– ప్రజలకు మంత్రి లోకేష్ దీపావళి శుభాకాంక్షలు
అమరావతి: ఆనందకాంతుల దీపావళి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. విధ్వంసపు చీకట్లను ప్రగతి వెలుగులతో తరిమేశాం. సంక్షోభాల చెడు పాలనపై సంక్షేమ పాలన విజయం సాధించింది. ఇక ప్రతిరోజూ ప్రతి ఇంటా సంక్షేమం పండుగే. రాష్ట్రంలో ప్రగతి పరుగులే. కూటమి ప్రభుత్వం పేదల లోగిళ్లలో దీపం పథకంతో వెలుగులు నింపనుందని విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బాబు సూపర్ సిక్స్ హామీ అయిన ఏడాదికి మూడు గ్యాస్ సిలెండర్లను పండుగ కానుకగా అందిస్తున్న శుభ సందర్భంలో ప్రజలంతా సంతోషంగా, సురక్షితంగా దీపావళి జరుపుకోవాలని కోరుకుంటున్నాను అని తెలిపారు.