోమీపై తెలుగు రాష్ట్రాలలో అనేక కేసులు ఉన్నాయి, మరి మీరు ఈ క్రమంలో మీరు అతి పెద్ద క్రిమినల్ అని ఓప్పుకుంటారా ? అలా క్రిమినల్ భాష మాట్లాడటానికి నారాయణ స్థాయికి తగదని గుర్తుచేస్తున్నాం. గతంలో కమ్యూనిస్టులు రాజ్యమేలిన రాష్ట్రాలలో, నాడు బెంగాల్, ప్రస్తుతం అధికారంలో ఉన్న కేరళలో ఎంతమంది హిందువులను, స్వయం సేవకులను, బిజెపి కార్యకర్తలను క్రూరంగా హత్యలు చేసి చంపారో దేశం మొత్తం చూసింది.

అందుకనే దేశ ప్రజలు మీకు ఎక్కడా స్థానం లేకుండా చేశారు. అయినా కూడా మీ పద్ధతులు మార్చుకోకుండా, ప్రజల అభిప్రాయాలను అర్థం చేసుకోకుండా నేడు అనైతిక పొత్తు రాజకీయాలతో ఏ పార్టీనైతే తిడతారో అదే పార్టీతో రాజకీయ సంబంధాలు పెట్టుకుని ఇలా మీడియా ముందుకు వచ్చి మాటలు మాట్లాడుతూ ఉంటారు.

నిన్నటి దాకా తెలంగాణలో కేసిఆర్ ను తిట్టి నేడు అదే పార్టీతో మునుగోడులో మేము మద్దతు ఇస్తున్నాం అని ప్రకటించారు.నిత్యం మీడియాల్లో సంచలనం కోసం ఇలాంటి మాటలతో మెన్న చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ నేడు అమిత్ షా వంటి వారిపై ఇలాంటి భాషను ఉపయోగించి మాటలు మాట్లాడటం మీ వయసుకు తగినది కాదని దయచేసి ప్రతిపక్ష పార్టీలను, వారి నాయకులను విమర్శించే పద్ధతిని మార్చుకోవాలని సీపీఐ నారాయణకి హితవు పలికారు.

ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలు చేసే హక్కు ఎవరికైనా ఉంటుంది, ఉద్దేశపూర్వకంగా ప్రచారం కోసం నోటికొచ్చినట్లు మాట్లాడటాన్ని ప్రజలు హర్షించరు అనే విషయం నారాయణ గుర్తు పెట్టుకుంటే మంచిదని తెలియజేస్తున్నాం.

LEAVE A RESPONSE