– బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేంద్ర
గుంటూరు ,సూర్య: గుంటూరు జిల్లా బిజెపి నాయకులు విశ్వకర్మ యోజన పథకానికి సంబంధించి ఎంఎస్‌ఎంఇ ఆఫీసులో జిల్లా ఆఫీసర్ వెంకట్రావు, డిప్యూటీ డైరెక్టర్ సుధాకర్ని కలిసి జిల్లాలో జరుగుతున్న కొన్ని వాస్తవాలు తెలిపారు.
జిల్లా అధ్యక్షుడు వనమా నరేంద్ర కుమార్ తో మాట్లాడుతూ జిల్లాలో ఈ విశ్వకర్మ యోజన పథకాన్ని ఆసరాగా తీసుకొని సీఎస్‌సీ సెంటర్సు ఒక్కొక్క అప్లికేషన్స్ కి 300 రూపాయల దాకా తీసుకుంటున్నారని, అలాగే మోడీ కుట్టుమిషన్లు ఇస్తారు అని చెప్పి చాలామంది మహిళల దగ్గర అప్లికేషన్ కోసం డబ్బులు తీసుకుంటున్నారని, అలాగే కింద స్థాయి అధికారులు, సచివాలయం సిబ్బంది ఈ పథకం మీకు కన్ఫర్మ్ అయింది అని చెప్పి ఇది మీకు రావాలి అంటే క్యాస్ట్, ఇన్కమ్, లేబర్ లైసెన్సు సర్టిఫికేటు అడుగుతున్నారని కొంతమంది లబ్ధిదారులు మా దృష్టికి వచ్చిందని ఆగ్రహించారు.
ఈ విషయాలపై స్పందించాలని కోరారు. జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ఈ పథకం అయిదేళ్ళ వరకు ఉంటుందని, కొంత మంది అధికారులు పలానా రోజు ఆఖరు తేదీ అని మాయ మాటలు చెబుతున్నారన్నారు. ప్రజలందరూ దళారుల మాటలు నమ్మవద్దని అన్నారు. వెంటనే వారు పైన చెప్పిన విషయాలపై కింద స్థాయి అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
అధికారులని కలిసిన వారిలో రాష్ట్ర వివర్ సెల్ కన్వీనర్ జగ్గారపు శ్రీనివాసరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చరక కుమార్ గౌడ్, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు తుళ్ళిమిళ్ళి రామకృష్ణ, ఆవుల రామ కోటేశ్వరరావు ,మోతే శేషగిరి కామేపల్లి వెంకటేశ్వర్లు , కన్నా రవి దేవరాజు, వీరేంద్ర కుమార్ ఉన్నారు.