– నారా లోకేష్
తంబళ్లపల్లి నియోజకవర్గం, కంటేవారిపల్లిలో నారా లోకేష్ ను కలసి సమస్యలు చెప్పుకున్న శాలివాహన సంఘాలు
• కుమ్మరిపని వలన అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి.
• కానీ ప్రభుత్వం నుండి ఎలాంటి ఆదరణా లేదు.
• కుమ్మర కార్పొరేషన్ కు నిధులు కేటాయించాలి.
• సబ్సీడీతో టెక్నాలజీతో కూడిన పనిముట్లు అందించి పనిభారం తగ్గించాలి.
• ఇళ్లు మంజూరు చేయాలి.
• కంటెవారిపల్లెలోనూ సీఎఫ్సీ బిల్డింగ్, సేల్ కాంప్లెక్స్ నిర్మించాలి.
నారా లోకేష్ మాట్లాడుతూ…
• శాలివాహన సామాజికవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం.
• ఆదరణ ద్వారా గతంలో వేలాది రూపాయల విలువ చేసే పనిముట్లు అందించాం.
• టీడీపీ హయాంలో అంగళ్లలో సీఎఫ్సీ భవనం నిర్మించాం.
• దీంతో వారంతా ఒకేచోట ఉండి పని చేసుకుంటున్నారు.
• అధికారంలోకి వచ్చాక కంటెవారిపల్లెలోనూ సీఎఫ్సీ బిల్డింగ్ నిర్మించే ప్రయత్నం చేస్తాం
• మీ ఉత్పత్తుల సేల్ ను అధికారంలోకి రాగానే మేము ప్రమోట్ చేస్తాం.