మంత్రి బొత్స సత్యనారాయణ
పల్నాడు: పేద, ధనిక వ్యత్యాసం లేకుండా అందరూ సమానంగా ఉండాలనే ఈ విద్యాకానుక ఇస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని క్రోసూరులో జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం వైయస్ జగన్ లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు.
అందరికీ నమస్కారం, ఈ రాష్ట్రంలో చదువుల విప్లవం సాగుతోంది. మన విద్యార్ధి గ్లోబల్ సిటిజెన్ గా నిలబడాలనే ఆలోచనతో సీఎంగారు విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తున్నారు. పేద, ధనిక వ్యత్యాసం లేకుండా అందరూ సమానంగా ఉండాలనే ఈ విద్యాకానుక ఇస్తున్నాం, గోరుముద్దలో రోజుకో మెనూ పెట్టి చక్కటి భోజనం ఇస్తున్నాం, 8 వ తరగతి విద్యార్ధులకు ట్యాబ్ లు ఇస్తూ బైజూస్ కంటెంట్ కూడా అందజేస్తున్నాం, ఐఎఫ్ పీలతో భోదన జరగాలని సీఎంగారు చెబితే ఆశ్చర్యపోయాం, కానీ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన విద్యార్ధులకు చక్కటి చదువులు అందించేలా ఏర్పాట్లు చేశాం, టోఫెల్ శిక్షణ కూడా అందజేయడం విశేషం, దేశంలోనే ఏపీ మేటి రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మీ మద్దతు అవసరం, అలాంటి శాఖను నాకు అప్పగించిన సీఎంగారికి కతజ్ఞతలు తెలుపుతున్నాను.