-ఆ పద్ధతి దేశంలో అవసరం లేదు
-అభివృద్ధి చెందిన దేశాలే రిమోట్ ఓటింగ్ విధానాన్ని పక్కన పెడుతున్నాయి
-పార్టీలో చర్చించి ఈనెల 30 లోగా కేంద్ర ఎన్నికల కమిషన్ కు లిఖిత పూర్వకంగా బీ.ఆర్.ఎస్. అభిప్రాయం తెలుపుతాం
-రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్
– ఢిల్లీలో ఈ.సీ. సమావేశం నేపథ్యంలో విలేకరుల ప్రశ్నలపై వినోద్ కుమార్ స్పందన
పార్టీలో చర్చించి ఈనెల 30 లోగా కేంద్ర ఎన్నికల కమిషన్ కు లిఖిత పూర్వకంగా బీ.ఆర్.ఎస్. పార్టీ అభిప్రాయం తెలుపుతాం.మేం రిమోట్ ఓటింగ్ విధానాన్నివ్యతిరేకిస్తున్నాం. ఆ పద్ధతి దేశంలో అవసరం లేదు. ఎన్నికల్లో వాడుతున్న ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నారనే అనుమానాలు, ప్రచారాలు బలంగా ఉన్నాయి.
వాటినే ఈసీ ఇప్పటి వరకు నివృత్తి చేయలేదు. అలాంటప్పుడు మల్టీ కానిస్టిట్యూయెన్సీ రిమోట్ ఓటింగ్ యంత్రాలను ఎలా విశ్వసిస్తాం. అభివృద్ధి చెందిన అమెరికా, ఇంగ్లాండ్ దేశాలే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను పక్కన పెట్టేశాయి. నిత్యం బ్యాంకు ఖాతాలు హ్యాక్ చేస్తున్న విషయాలు బయటకు వస్తున్నాయి. అలాంటప్పుడు ఎక్కడో విదేశాల్లో ఉన్న వ్యక్తి పేరుతో వేసే ఓట్లను ఎలా నమ్మగలం. అక్కడి నుంచి ఆ ఓటరే ఓటు వేస్తున్నాడా..? హ్యాక్ చేస్తున్నారా..? ఎలా తెలుసుకోగలం?