– డ్రగ్ కంటైనర్ పై సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హరి వివరణ
రొయ్యల మేత లో వాడే ఈస్ట్ ను మొదటిసారి బ్రెజిల్ నుంచి ఆర్డర్ ఇచ్చాం. తక్కువ రేట్ కు మంచి క్వాలిటీ ఈస్ట్ లభిస్తుండడం తో ఐ సీ సీ – బ్రెజిల్ కంపెనీకి డిసెంబర్ లో డబ్బు చెల్లించాం.జనవరి 14 న బ్రెజిల్ శాంతోస్ పోర్ట్ లో బయల్దేరి మార్చ్ 16 న విశాఖ వచ్చింది. ఇంటర్ పోల్ సమాచారం తో సీబీఐ మా సమక్షంలో కంటైనర్ ఓపెన్ చేసి డ్రగ్ టెస్ట్ చేశారు.
నిషేధిత డ్రగ్ గా సీ బీ ఐ అనుమానిస్తోంది. ఐ సీ సీ బ్రెజిల్ మాత్రం ఎలాంటి నిషేధిత డ్రగ్ సరఫరా చేయలేదని, నిరూపించడానికి సిద్దం అని చెప్పింది. ఇంకా టెస్ట్ లు జరగాల్సి ఉంది, మా ప్రమేయం ఏమీ లేదు, విచారణకు సహకరిస్తాం. రాజకీయాల కోసం పార్టీలు దీన్ని వాడుకోవడం విచారకరం. మాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు.