– ఏపీ ఐటీ ప్రస్థానంలో సరికొత్త అధ్యాయం!
విశాఖ తీరంలో ఐటీ అలలు ఎగిసిపడుతున్నాయి. ఐటీ మంత్రి నారా లోకేష్ మరియు క్యాప్ జెమినీ సీఈవో ఐమాన్ ఇజ్జత్ మధ్య జరిగిన భేటీ కేవలం చర్చలకు పరిమితం కాలేదు; అది రాబోయే 20 వేల ఐటీ ఉద్యోగాల ఉపాధి గనికి పునాది. ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్వేర్ రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో, క్యాప్ జెమినీ వంటి దిగ్గజ సంస్థ విశాఖ వైపు చూడటం నిజంగా ఒక ‘బిగ్ అచీవ్మెంట్’.
ఇది ఎందుకు ఇంత పెద్ద విషయం?
క్యాప్ జెమినీ అంటే సాదాసీదా కంపెనీ కాదు. 23.9 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 2 లక్షల కోట్లు) వార్షికాదాయం కలిగిన ఈ ఫ్రెంచ్ సంస్థ, ఐటీ రంగంలో ప్రపంచంలోనే టాప్ ప్లేయర్స్ లో ఒకటి.
భారత్లోనే 2 లక్షల మంది ఉద్యోగులున్న ఈ సంస్థ, విశాఖలో అడుగుపెడితే అది వేల కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది.
కేవలం కోడింగ్ మాత్రమే కాదు, డాటా సెంటర్, జీసీసీ, ఏఐ ల్యాబ్స్’ వంటి అత్యాధునిక సాంకేతికతను విశాఖకు తేవాలని లోకేష్ చేసిన ప్రతిపాదన నగర రూపురేఖలనే మార్చబోతోంది.
రాబోయే రోజుల్లో విశాఖపట్నం ఒక ‘గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (GCC)’ గా అవతరించబోతోంది. ఇప్పటికే దేశంలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ రాబోతుండటం, టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి సంస్థలు ల్యాండ్ అవ్వడం విశాఖను ఐటీ హబ్ గా మార్చాయి. వీటికి తోడు భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తే, అంతర్జాతీయ పెట్టుబడులకు వైజాగ్ ‘రెడ్ కార్పెట్’ పరిచినట్టే!
ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో హైరింగ్ తగ్గుతున్నా, ఫైరింగ్ పెరుగుతున్నా.. ఏపీ ప్రభుత్వం దూకుడుగా వెళ్తూ ఇన్ని సంస్థలను ఆకర్షించడం సామాన్యుల ఊహకు అందని విషయం. ఇది కేవలం భవనాల నిర్మాణం కాదు, ఏపీ యువత భవిష్యత్తును నిర్మించే ప్రణాళిక. సిలికాన్ వ్యాలీ తరహాలో వైజాగ్ ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
లోకేష్ విజన్, చంద్రబాబు అనుభవం తోడైతే విశాఖపట్నం తూర్పు తీరంలో భారత్ కే గర్వకారణమైన ఐటీ రాజధానిగా నిలుస్తుంది. క్యాప్ జెమినీ రాకతో విశాఖ ప్రస్థానం ‘లోకల్’ నుంచి ‘గ్లోబల్’ స్థాయికి చేరింది!