బీజేపీ ఆకర్ష్‌ను సైబరాబాద్ పోలీసులు చేధించారు. టీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతూ బేరసారాలు జరిపిన ముగ్గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అనంతరం సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాతో మాట్లాడారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. తమను కొంతమంది
ప్రలోభపెడుతున్నారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సమాచారం అందించారని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. డబ్బు, కాంట్రాక్టులు, ఇతర పదవులు ఇస్తామని ఆశచూపారని పేర్కొన్నారు. వారిచ్చిన సమాచారంతో ఫామ్ హౌజ్‌పై రైడ్ చేశామన్నారు. ఈ రైడ్‌లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. వీరిలో ఢిల్లీ నుంచి వచ్చిన పీఠాధిపతి రామచంద్ర భారతి అలియాస్ సతీశ్ శర్మ టీఆర్ఎస్
ఎమ్మెల్యేలతో సంప్రదింపులు జరిపారని పేర్కొన్నారు. రామచంద్రభారతితో పాటు ఫామ్‌హౌజ్‌లో తిరుపతి నుంచి వచ్చిన సింహయాజులు, హైదరాబాద్‌కు చెందిన నందకుమార్ ఉన్నారని చెప్పారు. వీళ్లు ఏమని ప్రలోభ పెట్టారనే దానిపై విచారణ జరుపుతున్నామని.. వీరిపై లీగల్ యాక్షన్ తీసుకుంటామని పేర్కొన్నారు.