– నిజంగా చంద్రబాబు తప్పుచేసిఉంటే, అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డిగానీ, కేంద్రప్రభుత్వం గానీ ఊరుకుంటాయా?
– పెగాసస్ సాఫ్ట్ వేర్ ఆరోపణలపై సుప్రీంకోర్టు వేసిన కమిటీ వాస్తవాలు తేలుస్తుంది.
• మమతాబెనర్జీతో ప్రశాంత్ కిషోర్ కావాలనే చంద్రబాబుపై ఆరోపణలు చేయించాడనేది వాస్తవం
• ప్రశాంత్ కిషోర్ రాజకీయాలన్నీ దుష్ప్రచారాలతో కూడుకున్నవే
• టీడీపీప్రభుత్వం, చంద్రబాబు రూ.6లక్షల కోట్ల అవినీతిచేశారని జగన్మోహన్ రెడ్డితో పీకేప్రచారం చేయించాడు
– జగన్ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా రూపాయి అవినీతిని కూడానిరూపించలేకపోయారు
• కేంద్రప్రభుత్వం అనుమతి లేకుండా ఏ రాష్ట్రమూ కూడా విదేశాలతో సంబంధాలు పెట్టుకొని ఏదిపడితే అది చేయడానికి వీల్లేదు. అది చట్టవ్యతిరేకం కూడా
– మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
కేంద్రప్రభుత్వం అనుమతిలేకుండా రాష్ట్రప్రభుత్వాలు నేరుగా ఇతర దేశాలతో వ్యాపారకార్యకలాపాలు నిర్వహించడమనేది అసాధ్యమ ని, పెగాసస్ సాఫ్ట్ వేర్ ను గతంలో ఎప్పుడోచంద్రబాబు కొన్నార న్న అధికారపార్టీవ్యాఖ్యలు పచ్చిఅబద్ధాలు, అవాస్తవాలేనని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తేల్చిచెప్పారు.
గతంలో పెగాసస్ సాఫ్ట్ వేర్ కు సంబంధించి నాగేంద్రప్రసాద్ అనే వ్యక్తి ఆగస్ట్ 2021న ఆర్ టీఐ సమాచారంకింద, సదరుసాఫ్ట్ వేర్ కొనిఉంటే, దానికి సంబంధించినవివరాలు తనకు తెలియ చేయాలని స్వయంగా డీజీపీగాఉన్న గౌతమ్ సవాంగ్ ను కోరాడు. దానికి ఆయన చాలాస్పష్టంగా సమాధానమిస్తూ, అలాంటి సాఫ్ట్ వేర్ ఏదీ ఏపీ రాష్ట్రం కొనుగోలుచేయలేదని, చేశారనడానికి కూడా ఎలాంటి ఆధారాలులేవని నాగేంద్రప్రసాద్ కు సమాధానమిచ్చారు.పెగాసస్ సాఫ్ట్ వేర్ అంశాన్ని తెరపైకితెచ్చిన వైసీపీవారికి రాష్ట్రప్రభుత్వాల పరిధేమిటో వాటివిధులేమిటో కూడా తెలియక పోవడం కనీస జ్ఞానంలేకుండా మాట్లాడటం సిగ్గుచేటు.
రాష్ట్రప్రభుత్వాలురుణాలు తీసుకోవాలన్నా ఆఖరికి కేంద్రాన్ని సంప్ర దించాల్సిందే. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీకి పెగాసస్ సాఫ్ట్ వేర్ పై అవగాహనలేకపోవచ్చు. ఎవరో కొందరు పీకేలు.. కేకేలు కావాలనే రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో నానాటికీ పెరిగిపోతున్న వ్యతిరేకత నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి తెరపైకి తెచ్చినఅంశం కావచ్చు. టీడీపీఎమ్మెల్సీ బీ.టెక్. రవిచెప్పినట్టుగా పెగాసస్ సాఫ్ట్ వేర్ చంద్రబాబు కొనిఉంటే, తాము నిజంగానే వివేకానందరెడ్డిహత్య జరగకుండా చూసేవాళ్లం కదా !
మోదీప్రభుత్వంపై పెగాసస్ ఆరోపణలువచ్చిననేపథ్యంలో సుప్రీంకో ర్టు స్వయంగా నిజనిర్థారణకు ఒకకమిటీని వేసింది. ఆకమిటీనే అసలువాస్తవాలు తేలుస్తుంది. మోదీప్రభుత్వం నిజంగా పెగాసస్ సాఫ్ట్ వేర్ కొన్నదోలేదో..త్వరలోనే సదరుకమిటీ తేలుస్తుంది. పెగాసస్ సాఫ్ట్ వేర్ చంద్రబాబు కొన్నారన్న ఆరోపణలు హాస్యాస్పద మైనవితప్ప, అసలైనవికావు. చంద్రబాబు ఎలాంటి నాయకులో ప్రపంచమంతా తెలుసు. ఆయనపై ఎలాంటిఆరోపణలు, కేసులు, అవినీతిమరకలులేవు. సుదీర్ఘకాలం రాజకీయాల్లో ఉండి ..అలా ఉన్న నిజాయితీపరుడు, నీతిమంతుడు చంద్రబాబు ఒక్క డే. అధికారంకోసం ఏదిపడితే అది మాట్లడడు…అబద్ధాలుచెప్పడని రాజకీయాలగురించి అవగాహనఉన్నవారందరికీ తెలుసు
తెలంగాణ బీజేపీ అధ్యక్షులు కూడా మాట్లాడుతూ, చంద్రబాబు హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో మత కలహాలు.. శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూశారన్నారు. చంద్రబాబు లాంటి నాయకుడు ఇల్లీగల్ అంశమైన పెగాసస్ సాఫ్ట్ వేర్ ను నమ్ముకునే వ్యక్తికాదు. కేంద్రప్రభుత్వంకూడా పెగా సస్ జోలికిపోయిందో…లేదో సుప్రీంకోర్టుకమిటీనే త్వరలో తేలుస్తుంది.
ప్రశాంత్ కిషోర్ (పీకే) అనేవ్యక్తిగతంలో తమప్రభుత్వం అధికారం లో ఉన్నప్పుడు కూడా 6 లక్షల కోట్ల అవినీతిజరిగిందని దుష్ప్ర చారం చేశాడు. మంచి పరిపాలనను కూడా ఘోరంగా చిత్రీకరించా డు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా రూపాయి అవినీతిని అయినా నిరూపించారా? టీడీపీని, చంద్రబాబుని ఏం పీకారు? బాబు, లోకేశ్ లపై చేయాల్సిన దుష్ప్రచారమంతా చేసింది పీకేనే.
ప్రజల్ని మిస్ లీడ్ చేసి, తాను అనుకున్నది నెరవేర్చిన పీకే, అంతిమంగా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేశాడు. నీతిమాలినవిధమైన చర్యలకుపాల్పడుతూ, జరగనిదాన్ని జరిగినట్లు చిత్రీకరించడంలో ప్రశాంత్ కిషోర్ నిష్ణాతుడు. అదే పీకే ఇప్పుడు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రివద్ద పనిచేస్తున్నాడు. అతనే ఆమెను తప్పుదారి పట్టించిఉండవచ్చని తాము అనుకుంటున్నాము. జగన్మోహన్ రెడ్డి గతంలోఆడిన కోడి కత్తి డ్రామాను, సొంతబాబాయ్ హత్యనుకూడా పీకే చంద్రబాబుకే ఆపాదించాలని చూశాడు.
మమతాబెనర్జీని కూడా వీల్ ఛైర్లో కూర్చోబెట్టి తిప్పి, ఎన్నికలయ్యాక లేపి కూర్చోబెట్టాడు. మమతా బెనర్జీతో పీకేనే చంద్రబాబు గురించి మాట్లాడించాడు అనడంలో ఎలాంటిసందేహంలేదు.పీకే చేసిన పనికిమాలిన ఆరోపణలకు ఆలూ చూలూ లేదు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరంకూడా మాకులేదు.
తాము అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర హక్కులు, ప్రయోజనాల కోసం మోదీ ప్రభుత్వాన్ని ఎదిరించి పోరాడాము. ఇప్పుడు కేంద్రం లో అధికారంలోఉంది మోదీ అయితే, ఇక్కడ అధికారంలో ఉంది జగన్మోహన్ రెడ్డి. నిజంగా మేం తప్పుచేసుంటే, ఆధారాలతో బయ టపెట్టి, మమ్మల్నిశిక్షించవచ్చుకదా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ప్రజలకోసం ఆలోచించి, రాష్ట్ర బాగుకోసం పనిచేశారుతప్ప, ఇలాంటి వాటికి ఎక్కడాఎప్పుడూ ఆస్కారమిచ్చిన వ్యక్తికాదు.
రాష్ట్రప్రభుత్వం నిజంగా పెగాసస్ సాఫ్ట్ వేర్ కొనిఉంటే, అధికారులకు తెలియకుండాఉంటుందా? డీజీపీగాపనిచేసిన సవాంగ్ ఆర్ టీఐ సమాచారంకింద ఏమీలేదని ఎందుకు చెబుతారు? ఈప్రభుత్వంపై ఫోన్లు ట్యాప్ చేస్తుందనే అభియోగాలు వచ్చా యి. కొందరు అధికారులు, టీడీపీ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నార న్న సమాచారం మావద్ద ఉంది. దానికి సంబంధించి తనపార్టీ తరుపున జగన్మోహన్ రెడ్డి అనధికారికంగా ఒకసాఫ్ట్ వేర్ కొన్నాడ ని ఇప్పటికీ చెప్పగలం. దాన్నిమేం నమ్ముతున్నాంకూడా.