Suryaa.co.in

Telangana

కరెంట్ కావాలా .. కాంగ్రెస్ కావాలా?

-రేవంత్ రైతులను బిచ్చగాళ్లతో పోల్చుతున్నాడు
-వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి మరోసారి నిస్సిగ్గుగా అన్నారు

.- బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు

కరెంట్ కావాలా .. కాంగ్రెస్ కావాలా… తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. తెలంగాణలో రైతన్నలు ఇప్పుడిప్పుడే బాగు పడుతున్నారు. చెరువులు బాగు చేసుకున్నాం, రైతుబంధు, 24 గంటల కరెంట్‌తో బాగుపడుతున్నాం. కాంగ్రెస్ విధానంతో గత 10 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు మళ్లీ వస్తాయి. రేవంత్‌ రైతులను బిచ్చగాళ్లతో పోల్చుతున్నాడు.చిన్న, సన్నకారు రైతులకు 10 హెచ్ పీ మోటార్ పెట్టకుంటే 3 గంటల కరెంట్ చాలు అంటాడు. అసలు వ్యవసాయానికి ఎన్ని హచ్ పీ మోటార్లు వాడాలో తెలియదు రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ తరుపున తెలంగాణ రైతాంగాన్ని కోరుతున్నాను.

మీకు కరెంట్ కావాలా .. కాంగ్రెస్ కావాలా? కాంగ్రెస్ హయాంలో ఉన్న పరిస్థితులు మీకు అనుభవాలను గుర్తుచేసుకోండి.కాంగ్రెస్ హయాంలో ఏనాడైనా 3, 4 గంటల కరెంట్ వచ్చిందా గుర్తు చేసుకోండి.అర్ధరాత్రి కరెంట్ వస్తే జాగారాలు చేసిన రోజులు గుర్తుచేసుకోండి.కాలిపోయిన మోటార్లు, కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు, సబ్ స్టేషన్లు ముందు ధర్నాలు, నిరసనలు చేసినం.చేల గట్ల మీద పాములు, తేలుకుట్టి జరిగిన మరణ మృదంగాన్ని మరోసారి గుర్తు చేసుకోండి.కాంగ్రెస్ హయాంలో రైతన్నలకు క్రాప్ హాలిడేలు, పరిశ్రమలకు పవర్ హాలిడేలు ఇది కాంగ్రెస్ విధానం.

రైతుల కంట కన్నీరు చూడాలన్నట్లు మిత్తీలకు అప్పుల తెచ్చిన పంటలు ఎండిపోవాలన్ని రేవంత్ రెడ్డి మాటలు మరో సారి ఆలోచించండి.మూడు ఎకరాలకు మూడు గంటల చాలు అని రేవంత్ రెడ్డి బరితెగించి చెబుతున్నారు.తెలంగాణ వచ్చాక మేము ఏం చేశామో మీ కళ్ల ముందుప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి, సాగు నీటి ప్రాజెక్టులను కాలంతో పోటీ పడి నిర్మించాం. బోరుల మీద ఆధారపడి వ్యవసాయం చేసే రైతులకు 24 గం. కరెంట్ ప్రాణపదం అని భావించి ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. ఈ రోజు తెలంగాణలో కాలిపోయే మోటార్లు లేవు, కాలిపోయే ట్రాన్స్ ఫార్మర్లు లేవు.

ఎన్ని గంటలు మోటార్లు నడిపిన బిల్లులు లేవు.కాలువల మీద ఎన్ని మోటార్లు పెట్టుకున్నా మిమ్మల్నీ అడిగేవారు లేరు. ఉచిత విద్యుత్ కోసం ప్రతి నెల వెయ్యి కోట్ల రూపాయలు చొప్పున ప్రతి సంవత్సరం 12 వేల కోట్లు ఖర్చు పెడుతుంది. కటిక చీకటిలు పోయి 24 గం.ల కరెంట్ తో ఇప్పుడిప్పుడే తెల్లపడుతున్న తెలంగాణ రైతన్నఆలోచించు.మీకు కరెంట్ కావాలా , కాంగ్రెస్ కావాలా ఆలోచించు. ఒక వైపు బీజేపీ మెడపై కత్తి పెట్టి మోటార్లకు మీటర్ల పెట్టకపోతే రుణాలు ఇవ్వమని బ్లాక్ మేల్ చేసిన తలొగ్గలేదు.

30వేల కోట్లు వదులుకున్నాం తప్పా. మీటర్లు పెట్టలేదు రైతులకు అన్యాయం చేయలేదు. కాళేశ్వరం ప్రాజక్టులు కట్టినా , సదర్ మాట్ చనాకా కొరటా ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి, అనుమతులు తీసుకొని భారతదేశం ఆశ్చర్యపోయేలా అద్భుతంగా పంటలు పండిస్తున్నారు.ధాన్యం పండించే దానిలో 15 వ స్థానంలో ఉన్న తెలంగాణ ఇప్పుడు నెంబర్ వన్ కు చేరింది60 లక్షల ధాన్యం పండించే తెలంగాణ మూడున్నర కోట్ల ధాన్యం పండించి పంజాబ్ ,హర్యానాను తలదన్నే స్థాయికి చేరింది.తెలంగాణ రైతన్నా ఆలోచించు. కరెంట్ కావాలా కాంగ్రెస్ కావాలా?

రాబంధుల కాలం పోయింది పోయింది రైతుబంధు రాజ్యం వచ్చింది. తెలంగాణ కోటి ఎకరాల మాగాణి అయ్యింది. చివరకు ఫుడ్ కార్పోరేషన్ ధాన్యం తీసుకోమని స్థాయికి ,చేరింది.గుంట భూమి ఉన్న రైతుకు బీమా ఇస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉందా? పెండింగ్‌ ప్రాజెక్టులు నేడు రన్నింగ్‌ ప్రాజెక్టులు అయినయి. రైతన్న భూములకు రక్షణకవచంలా ధరణి పోర్టల్‌ తీసుకొచ్చినంతెలంగాణలో చిన్న, సన్నకారు రైతులే. 24 గంటల కరెంటు కావాల్నా.. 3 గంటల కరెంటు కావాలా? రైతుబంధును పక్క రాష్ట్రాలే కాదు ప్రధాని మోదీ సైతం కాపీ కొట్టారు.

బీఆర్ఎస్‌ అంటే పంట కోతలు.. కాంగ్రెస్‌ అంటే కరెంటు కోతలు. కుసంస్కారం గల కాంగ్రెస్‌ను పాతరవేయాలి. ఉచిత విద్యుత్‌ వద్దంటున్న కాంగ్రెస్‌ను ఊరి పొలిమేరల దాకా తరిమికొట్టండి. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే పవర్‌ హాలిడేలు ఖాయం. తెలంగాణను సర్వనాశనం చేసింది కాంగ్రెస్సే. కరెంటుపై కాంగ్రెస్‌ విధానం ఏంటో రాహుల్ స్పష్టం చేయాలి.

 

LEAVE A RESPONSE