– అందువల్లే ఈరోజు దేశంలో ముస్లింల జనాభా 700 శాతం పెరిగింది
-మేం తలుచుకుంటే ప్రజల్లో తిరగలేరు
దొంగనోట్ల వ్యవహారాన్ని దారిమళ్లించేందుకే పార్టీ పెట్టింది వాస్తవం కాదా?
– కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, సీపీఎం, ఎంఐఎం పార్టీలు ముమ్మాటికీ దొంగల ముఠానే
– ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలు ఏమైపోయాయి?
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు
హైదరాబాద్: బీఆర్ఎస్- కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కై బిజెపి పై విషప్రచారం చేస్తున్నాయి. గత మూడు రోజుల నుంచి బీఆర్ఎస్ నాయకులు కల్లు తాగిన కోతిలాగా వ్యవహరిస్తున్నరు. ఏం మాట్లాడుతున్నారో వారికే అర్థం కావడం లేదు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పై అవాకాశవాద రాజకీయాలు చేస్తూ తప్పుడు కేసులు పెట్టే ప్రయత్నం చేయడం, నోటికొచ్చినట్లు మాట్లాడడం వారి కుట్ర రాజకీయాలకు నిదర్శనం.
దాసోజు శ్రవణ్ సోకాల్డ్ విద్యావేత్త. ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించగానే భవిష్యత్తును వెతుక్కుంటూ తిట్టిన పార్టీలోకి వెళ్లి బీఆర్ఎస్‌కు దాసోహమంటున్నారు. దొంగనోట్ల కేసులో కేసీఆర్‌పై కాచిగూడ పీఎస్‌లో కేసు నమోదైందని ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలు ఏమైపోయాయి?
ఇప్పుడు ఎమ్మెల్సీ పదవి కోసం ఆరాటపడి, దాసోజు శ్రవణ్, ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ మాట మార్చి మాట్లాడుతున్నారు. పదవుల కోసం పార్టీలు మారుతున్న అలాంటి నాయకులు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరిస్తున్నాం. మేం తలుచుకుంటే ప్రజల్లో తిరగలేదు. కేసీఆర్ దొంగనోట్ల ప్రింటింగ్ ప్రెస్ పెట్టారని, దొంగనోట్ల వ్యాపారం చేశారని తెలంగాణ ప్రజలందరూ మాట్లాడుకుంటున్నరు. ఇదేమీ కొత్తగా వచ్చిన విమర్శ కాదు.
1996-99 మధ్య కేసీఆర్.. రామకృష్ణ గౌడ్ అనే వ్యక్తితో కలిసి బీదర్ లో దొంగనోట్లు ముద్రించారని ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాన్ని అప్పటి ఉమ్మడి మెదక్ జిల్లా ఎస్పీ ధృవీకరించారు. కేసీఆర్ అవినీతి చరిత్ర ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచే మొదలైంది. కేసీఆర్ .. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా పనిచేశారు. అప్పుడు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా వి.హన్మంతరావు పనిచేశారు.
దొంగనోట్ల వ్యవహారంలో కేసీఆర్ పై ఆలిండియా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గులాం నబీ ఆజాద్ కి వీహెచ్ ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేసీఆర్ టీడీపీలో చేరింది వాస్తవం కాదా..? దొంగనోట్ల కేసు ఉన్నందునే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు .. కేసీఆర్ కు మంత్రి పదవి ఇవ్వలేదు.
కేసీఆర్.. దొంగనోట్ల వ్యవహారాన్ని దారిమళ్లించేందుకే తెలంగాణ ఉద్యమానికి తెరలేపి, పార్టీ పెట్టింది వాస్తవం కాదా? దొంగనోట్లు ముంద్రించడం, దొంగ పాస్ పోర్టులు చేయడం, విదేశాలకు మహిళల అక్రమ రవాణా చేయడం వంటి ఆరోపణలు గతంలో కేసీఆర్ పై వచ్చినవే కదా? దీనిపై అసెంబ్లీలో, బయటా చర్చ కూడా జరిగింది. కేసులు నమోదయ్యాయి.
దొంగనోట్ల నిందితుడు మంత్రి కేసీఆర్ ను బర్తరఫ్ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ ఆరోజు పెద్దఎత్తున ధర్నా చేసింది. ఇప్పుడు ఆ విషయం మర్చిపోయిందా? ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, డీఎంకే, సీపీఎం పార్టీలన్నీ కలిసి తిరుగుతున్నాయి. 2006లో యూపీఏ హయాంలో కేసీఆర్ కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు సహారా స్కాంలో చిక్కుకుని మంత్రి పదవి వదిలేశారు.
ఆ వెంటనే.. తెలంగాణ గురించి కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవడం లేదంటూ ఆరోపిస్తూ మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, సీపీఎం, ఎంఐఎం పార్టీలు ముమ్మాటికీ దొంగల ముఠానే. లిక్కర్ స్కాంలో దొరికింది బీఆర్ఎస్ పార్టీ నేతలు. గోల్డ్ స్కాం కేసులో పినరయి విజయన్ నిందితులుగా ఉన్నారు.
రూ. 10 వేల కోట్ల లిక్కర్ స్కాం డీఎంకే పార్టీ మెడ మీద వేలాడుతోంది. ఈడీ ధృవీకరించింది. వీరికి తోడు పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం లిక్కర్ స్కాంలో మునిగిపోయింది. తమిళనాడులో జనాభా తగ్గింది. కానీ తెలంగాణలో తగ్గలేదు. ఉత్తరప్రదేశ్ లో మాదిరిగానే జనాభా పెరిగింది.
మేం ఇద్దరం.. మాకు ఇద్దరం అంటూ నినాదం తీసుకొచ్చి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించి హిందూ జనాభాను తగ్గించింది కాంగ్రెస్ కాదా? అందువల్లే ఈరోజు దేశంలో ముస్లింల జనాభా 700 శాతం (22 కోట్లకు) పెరిగింది.
జనాభా నియంత్రణ అందరికీ ఒకే విధంగా ఉండాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే, సీపీఎం పార్టీలు డిమాండ్ చేస్తాయా? కాంగ్రెస్ మత రాజకీయాల కోసం డీలిమిటేషన్‌ను వక్రీకరించడం దుర్మార్గం! కర్ణాటక ప్రభుత్వం కాంట్రాక్టుల్లో మైనారిటీలకు 4 శాతం రిజర్వేషన్లు ఇచ్చి అక్కడి ప్రజలను మోసం చేసింది.
కేసీఆర్ మొదటి నుంచి హిందూ వ్యతిరేకి. కరీంనగర్‌లో “హిందూగాళ్లు, బొందుగాళ్లు” అన్నది కేసీఆర్ కాదా? ఈ విషయాన్ని ప్రజలు మర్చిపోలేదు. 1947లో కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం ముస్లింలను కోరిన వెంటనే భారతదేశాన్ని విభజించింది.