– రైతుల జీవనోపాధిపై దెబ్బకొట్టడం అత్యంత దుర్మార్గం
– బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్ ఇన్చార్జి డాక్టర్ దాసోజు శ్రవణ్ ట్వీట్
మాణిక్రావు ఠాక్రే రాసిన ఈ క్రూరమైన లేఖతో రేవంత్ కాంగ్రెస్ పెట్టుబడిదారీ మనస్తత్వంతో నడిచే తన కర్కశ, రైతు, పేదల వ్యతిరేక వైఖరిని మరోసారి సిగ్గు లేకుండా బయటపెట్టింది.
మాణిక్రావ్ జీ.. ఎన్నికలు వస్తుంటాయి, పోతుంటాయి. రైతులు వ్యవసాయాన్ని ఆపలేరు, రైతులను వేధించకూడదని మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. చిల్లర రాజకీయాల కోసం, మన సమాజాన్ని పోషించడానికి ఎన్నో త్యాగాలు చేసి నిస్వార్ధంగా కష్టపడే రైతుల జీవనోపాధిపై దెబ్బకొట్టడం అత్యంత దుర్మార్గం.
భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ , జాలి, దయ లేని మీ లేఖను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నాను. మన రైతులు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, భవిష్యత్తును స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం బలి కాకూడదు. ముఖ్యమంత్రి కేసీఆర్ లా రైతులు, బడుగు బలహీన శ్రేయస్సు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి.మీ విభజన, వివక్ష రాజకీయాలను తిప్పికొట్టి, మా రైతులను రక్షించుకుంటాం.
కేసీఆర్ గొప్ప సంకల్పంతో దూరదృష్టితో రూపొందించి, ప్రారంభించిన రైతు బంధు కార్యక్రమం రైతులకు అత్యంత అవసరం దేశవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు స్ఫూర్తినిస్తున్నాయి.
మోసగాడు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ అసలు రంగును తెలంగాణ ప్రజలు గ్రహించాలి. వారు రైతులను, పేదలను పట్టించుకోరు, కేవలం ఓట్ల కోసమే చూస్తున్నారు. జాగ్రత్త గా ఉందాం. వారికి తగిన గుణపాఠం చెబుదాం.