Suryaa.co.in

Andhra Pradesh

స్టీరింగ్ కమిటీ నుంచి వైదొలుగుతున్నాం

– ‘చలో విజయవాడ’కు పిలుపిస్తాం

అమరావతి : పాఠశాలల్లో నిరసన తెలియజేసే హక్కులను ప్రభుత్వం హరిస్తోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ చర్చల్లో ఏకపక్షంగా వెళ్లిన స్టీరింగ్ కమిటీకి రాజీనామా చేసినట్లు ప్రకటించిన నేతలు… పీఆర్సీ, హెచ్ఆర్ఏ సహా… అన్ని డిమాండ్ల సాధనకు ఐదు రోజులు నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు.

అవసరం అయితే మరోసారి చలో విజయవాడకు పిలుపునిస్తామని చెప్పారు. పీఆర్సీ జోవోలకు వ్యతిరేకంగా.. నిరసన తెలియజేసే హక్కును ప్రభుత్వం హరిస్తోందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

విజయవాడలోని ఏపీటీఎఫ్ పాఠశాలలో ఉపాధ్యాయులు చేస్తున్న నిరసనకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ఫ్యాప్టో రాష్ట్ర అధ్యక్షుడు, యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌ నేతలు అనుమతి తీసుకోవాలని.. పోలీసులు చెప్పటంపై మండిపడ్డారు.

ఉపాధ్యాయ సంఘాలను సీఎం స్వయంగా పిలిచి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ రద్దు సహా ఫిట్‌మెంట్‌ విషయంలో తాము వెనక్కి తగ్గబోమని తేల్చి చెప్పారు. అవసరం అయితే మరోసారి చలో విజయవాడకు పిలుపిస్తామని తెలిపారు.12వ తేదీ తర్వాత ఉద్యమ కార్యాచరణతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు.

స్టీరింగ్‌ కమిటీ నుంచి వైదొలిగిన ఉపాధ్యాయులు
ఉద్యోగుల సమస్యలపై మంత్రుల కమిటీతో జరిగిన చ‌ర్చల్లో ఏకపక్ష వైఖరిని వ్యతిరేకిస్తూ స్టీరింగ్‌ కమిటీ నుంచి వైదొలుగుతున్నట్లు ఉపాధ్యాయ సంఘాల నేతలు తెలిపారు. స్టీరింగ్ కమిటీకి రాజీనామా చేస్తున్నామని ప్రకటించిన నేతలు… జేఏసీ ఛైర్మన్లకు లేఖలు పంపామని వెల్లడించారు.
ప్రభుత్వ చర్చల్లో స్టీరింగ్ కమిటీ ఏకపక్షంగా వెళ్లిందని… ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలు ఉపాధ్యాయులకు నష్టం కలిగించేలా ఉన్నాయన్నారు. పీఆర్సీ, హెచ్ఆర్ఏ సహా… అన్ని డిమాండ్లపైనా ఉద్యమానికి సిద్ధమని నేతలు స్పష్టం చేశారు. ఫ్యాప్టో ఆధ్వర్యంలో ఐదు రోజులు నిరసనలు చేపడతామమన్నారు.

LEAVE A RESPONSE