Suryaa.co.in

Telangana

కేసిఆర్ ను చావాలని కోరుకుంటావా?

– రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న సభలో ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం
– మాజీ మంత్రి గంగుల కమలాకర్ ,విప్ కె .పి .వివేకానంద ,ఎమ్మెల్యేలు సుధీర్ రెడ్డి ,మాణిక్ రావు అనిల్ జాదవ్

హైద‌రాబాద్‌: 2009 నుంచి నేను అసెంబ్లీ లో ఉన్న, వైఎస్ఆర్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, కేసిఆర్ లాంటి సీఎం లను చూసాను. రేవంత్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిగా చూస్తున్న. చంద్రబాబు నాయుడు లాంటి నేతలను చూశాం. కెసిఆర్ ను రేవంత్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి లాగా చూస్తున్నడు. కానీ మేము తెలంగాణ తెచ్చిన గొప్ప వ్యక్తిగా చూస్తున్నాం.

కేసిఆర్ ను చావాలని కోరుకుంటావా? రేవంత్ రెడ్డి ని ఒక వ్యక్తిగా చూడలేదు.నిన్ను ఒక సీఎంగా చూస్తున్నాం. తెలంగాణ సీఎం అని రేవంత్ రెడ్డి అనుకుంటే పితృ సమానులైన కేసిఆర్ కు క్షమాపణ చెప్పాలి. ఒక తండ్రి లాగా ఉన్న కేసీఆర్ చావును ఎవరు కోరుకోలేదు. తెలంగాణ సమాజానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి.

ఇది ముఖ్యమంత్రి భాషనా?: ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
గత 15 నెలలుగా రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష అభ్యంతరకరంగా ఉంది.కేసీఆర్ ను కేసిఆర్ కుటుంబాన్ని ఎలా తిట్టాలని చూస్తున్నడు.. ఇలాంటి భాష మాట్లాడితే ఊరుకునేది లేదు. పండబెట్టి తొక్కుతా, లాగుల తొండలు విడుస్తా అంటూ గతంలో మాట్లాడారు. ఇప్పుడేమో కేసిఆర్ ను మార్చురీ కి పంపిస్తా అంటున్నాడు. ఇది ముఖ్యమంత్రి మాట్లాడిన భాషనా కచ్చితంగా రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలి.

రేవంత్ రెడ్డి మానసిక స్థితి బాగోలేదు: విప్ కె.పి.వివేకానంద
రేవంత్ రెడ్డి తన అసమర్థతను కప్పిపుచ్చుకోవడానికి అసభ్యంగా మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి మానసిక స్థితి బాగోలేదు. రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోవడం లేదు. రేవంత్ రెడ్డి ఆరుగురు మంత్రులను నియమించుకోలేని స్థితిలో ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఏం చేయాలో తెలియక కేసీఆర్ కుటుంబాన్ని తిడుతున్నారు. పాలన చేతకావడం లేదు. గవర్నర్ తో అబద్దాలు చెప్పించారు. రేవంత్ రెడ్డి దేవుళ్లపై ఒట్లు పెట్టారు,బూతులు తిడుతున్నారు.

కాళేశ్వరం అనే పవిత్ర పేరును సీఎం రేవంత్ రెడ్డి కూలేశ్వరం అని అంటున్నారు. రేవంత్ రెడ్డి అధికారమదంతో మాట్లాడుతున్నారు. రేవంత్ రెడ్డి డైనమిజం కాదు. హామీలు ఎగ్గొట్టడంలో,అవినీతి చేయడంలో రేవంత్ రెడ్డి డైనమిజం. రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్న సభలో ఎమ్మెల్యేగా ఉన్నందుకు సిగ్గుపడుతున్నాం. తక్షణమే రేవంత్ రెడ్డి కేసీఆర్ కు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి.

LEAVE A RESPONSE