“ఎన్నికల ప్రక్రియ ప్రజాస్వామ్యం పై మాకు అపార నమ్మకం,గౌరవం ,ఆరాధనా భావం ఉన్నాయి సార్.!”
“మా ఊరి సర్పంచ్ పదవి ని ఎవరో ..అలా..ఎలా వేలం పాట లో సొంతం చేసుకుంటారు”.
“ఇలా ఐతే ఇక శక్తివంతమైన ఓటు హక్కు మాకు ఎందుకు ఉన్నట్టు.”
“ఎవరో కొందరు/ఒకరు మా ఊరి సర్పంచ్ పదవి ని వేలం పాట లో ఏదో కొనుక్కున్నట్టు ..మా ఊరి జనం అంతా అమ్ముడు పోయినట్టు ఓ గౌరవ పదవి కి ఇష్టం వచ్చినట్టు వేలం పాడితే,.ఎంతమేరకు అది సబబు”.
“ప్రజాస్వామ్యం లో ఈ పద్దతి సమంజసమేనా?!” అంటూ..ధర్మాసనానికి ప్రశ్నలు సంధించింది.
ఏ..ఉద్దండ న్యాయవాది కాదు. రాజకీయ నాయకులు అంతకన్నా కాదు.
ఓ గ్రామానికి చెందిన యువకులు, తమ గ్రామ సర్పంచ్ పదవి డబ్బు కు వేలం పాట లో..ఎవరో హస్త గతం చేసుకోవడం చూడలేక.. “మా ఓటు హక్కు మాకు కావాలి” అని ధర్మ యుద్ధం చెసే/చేసి ధైర్యం చేశారు.
“వాట్?! ఈస్ దిస్ హ్యాపెనింగ్ సార్”. “ప్లీజ్ సేవ్ ఔర్ రైట్ ఆఫ్ ఓట్” అంటూ.. ఆర్తి గా.. తమ ఓటు హక్కు కోసం. అడిగారు.మేం..ఓటు వేస్తాం.మా ఓటు కు స్వేచ్ఛ ప్రసాదించరా.. యువరానర్.! అని ప్రార్థించారు.తత్ఫలితంగా ఎక్కడైతే వేలం పాట ద్వారా సర్పంచ్ పదవి ని గద్ద లా ఎగరేసుకుపోదాం అని అనుకున్న వారి ఆశలపై..
ఆ..వేలం పాట చెల్లదు.సర్పంచ్ పదవి కి ఎన్నికలు జరిపి తీరాల్సిందే అని ధర్మాసనం కుండ బద్దలు కొట్టినట్టు చెప్పింది.
ఇలా..ఓటు, ఎన్నికలు,ప్రజాస్వామ్యం అనే “శక్తి” వంతమైన ప్రక్రియ ను ఎవరో కొందరు ప్రహసనం చేసే ప్రయత్నం చేయగా..యువత నమ్మకాన్ని వమ్ము చేయకుండా..
ఓటు నిజంగా..”ఔటు” రా బాబు అని పెద్ద పెద్ద గద్దల దిమ్మ తిరిగి పోయేలా..న్యాయం,ధర్మం మేం ఉన్నాం..ఓటు కు ఎన్నిక తో పట్టం కడతాం అని యువత తో పాటు సమాజం లో ని కొందరి ఆశ లకు బలం చేకూర్చాయి. నిర్భయం గా నిర్మొహమాటంగా నిస్సంకోచంగా ఓటు వేద్దాం అని వేచి చూస్తున్న వారికి గుండె నిండా భరోసా ను ఇచ్చింది ధర్మాసనం.ఇది కొందరికి కనువిప్పు ఐతే కొందరికి తగిన “బుద్ధి జ్ఞానం” ప్రసాదించింది.
ఓటు ఓ వజ్రాయుధం, ఔటు ఐనా.. పేలదేమో? కానీ ఓటు మాత్రం ప్రభంజనాన్ని మించిన ప్రకంపనలు సృష్టిస్తుందని పలు సందర్భాలలో రుజువైంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ప్రవాస ఆంధ్రులు, భారతీయులు ఎక్కడెక్కడి నుండో ఢీల్లికి వచ్చి ఆనక హైదరాబాద్ చెరుకుని తమ తమ స్వగ్రామానికి వస్తున్నారు.ఊరికి వస్తున్నాం అనే ఆనందం కంటే..మన గ్రామాభివృద్ధి కోసం ఓటు వేయడానికి వస్తున్నాం అనే మధురానుభూతి ఉంది.
ఎప్పుడో ఏళ్ళ కిందట సర్పంచ్ ఎన్నిక కోసం వేసిన ఓటు మళ్ళీ ఇన్నాళ్లకు.ఆ అవకాశం, ఆ అద్వి”తీయ” అవకాశం. ఖండాంతరాల్లో ఉన్నా ఊరి కోసం ఓటు వేద్దాం అని వివ్చస్తున్న వారే అధికం.
ఊళ్ళో ఉన్న తమ ఓటు హక్కుకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో చూసి ఊరు మురిసి పోవాలి. ఆప్తులు, ఆత్మీయులకు దూరంగా ఉండి, ఆయా పరిస్థితులవల్ల రాలేని ఎన్ఆర్ఐ లు కూడా ఓటు కోసం ఊరి బాట పట్టడం ఓ పండగ లాంటి పరిణామం అనే కన్నా.. ఓ అధ్బుత చైతన్యమో అనవచ్చు.
ప్రవాసాంధ్రులు- నాన్ రెసిడెంట్ ఇండియన్ లు వారంతట వారే.. “ఓటు వేసొద్దాం” అని వస్తున్నారా?! ఇతరుల ఆహ్వానంపై స్వదేశానికి,స్వగ్రామానికి వస్తున్నారా .. అన్న విషయం పక్కన పెడితే.. మనం ఓటు వేయాలి. చూపుడు వేలిపై సిరా గుర్తుతో ఓటరుగా నా జన్మ ధన్యం అవ్వాలి అని ఒకింత సంతోషంతో “ఓటేద్దాం పదా..” అని పోలింగ్ తేదీ కంటే ముందే సొంత గడ్డకు చేరుకుంటున్న చరిత్రను సొంతం చేసుకుంటుంది “ఓటు.”
ఇంత చైతన్యమా..
ఏంటి ఈ పరిణామం?
అని ఊరు విస్తు పోయేలా..
ఆయా రాజకీయ పార్టీలు బిత్తర పోయేలా ..
మేరా ఓట్ .. మేరా హక్
అని తమ చైతన్యo రాజకీయానికి అర్థం అయ్యేలా.. చేస్తున్నారు.. ఓటరు
ఎవరు ఇన్, ఎవరు ఔట్.. అనే తీర్పును వెలువరించే ఓటరు చుట్టూ ప్రదక్షిణలు చేసేలా వంగి వంగి ఓటరుకు దణ్ణం పెట్టేలా చేస్తోంది ఓటు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అత్యంత శక్తి వంతులు అని నిర్వచించేది “ఓటు.”
ఓటును అత్యంత శక్తి వంతమైన గొప్ప ఆయుధంగా.. మార్చుకొనీ, మలచుకునే మార్పు అవసరం అనుకున్నపుడు విజ్ఞతతో, వివేకంతో.. ఆలోచించి ఓటు వేస్తున్నారు.
భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం కలగలిసినా ఓటరుగా మాత్రం ఒక్కటవుతున్నారు. తెలివి, ప్రజ్ఞ , వివేకం,చైతన్యం, ఆలోచనా శక్తి, “విశ్లేషణాసక్తి” వంటి అస్త్రాలతో ఓటరు విశ్వ రూపం ప్రదర్శిస్తున్నారు.
పోటీలో ఉన్న అభ్యర్థులు పాహిమాం.. పాహిమాం మహాప్రభో..
కరుణించు స్వామి అని అంటూ ఓటరుని వేసుకుంటున్న విషయం ప్రతి ఊళ్ళో గత కొన్ని రోజులుగా విద్యమౌతూనే..ఉంది. అంటే ఓటు ఎంత శక్తివంతమో వేరుగా చెప్పనక్కరలేదు.అంటే ఓటరు ఎంతో తెలివిగా ఆలోచిస్తూ తమ ప్రభుత్వాన్ని ఎన్నుకుంటున్నాడు. మనం ఇక్కడ చూడవలసింది ఓటుపై ఓటరుకున్న అవగాహన, విశ్లేషణ.
గ్రామీణ ప్రాంత ఓటర్లు తమ చైతన్యాన్ని కనబరుస్తూ..ఓటునూ అంత తేలిగ్గా తీసుకోవద్దు ఎంతో అప్రమత్తంగా ఉండటం మంచిది అని ఎన్నికల బరిలో ఉన్న ఉద్దండులకు ద్యోతక మవుతోంది..అయ్యింది కూడా. అక్షరాస్యులైతేనేమి, నిరక్షరాశ్యులైతేనేమి తమ తమ అభిప్రాయాలను ఓటు రూపంలో స్పష్టం చేస్తున్నారు. అంత సులభంగా ఉండదు మా, నా ఓటు ప్రభావం అని స్పష్టం చేస్తున్నారు.
ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా ఎన్ని ఆశలు పెట్టినా.. విజ్ఞతతో .. మాత్రమే గాక వివేకాన్ని, చైతన్యాన్ని మేళవించి ప్రజలు ఓటు వేస్తున్నారు. ఓటును అంకుశంగానూ మలుస్తున్నారు. తమపై దండయాత్ర చేసే మదపు టేనుగును కూడా ఓటు అనే ఔటుతో నియంత్రిస్తున్నారు.
ఎన్ని సర్వేలు చేసినా.. అంతుపట్టని నాడితో తీర్పునిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ఓటును ప్రభావితం చేసే అంశాలు, అవకాశాలు ఎలా ఉన్నా.. కూసింత వివేకంతోనే ఓటును వేసే వరకు చైతన్యాన్ని కనబరుస్తున్నారు.
ఎన్ని కబుర్లు చెప్పినా.. ఎవరికి ఓటు వేయాలి ఎవరికి పట్టంకట్టాలి అని తమకు కలిగిన అనుభవాల సారంతోనే వేలిపై సిరాచుక్క గర్వంతో మురిసేలా ప్రజాస్వామ్యానికి గర్వ కారణం అవుతున్నారు. రాజకీయ పార్టీలు ఎంత తెలివిగా వ్యవహరించినప్పటికీ “ఓటరు మహా తెలివైన వాడు సుమీ” అని భావించేలా తీర్పునిస్తున్నారు. చక్కటి పరిశీలనాత్మక శక్తితో .. ఊరు, అప్పుడు,ఇప్పుడు జరిగిన, జరుగుతున్న పరిణామాలను సమీకరణాలను అవలోకనం చేసుకుని మరీ ఓటుతో గురిపెట్టి కొడుతున్నారు. చిన్న చిన్న అంశం మొదలు పెద్ద పెద్ద మాటలు.,ఎవరెవరు ఏ యే హామీలు ఇచ్చారు, ఇస్తున్నారు వాటిని ఎలా నిలబెట్టుకున్నారు. ఊరికి ఒరిగిందేమిటి.అని అవలోకనం చేసుకుంటున్నారు.
ఔరా .. ఓటరు ఆలోచిస్తున్నాడు అని తలపండిన నాయకులు సైతం ఓటరు నాడి ఎలా పట్టాలి అని తర్జన భర్జన పడేలా కసరత్తు చేయిస్తున్నారు. అభ్యర్థి ఎవరైతేనేమి ఎవరు ఏమ్ పని చేశారు, ఊరిని ఏమీ ఉద్దరించారు అన్న కోణం లో ఓటరు మహాశయులు అన్నీ ఆలోచించే మంచి కోసం మార్పుకోసం ఓటు వేస్తున్నారు. అని పరిశీలకులు, ఏలికలు ఎవరైనా ఓ అభిప్రాయానికి వచ్చేలా ప్రజ్ఞను ప్రదర్శిస్తున్నారు తెలివైన ఓటరు. అందుకే ఎన్నికల్లో ఓటర్లను నమ్మించేందుకు ఏ విషయం మాట్లాడాలో, ఏ అంశం తెరపైకి తీసుకురావాలో అర్థంకాక కొందరు ఎన్నికల్లో ఎదురీదాల్సిన పరిస్థితి నెలకొంది.
ఓటు అనేది ప్రతి ఒక్కరూ బాగా ఆలోచించి వేసే దశకు ఇంకా చేరుకోవాల్సివుంది. అయితే ఇంత వరకూ గుంపులను ఎవరు ఎక్కువ ప్రభావితం చేయగలిగితే వారి వైపు గాలివీస్తూ వస్తోంది.. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఓటు వేసే పండుగ, ఓటర్ కి మార్పు తెచ్చే ఓ పెద్ద పండుగగా పరిణమించింది. ఏదో, ఏదో చెప్పి .. అలా నెట్టుకొద్దాం అని ఆలోచన చేసే వారి దూ..రాలోచన కు చెల్లు చీటి రాసి ఇస్తున్నారు ఓటరు.
మొత్తం మీద ఓటరు తన చైతన్యాన్ని ప్రదర్శిస్తూ ఊరి బాగు,ఊళ్ళో సమస్యలను పరిష్కరించడంలో ఆయా వ్యక్తులు చూపే చొరవ, ఆసక్తి, వారి వారి ప్రణాళిక, రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణకు కంకణ బద్దులైన వారిని, ప్రజల గోడు వినేవారిని ఎన్నుకోవడం ద్వారా ఓటరు విఙ్ఞత చూపి, సరైన నాయకులను కలిగిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో ఓటుతో మీట నొక్కి తన వంతు పాత్ర పోషించగల ఓటరు ముందు చూపుతో సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోగలడని ఆశిద్దాం.
– మాచన రఘునందన్
94412 52121