– మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు
స్వామి వివేకానంద, దీనదయాల్ అంత్యోదయ ఆదర్శంగా లైవ్ భారత్ ఫౌండేషన్ పనిచేస్తుంది. సంస్కృతి, సంప్రదాయాలను, ఆచార వ్యవహరాలను పది మందికి తెలియజెప్పాలని చేస్తున్న ప్రయత్నం గొప్పది. సంక్రాంతి సమయంలో నగరాలు ఖాళీ అయి గ్రామాలు నిండుకుంటున్నాయి. కుటుంబాలను
కలిపి ఉంచే పండుగ సంక్రాంతి. హరిదాసులు, గంగిరెద్దులతో తెలుగింటి పిండి వంటకాలు రుచి చూస్తాం. సూర్యుడు గమనం మీద ఆధారపడిన పండుగ సంక్రాంతి. యోగాలో సూర్య నమస్కారాలకు ప్రాధాన్యత ఉంది. పెట్రోలు, డిజీల్ నిల్వలు అంతరించేపోయే ప్రమాదం ఉంది. సూర్య శక్తి ద్వారా ప్రపంచం నడిచే పరిస్థితి వస్తోంది. గుజరాత్ సిఎంగా మోడీ ఉన్నప్పుడే సోలార్ విద్యుత్ ప్రాధాన్యత గుర్తించారు. సూర్య శక్తిని వినియోగించుకోవడంలో వెనుకబడ్డాం. సూర్య శక్తి ద్వారా విద్యుత్ ను తయారు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. కరెంటు లేకపోతే జీవనం గడవదు. ఇంధన రంగంలో ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఎదగాలి. తెలుగు ప్రజల జీవితాల్లో క్రాంతి నిండాలని కోరుకుంటున్నానని మిజోరాం గవర్నర్ కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు.
లైవ్ భారత్ ఫౌండేషన్ చైర్మన్ వల్లూరు జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు గుంటూరు పలకలూరు రోడ్డులోని గుంటూరు క్లబ్ నందు అత్యంత వైభవంగా నిర్వహించారు. విశిష్ట అతిథిగా మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు విచ్చేశారు. సంక్రాంతి సంబరాలు కార్యక్రమానికి
బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు కన్నా లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు, ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి ఎమ్మెల్సీలు పివిఎన్ మాధవ్,వాకాటి నారాయణరెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెల కిషోర్ బాబు, టుబాకో బోర్డు చైర్మన్ యడ్లపాటి రఘునాదబాబు బిజెపి జిల్లా అధ్యక్షులు పాటిబండ్ల రామకృష్ణ విచ్చేశారు.
లైవ్ భారత్ ఫౌండేషన్ చైర్మన్ ,జాతీయ కార్మిక సంక్షేమ బోర్డ్ చైర్మన్ వల్లూరు జయప్రకాష్ నారాయణ్ ఆధ్వర్యంలో ” సంక్రాంతి సంబరాలు ” వేడుకలు పలకలూరు రోడ్డు లోని గుంటూరు క్లబ్ ప్రాంగణములో ఆహ్లాదకరమైన వాతావరణంలో అత్యంత వైభవోపేతంగా గంగిరెద్దుల ఆటపాటలతో , సన్నాయి , డోలు
వాయిద్యములతో , రంగురంగుల రంగ వల్లుల నడుమ , హరిదాసుల పాటలతో , సాంస్కృతిక సంగీత కళాకారుల సాంప్రదాయ భరతనాట్య నృత్యాలతో , వేదపండితుల వేద మంత్రాల వేదఘోషతో అత్యంత
రమణీయంగా కన్నుల పండుగగా జరిగింది. లైవ్ భారత్ పౌండేషన్ చైర్మన్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మిజోరాం గవర్నర్ హరిబాబుని ఘనంగా సత్కరించారు.
ఈసందర్భంగా బీజేపీ జాతీయ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ… సంక్రాంతి
తెలుగు వారికి పెద్ద పండుగ. గ్రామీణ ప్రాంతాల్లో పంట ఇంటికి తెచ్చుకొని సమయంలో సంక్రాంతి వస్తుంది. గంగిరెద్దుల, హరిదాసులు సంక్రాంతి సమయంలోనే వస్తారు. దేశ సంస్కృతిని, ఆధ్యాత్మికను ప్రధాని మోడీ కాపాడుతున్నారు. దేశాన్ని విశ్వ గురువుగా మోదీ మారుస్తారని ధీమా వ్యక్తం చేశారు.
వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ… కరోనా సమయంలో పేదలను ఆదుకునేందుకు కార్యక్రమాలు చేశాం.మన సంస్కృతి, సాంప్రదాయాలు మర్చిపోతున్న సమయంలో సంక్రాంతి నిర్వహించాలని నిర్ణయించాం. తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి అన్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు మాట్లాడుతూ…రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో ఇంగ్లీష్ జబ్బు
వచ్చింది. దానికి విరుగుడే ఈ సంక్రాంతి సంబరాలు. తెలుగుకు సంబంధించి ప్రపంచ స్థాయి సభ భీమవరంలో నిర్వహిస్తున్నారు. జాతికి సంబంధించిన ఆలోచనలు ఇక్కడ ప్రదర్శిస్తున్నాం. భాష మర్చిపోతే అన్ని మర్చిపోతాం. ఓట్ల కోసమే తెలుగు మాకొద్దు అంటున్నారు. అధికారికంగా సంక్రాంతి సంబరాలు చేయాలి. ఈ ప్రభుత్వం తెలుగు సంక్రాంతి సంబరాలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. తెలుగుకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేశాం అన్నారు.
రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి మాట్లాడుతూ… గవర్నర్ హరిబాబు వద్ద నుండి చాలా నేర్చుకున్నాను. ఆయనతో చాలా సన్నిహితంగా కలిసి పని చేశాను. ఆచార్య హరిబాబు అని పిలిచే వాళ్ళం. రాజకీయాల నుండి తప్పుకుందామనుకునే సమయంలో హరిబాబు గారికి గవర్నర్ పదవి వచ్చింది. అందరం కలిసి మెలిసి పని చేసి రాష్ట్రాన్ని కాపాడాలి అన్నారు.
సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో వాసిరెడ్డి వెంకట చైతన్య,పాలపాటి రవికుమార్,నీలం ప్రసాద్ పాలిశెట్టి రఘు,లలిత్ ఉయ్యాల శ్యాంవరప్రసాద్, ఇండ్ల పాండు,వెలగలేటి గంగాధర్,చింతపల్లి వెంకట్,బుల్లిబాబు మనోజ్,రమేష్,రాఘవ, నాదెండ్ల రమేష్, వివిధ రంగాలలో ఉన్న నగరంలోని ప్రముఖులు పాల్గొన్నారు